Rahul Gandhi: బీజేపీ విద్వేష రాజ‌కీయాలు దేశానికి హానిక‌రం.. విద్వేషాన్ని ఓడించే స‌మ‌యమిది: రాహుల్ గాంధీ

Published : Jan 16, 2022, 04:35 PM IST
Rahul Gandhi: బీజేపీ విద్వేష రాజ‌కీయాలు దేశానికి హానిక‌రం.. విద్వేషాన్ని ఓడించే స‌మ‌యమిది: రాహుల్ గాంధీ

సారాంశం

Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మరోసారి ఫైర్ అయ్యారు. దేశంలో బీజేపీ విద్వేష రాజకీయాలు చేస్తున్నదనీ, దీనిని మరింత పెంచుతూ ముందుకు సాగుతూ  ప్ర‌జ‌ల‌ను విభ‌జిస్తున్న‌దంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ విద్వేష రాజ‌కీయాలు దేశానికి  పెద్ద మొత్తంలో హానిని క‌లిగిస్తాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.   

Rahul Gandhi: భార‌తీయ జ‌న‌తా పార్టీ  చేస్తున్న విద్వేష రాజ‌కీయాలు భార‌త్‌కు తీవ్ర‌మైన న‌ష్టాన్ని క‌లుగ జేస్తాయ‌ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. దేశంలో బీజేపీ విద్వేష రాజకీయాలు చేస్తున్నదనీ, దీనిని మరింత పెంచుతూ ముందుకు సాగుతూ  ప్ర‌జ‌ల‌ను విభ‌జిస్తున్న‌దంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ విద్వేష రాజ‌కీయాలు దేశానికి అపార‌మైన హానిని క‌లిగిస్తాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. బీజేపీ విద్వేష రాజకీయాలు భారత్‌కు హానికరమని, దేశంలో నిరుద్యోగం పెరగడానికి అదే కారణమని రాహుల్‌ గాంధీ అభిప్రాయపడ్డారు. సామాజిక శాంతి లేకుండా స్వదేశీ, విదేశీ పరిశ్రమలు నడవలేవని, ఈ ద్వేషాన్ని సోదరభావంతో ఎదుర్కొనేందుకు ప్రజల నుంచి సాయం చేయాలని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.

స‌మాజంలో శాంతి లేకుండా దేశీయ‌, విదేశీ ప‌రిశ్ర‌మ‌లు న‌డువ‌డం క‌ష్టం. మీ చుట్టూ పొంచి ఉన్న విద్వేషాన్ని సోద‌ర‌భావంతో ఓడించాలి. ఆర్ యూ విత్ మీ..? యాష్ నో హేట్ అని రాహుల్‌గాంధీ ట్విట్ట‌ర్లో పేర్కొన్నారు. అలాగే, బీజేపీపై ప‌లు విమ‌ర్శ‌లు గుప్పించి రాహుల్ గాంధీ.. ప్ర‌ధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ స‌ర్కారు ప‌నితీరుపైనా ఓ పోల్ నిర్వ‌హించారు. బీజేపీ ప్ర‌భుత్వం ఏ అంశంలో ప్ర‌ధానంగా విఫ‌ల‌మైంద‌ని ప్ర‌శ్నిస్తూ.. నిరుద్యోగం, ప‌న్నుల ఎగ‌వేత‌, ధ‌రల పెరుగుద‌ల, విద్వేష వాతావ‌ర‌ణం అనే నాలుగు ఆప్ష‌న్‌లు ఇచ్చారు. ఈ పోల్ 347,396 మంది పాల్గొన్నారు. 35 శాతం మంది ప్రజలు బీజేపీ విద్వేష రాజ‌కీయాలు చేస్తున్న‌ద‌నే ఆప్ష‌న్ ను ఎంచుకున్నారు. ఇది ద్వేషపూరిత వాతావరణాన్ని బీజేపీ పెంచిపోషిస్తున్న‌ద‌నే అంశాన్ని సూచిస్తున్న‌ద‌ని రాహుల్ పేర్కొన్నారు. 

ఈ పోల్ లో ఎక్కువ మంది మోడీ స‌ర్కారు వైఫ‌ల్యం చెందిన అంశాల్లో నిరుద్యోగం రెండో స్థానంలో ఉంది.  పోల్‌తో ఇంటరాక్ట్  అయిన వారిలో 28 శాతం మంది దీనికి ఓటు వేశారు. 17.2 శాతం మంది ప్రజలు పన్నుల ఎగ‌వేత అంశానికి ఓటు వేయ‌గా, 19.28 శాతం మంది నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ స‌ర్కారు ద్రవ్యోల్బణం  త‌గ్గించే చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డం  అతిపెద్ద లోపమని చెప్పారు. అంత‌కు ముందు కూడా బీజేపీపై రాహుల్ గాంధీ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. దేశంలో నిరుద్యోగం తీవ్రమైన సంక్షోభంగా ఉందని, దానిని పరిష్కరించడం ప్రధానమంత్రి బాధ్యత అని అన్నారు. దేశానికి సమాధానాలు కావాలి.. సాకులు చెప్పుకురావ‌డం కాదు అన్నారు.

 

“నిరుద్యోగం చాలా లోతైన సంక్షోభం - దానిని పరిష్కరించడం ప్రధానమంత్రి బాధ్యత. దేశం సమాధానాలు అడుగుతోంది, సాకులు చెప్పడం మానేయండి” అని గాంధీ హిందీలో ట్వీట్ చేశారు. ట్వీట్‌తో పాటు నిరుద్యోగ సంక్షోభం ఎంత లోతుగా ఉందో  వివ‌రించే నివేదికను కూడా ట్యాగ్ చేశాడు.  ఐదు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలను “ద్వేషాన్ని ఓడించడానికి సరైన అవకాశం” అని అభివర్ణించారు. హిందీలో చేసిన ట్వీట్‌లో, “నఫ్రత్ కో హరానే కా సాహీ మౌకా హై” అని అన్నారు. (ద్వేషాన్ని ఓడించడానికి ఇది సరైన అవకాశం).
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం