జడ్జీల‌ను నిందించ‌డం ఈ రోజుల్లో ఫ్యాష‌న్ గా మారిపోయింది - సుప్రీంకోర్టు

Published : May 23, 2022, 04:37 PM IST
జడ్జీల‌ను నిందించ‌డం ఈ రోజుల్లో ఫ్యాష‌న్ గా మారిపోయింది - సుప్రీంకోర్టు

సారాంశం

జడ్జీలపై ఆరోపణలు చేస్తున్న కేసులు పెరిగిపోతున్నాయని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం అందరికీ జడ్జీలను నిందించడం ఒక ఫ్యాషన్ అయిపోయిందని తెలిపింది. న్యాయవాదులు కూడా చట్టానికి అతీతులు కాదని స్పష్టం చేసింది. 

జడ్జీలను నిందించడం ఈ రోజుల్లో ఫ్యాషన్‌గా మారిందని సుప్రీంకోర్టు ఆవేద‌న వ్య‌క్తం చేసింది. జడ్జీలను టార్గెట్ చేసుకుంటున్న కేసులపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి వైఖ‌రి మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లలో ఎక్కువగా ఉంద‌ని తెలిపింది. ఓ న్యాయ‌వాది ధిక్కారానికి పాల్పడినందుకు అత‌డిని దోషిగా నిర్ధారించి, 15 రోజుల జైలు శిక్ష విధిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుపై జోక్యం చేసుకోవడానికి  సుప్రీంకోర్టు నిరాక‌రించింది. ఈ సంద‌ర్భంగానే ఈ వ్యాఖ్య‌లు చేసింది. న్యాయమూర్తి ఎంత బలవంతుడు అయితే ఆరోపణలు అంత అధ్వాన్నంగా ఉంటున్నాయని పేర్కొంది.

న్యాయమూర్తులపై దేశవ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయని, జిల్లా జడ్జీలకు భద్రత లేదని, ఒక్కోసారి లాఠీలు ఝులిపించ‌డానికి పోలీసులు కూడా అందుబాటులో ఉండరని జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. జైలు శిక్షను సమర్థిస్తూ, న్యాయవాదులు చట్టానికి అతీతులు కాదని కోర్టు పేర్కొంది. ‘‘న్యాయ ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే వారు కూడా పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది" అని తెలిపింది. 

బట్టతల బయటపడటంతో పీటలపైనే ఆగిన పెళ్లి.. సొమ్మసిల్లి వరుడు పడిపోవడంతో బండారం బట్టబయలు

నిందితుడైన లాయర్‌పై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ.. ‘‘ ఇలాంటి లాయర్లు న్యాయ ప్రక్రియకు మచ్చ. వారితో కఠినంగా వ్యవహరించాలి’’ అని కోర్టు పేర్కొంది. “ఈ వ్యక్తి పూర్తిగా క్షమించరానివాడు. ఆయ‌న  పూర్తిగా అసమర్థులైన న్యాయవాదుల తరగతికి చెందినవాడు. వారు న్యాయవాద వృత్తికి మచ్చ.’’ అని కఠిన పదాలు ఉపయోగిస్తూ కోర్టు వ్యాఖ్యలు చేసింది. 

‘‘న్యాయమూర్తి అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. హైకోర్టు సమీపంలోని టీ స్టాల్ వద్ద ఆయ‌న దొరికిపోయాడు. అప్పుడు 100 మంది న్యాయవాదులు అతనిపై పడుకుని నాన్-బెయిలబుల్ వారెంట్ (NBW) అందించకుండా నిరోధించారు. అక్కడ సీసీటీవీ ఫుటేజీ ఉంది..ఇంకా దారుణం ఏంటంటే ఆయ‌న తిరిగి వ‌చ్చి జస్టిస్ పీటీ ఆశాపై ఆరోపణలు చేశారు’’ అని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. రెండు వారాల జైలు శిక్ష అనేది చాలా తేలికైన శిక్ష అని, ఆ లాయ‌ర్ రెండు వారాల పాటు జైలుకు వెళ్తే, ప్రాక్టీస్ నుంచి నిషేధానికి గురైతే కొంత పశ్చాత్తాపం వ‌స్తుంద‌ని కోర్టు పేర్కొంది. 

శ్రీన‌గ‌ర్ లో రెడ్ అలెర్ట్.. భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌పై దాడికి అవ‌కాశం.. ఇంటిలెజెన్స్ హెచ్చ‌రిక‌..

కొన్ని హైకోర్టుల్లో న్యాయమూర్తులను బహిరంగంగానే బెదిరించడం పరిపాటిగా మారిందని జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ‘‘ ధైర్యముంటే నాకు వ్యతిరేకంగా NBW జారీ చేయాలని నిందితుడు అన్నారు ’’ అని తెలిపారు. ‘‘ మీరు అనవసరమైన ఆరోపణలు చేయలేరు. 100 మంది న్యాయవాదులు గుమిగూడడాన్ని ఊహించుకోండి. న్యాయవాదులు కూడా చట్ట ప్రక్రియకు లోబడే ఉంటారు. ఇప్పుడు న్యాయమూర్తులపై ఆరోపణలు చేయడం కొత్త ఫ్యాషన్‌గా మారుతోంది’’ అని జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు ముంబై, ఉత్తరప్రదేశ్, చెన్నైలలో పెద్ద ఎత్తున జ‌రుగుతున్నాయ‌ని అన్నారు. కాగా ఈ కేసులో తాను బేషరతుగా క్షమాపణలు చెప్పానని, అయితే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడానికి నిరాకరించిందని నిందితుడైన న్యాయ‌వాది తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Modi speech at the African Parliament:భారత్–ఇథియోపియా సంబంధాల్లో కొత్త అధ్యాయం | Asianet News Telugu
Reliance Jio : అంబానీ మామ న్యూఇయర్ గిప్ట్ ...జియో యూజర్స్ కి రూ.35,100..!