అర్థరాత్రి ఇంటిచుట్టూ చక్కర్లు కొట్టిన బ్లాక్ పాంథర్.. ఒళ్లు జలదరించే వీడియో..

By SumaBala BukkaFirst Published Feb 17, 2024, 12:19 PM IST
Highlights

బ్లాక్ పాంథర్ కు చెందిన ఓ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. అది జనావాసాల్లోకి రావడం ఇంటిచుట్టూ చక్కర్లు కొట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 

తమిళనాడు : రాత్రి పూట ఇంటిబయట కళ్లు మెరుస్తూ నల్లటి జీవి చక్కర్లు కొట్టిందనుకోండీ.. ఆ విషయం మీకు తెలియదు. కానీ సీసీ ఫుటేజీలో అది వెలుగు చూసిందనుకోండీ.. ఒళ్లు జలదరిస్తుంది కదా.. అలాంటి ఓ వీడియోనే ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కస్వాన్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇందులో తమిళనాడు, నీలగిరిలోని ఒక ఇంటి వెలుపల బ్లాక్ పాంథర్ తిరుగుతున్న వీడియోను ఇంటర్నెట్ దృష్టిని ఆకర్షించారు. గత ఏడాది ఆగస్టులో ఈ ఘటన జరిగినట్లు సీసీటీవీలో రికార్డైన వివరాలు తెలుపుతున్నాయి.

ఫిబ్రవరి 16న ఈ వీడియోను ఎక్స్ లో షేర్ చేసిన ఈ వీడియోలో బ్లాక్ పాంథర్ భయం గొలిపేలా ఉంది. అది ఇంటి ముందు యార్డ్ చుట్టూ దొంగలా తిరుగుతుండడం.. ఒకవేళ ఆ సమయంలో ఎవరైనా బైటికి వస్తే అనే భయాన్ని ఆలోచించేలా చేసింది. 36-సెకన్ల ఈ క్లిప్ లో ముందు ఒక ఇంటి ముందు ప్రాంగణం ఎలాంటి అలికిడి లేని ప్రశాంతంగా కనిపిస్తుంది. ఆ తరువాత మెల్లిగా బిగ్ క్యాట్ ఎంట్రీ ఇస్తుంది. దీంతో వీడియోలో అలజడి మొదలవుతుంది. 

సీమా హైదర్ కేసులో మళ్లీ ట్విస్ట్.. ఏం జరిగిందంటే ?

ఈ వీడియో సోషల్ మీడియా వినియోగదారులలో భయాన్ని రేకెత్తించింది. "ఎవరైనా ఇలా చడీ, చప్పుడు చేయకుండా వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. నీలగిరిలోని ఒక ఇంటికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ఇది. బ్లాక్ పాంథర్ ఇంకా ఎక్కడెక్కడ ఉంటుందో తెలుసా" అని కస్వాన్ తన పోస్ట్‌ హెడ్డింగ్ పెట్టారు. 

ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసినప్పటి నుండి ఈ వీడియో 1 లక్షకు పైగా వ్యూస్ సాధించింది. చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు ఇది చూసి భయపడుతుండగా, మరికొందరు ఇది అద్భుతంగా, అందంగా ఉందని చెప్పారు. "బ్లాక్ పాంథర్స్ చాలా సిగ్గరి, ఇది జనావాసాల్లోకి స్వేచ్ఛగా ఎలా వచ్చింది" అని ఒకరు కామెంట్ చేశారు. మరొకరు మాట్లాడుతూ.. చూస్తుంటే భయంగా ఉంది.. అదే సమయంలో బ్లాక పాంథర్ అందంగా ఉంది.. అని కామెంట్ చేశారు. ఇంకొకరు "ఇది చాలా ప్రమాదకరమైనది, పర్వీన్‌ ఇది షేర్ చేసినందుకు ధన్యవాదాలు" అని తెలిపారు. 

 

(also spotted in Buxa ♥️) https://t.co/CVt8HNvzc7

— Ananya Bhattacharya (@ananya116)
click me!