goa assembly election 2022 : ఢిల్లీలో క‌రోనా పెరుగుతుంటే కేజ్రీవాల్ గోవాలో ఏం చేస్తున్నారు - సంజ‌య్ రౌత్

By team teluguFirst Published Jan 16, 2022, 4:23 PM IST
Highlights

ఢిల్లీలో కరోనా విజృంభిస్తున్న ఈ తరుణంలో సీఎం కేజ్రీవాల్ గోవాలో ఏం చేస్తున్నారని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ ప్రశ్నించారు. ఇప్పుడు ఆయన అవసరం ఢిల్లీకే ఉందని అన్నారు. ఈ మేరకు సంజయ్ రౌత్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. 

ఢిల్లీలో క‌రోనా కేసులు పెరుగుతుంటే అర‌వింద్ కేజ్రీవాల్ (arvind kejriwal) గోవాలో ఏం చేస్తున్నార‌ని శివ‌సేన నాయ‌కుడు సంజ‌య్ రౌత్ (shivasena leader sanjay routh) మండిప‌డ్డారు.  దేశ రాజ‌ధాని ఢిల్లీలో కోవిడ్‌ విజృంభిస్తున్న ప్ర‌స్తుత తరుణంలో గోవాలో ఇంటింటి ప్రచారం చేయవద్దని సూచించారు. ఆదివారం సంజ‌య్ రౌత్ మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో కేసులు పెరుగుతున్నప్పటికీ ఢిల్లీ సీఎం గోవాలో ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేస్తున్నార‌ని, ఆయ‌నకు ఏం కావాల‌ని ప్ర‌వ్నించారు. దీనికి అర‌వింద్ కేజ్రీవాల్ స‌మాధానం చెప్పాల‌ని అన్నారు. ఢిల్లీలో అర‌వింద్ కేజ్రీవాల్ పార్టీ (ఆమ్ ఆద్మీ పార్టీ) అంత బ‌లంగా ఉండే గోవాను ఆయ‌న ఎందుకు సంద‌ర్శిస్తార‌ని అన్నారు. కేసులు పెరుగుతున్న స‌మ‌యంలో ఢిల్లీకి ఆయ‌న అస‌వ‌రం చాలా ఉంద‌ని తెలిపారు.  

గోవా అసెంబ్లీ (goa assembly) ఎన్నికలకు కేవలం నెల‌ రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నేప‌థ్యంలో శనివారం గోవా చేరుకున్న అర‌వింద్ కేజ్రీవాల్ తన పార్టీ అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికీ తిరుగుతూ ఆప్ కు ఓటు వేయాలని అన్నారు. అంతకు ముందు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. 13 అంశాలతో కూడిన మేనిఫెస్టోను ఆయ‌న విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వ‌స్తే.. స్థానిక యువ‌త‌కు ఉపాధి క‌ల్పిస్తామ‌ని తెలిపారు. ఉపాధి దక్కని యువ‌కుల‌కు నెల‌కు రూ. 3 వేలు అందుతుంద‌ని అన్నారు. ప్ర‌స్తుతం మైనింగ్ కు భారీ వ‌డ్డీ ఉంద‌ని అన్నారు. తాము అధికారంలోకి వ‌చ్చిన ఆరు నెల‌ల త‌రువాత భూ హ‌క్కులు కల్పిస్తామ‌ని అన్నారు. 

మెరుగైన, ఉచిత వైద్యం కోసం గోవాలోని ప్రతి గ్రామం, జిల్లా స్థాయిలో మొహల్లా క్లినిక్‌లు (mohalla clinic), హాస్పిట‌ల్స్ (hospitals) ఏర్పాటు చేస్తామ‌ని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. రైతు సంఘాల‌తో చ‌ర్చించిన త‌రువాత వ్యవసాయం ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని హామీ ఇచ్చారు. వాణిజ్య వ్యవస్థను స‌ర‌ళీకృతం చేస్తామ‌ని అన్నారు. ఆప్ గోవాలో అధికారం చేప‌డితే రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు రూ.1000 అందజేస్తామని అర‌వింద్ కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. గోవాలో 24 గంట‌ల పాటు ఉచితంగా క‌రెంట్, నీటిని అందిస్తామ‌ని అన్నారు. రోడ్లు మెరుగుప‌రుస్తామ‌ని తెలిపారు. అన్ని గ‌వ‌ర్న‌మెంట్ స్కూళ్ల‌లో (government schools)ఉచిత విద్య అందిస్తామ‌ని తెలిపారు. 

ఫిబ్ర‌వ‌రి 14వ తేదీన జరగనున్న గోవా ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటి వరకు రెండు సార్లు అభ్యర్థుల జాబితాలను విడుదల చేసింది, ఇందులో బీజేపీ మాజీ మంత్రులు మహదేవ్ నాయక్ (mahadev nayak), అలీనా సల్దాన్హా (aleena saldhanha), పోలిటీషయన్ గా మారిన లాయర్ అమిత్ పాలేకర్‌లను (amith palekar)  ఉన్నారు. 40 మంది సభ్యులున్న గోవా అసెంబ్లీకి 2017లో ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ ఎన్నిక‌ల్లో ఆప్ పోటీ చేసినా.. ఒక్క స్థానం కూడా గెల‌వ‌లేదు. గోవా బ‌రిలో బీజేపీ, కాంగ్రెస్, మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ, గోవా ఫార్వర్డ్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, ఈ సారి కొత్త‌గా టీఎంసీ కూడా పోటీ చేయ‌నుంది. అయితే ఎన్ సీపీ కూడా 10-15 స్థానాల్లో పోటీ చేయ‌నుంద‌ని శివ‌సేన నాయ‌కుడు సంజ‌య్ రౌత్ తెలిపారు. 

click me!