Tamil Nadu: వితంతువుపై సామూహిక అత్యాచారం.. ఆపై వీడియో తీసి.. ?

Published : May 23, 2022, 03:25 PM IST
Tamil Nadu: వితంతువుపై సామూహిక అత్యాచారం.. ఆపై వీడియో తీసి.. ?

సారాంశం

Gangrape: 29 ఏండ్ల ఓ వితంతువుపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. అంత‌టితో ఆగ‌కుండా ఆమెను దారుణంగా కొట్టి.. ద‌గ్గ‌ర వున్న న‌గ‌లు డ‌బ్బు దొచుకున్నారు. ఈ మొత్తం నేరాన్ని నిందితులు వీడియో రికార్డు చేశారు.   

Tamil Nadu: దేశంలో మ‌హిళ‌ల రక్ష‌ణ ఆందోళ‌న క‌లిగిస్తోంది. మ‌హిళా రక్ష‌ణ కోసం ఎన్ని చ‌ట్టాలు తీసుకువ‌చ్చినా.. వాటి అమ‌లు తీరు లోప‌మో ఎమో గానీ.. నిత్యం దేశంలో ఏదో ఒక‌చోట మ‌హిళ‌ల‌పై దారుణాలు జ‌రుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా వ‌రుస లైంగిక‌దాడులు చోటుచేసుకోవ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఈ క్రమంలోనే 29 ఏండ్ల ఓ వితంతువుపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. అంత‌టితో ఆగ‌కుండా ఆమెను దారుణంగా కొట్టి.. ద‌గ్గ‌ర వున్న న‌గ‌లు డ‌బ్బు దొచుకున్నారు. ఈ మొత్తం నేరాన్ని నిందితులు వీడియో రికార్డు చేశారు. ఈ దారుణం గురించి ఎవ‌రికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరించారు. ఈ వీడియోను నెట్టింట్లో పెడ‌తామంటూ హెచ్చ‌రించారు. ఈ దారుణ ఘ‌ట‌న త‌మిళ‌నాడులో చోటుచేసుకుంది. కేసు న‌మోదుచేసుకున్న పోలీసులు.. ద‌ర్యాప్తు చేస్తున్నారు. 

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు వెల్ల‌డించిన వివరాలు ఇలా ఉన్నాయి.. తమిళనాడులోని నమక్కల్‌లో 29 ఏళ్ల వితంతువుపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. అంత‌టితో ఆగ‌కుండా ఆమెను కొట్టి హింసించారు. ద‌గ్గ‌ర‌వున్న డ‌బ్బు, న‌గ‌లు దొచుకున్నారు. ఈ నేరాన్ని దుండ‌గులు వీడియో తీశారు. జ‌రిగిన విష‌యం ఎవ‌రికైనా చెబితే ప్రాణాలు తీస్తామంటూ బెదిరించారు. వీడియోను నెట్టింట్లో పెడ‌తామంటూ హెచ్చ‌రించారు. మే 19న వీశానం సరస్సు సమీపంలో తన స్నేహితుడితో కలిసి ఉండగా నలుగురు వ్యక్తులు తమను చుట్టుముట్టి దోచుకున్నారని ఆ మహిళ ఫిర్యాదు చేసింది. ఆమె 12 గ్రాముల బంగారు గొలుసు ధరించాన‌ని చెప్పింది. 

దుండగులు ఆమెపై దాడి చేసి, ఏకాంత ప్రాంతానికి తీసుకెళ్లి, అక్కడ ఆమెపై కొన్ని గంటలపాటు దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ముఠా తన స్నేహితుడు, త‌న‌పై దారుణంగా దాడి చేసి, దోచుకుని, నేరాన్ని రికార్డ్ చేయడానికి అతని ఫోన్‌ను తీసుకెళ్లార‌ని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి.. చివ‌ర‌కు ప్రాణాల‌తో బాధితుల‌ను ఆ ముఠా వారిని విడిచిపెట్టింది. దీంతో బాధితురాలు నమక్కల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సెక్ష‌న్లు 392, 376 బి, 506 (1), 67 కింద కేసు నమోదు చేశారు. కేసు న‌మోదుచేసుకుని రంగంలో దిగిన పోలీసులు న‌లుగురు నిందితుల‌ను గుర్తించారు. వారిలో ముగ్గురిని అదుపులోకి తీసున్నారు.  నిందితులైన నవీన్‌కుమార్‌ (21), దినేష్‌కుమార్‌ (21), మురళిని పోలీసులు అరెస్టు చేశారు. తదుపరి విచారణ జరుగుతోంద‌ని తెలిపారు. 

ఇదిలావుండ‌గా, ఓ వ్యాపారవేత్త తమ ఇంట్లో అద్దెకు ఉంటున్న ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తుపాకీతో  బెదిరించి మరీ ఈ దారుణానికి పాల్పడటం గమనార్హం. ఈ సంఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్ కి చెందిన ఓ 20ఏళ్ల యువతి.. బెంగళూరులో బీఏ చదువుతోంది. కాగా.. బెంగళూరు నగరంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ.. ఆమె తన చదువును పూర్తి చేస్తోంది. కాగా... ఆమెను ఓ వ్యాపారి తుపాకీతో  బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఏప్రిల్ 11వ తేదీన చోటుచేసుకోగా.. ఇటీవల వెలుగులోకి రావడం గమనార్హం. కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఇదేం చలిరా నాయనా..! చివరకు గోవులకు కూడా దుప్పట్లా..!!
Modi speech at the African Parliament:భారత్–ఇథియోపియా సంబంధాల్లో కొత్త అధ్యాయం | Asianet News Telugu