యూపీ‌ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచిన Archana Gautam.. బికినీ ఫొటోలు వైరల్.. అసలు ఆమె ఎవరు..?

By Sumanth KanukulaFirst Published Jan 16, 2022, 3:42 PM IST
Highlights

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ వేడి రోజురోజుకు పెరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ గురువారం 125 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అందులో మీరట్‌లోని హస్తినాపూర్‌ నుంచి బరిలో నిలిచిన Archana Gautamను కొందరు ట్రోల్ చేస్తున్నారు. 
 

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ వేడి రోజురోజుకు పెరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ గురువారం 125 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో 40 శాతం సీట్లను మహిళలకు కేటాయించారు. మీరట్‌లోని హస్తినాపూర్‌ నుంచి నటి, మోడల్.. అర్చన గౌతమ్‌ను కాంగ్రెస్‌ పోటీకి దింపింది. అయితే ఆమెకు కాంగ్రెస్ టికెట్ ప్రకటించిన కొద్దిసేపటికే కొందరు సోషల్ మీడియాలో ఆమెను టార్గెట్ చేశారు. Archana Gautam గ్లామర్ ఫీల్డ్‌లో ఉండటంతో.. ఆమె ఫొటోలు పోస్టు చేసి ఇలాంటి వారికి టికెట్ ఇస్తారా అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. 

అసలు అర్చన గౌతమ్ ఎవరు.. 
మిస్ బికినీ ఇండియా 2018 అందాల పోటీలో అర్చన విజేతగా నిలిచారు. కొందరు ఆమెను బికినీ గర్ల్ అని కూడా పిలుస్తారు. ఆమె సోషల్ మీడియాలో చాలా మందే ఫాలోవర్స్ ఉన్నారు. అయితే అర్చన పనిచేసేది గ్లామర్ ఫీల్డ్ కావడంతో.. ఆమె హాట్‌గా బోల్డ్ ఫొటోలను, వీడియోలను తన సోషల్ మీడియా అకౌంట్స్‌లో షేర్ చేస్తుంటారు. అంతేకాకుండా ఇన్‌స్టా రీల్స్ కూడా చేస్తుంటారు. ఆమె అప్‌లోడ్ చేసే వీడియోలకు, ఫొటోలకు లైక్‌లు, కామెంట్స్ కూడా భారీగానే వస్తుంటాయి. 

అర్చన.. 1995 సెప్టెంబర్1న మీరట్‌లోని పార్తాపూర్‌లో జన్మించారు. మీరట్‌లోని గంగానగర్‌లోని ఐఐఎంటీ కాలేజీలో మాస్ కమ్యూనికేషన్ చదివారు. చదవుతున్న సమయంలోనే ఆమె యాక్టింగ్, మోడలింగ్‌ను కొనసాగించారు. మాస్ కమ్యూనిషన్ పూర్తి చేశాక.. ఆమె ముంబై‌కు వెళ్లారు. ఇక, అర్చన పలు టీవీ సీరియల్స్‌తో పాటు యాడ్స్‌లో కూడా నటించారు. ఆమె 2015లో  గ్రేట్ గ్రాండ్ మస్తీ చిత్రంలో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కూడా కొన్ని చిత్రాలు చేసింది. ఇతర భాషల్లో కూడా సినిమాలు చేస్తుంది. గతేడాది నవంబర్‌లో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు.

 

అలా చూడొద్దని కోరిన అర్చన.. 
అయితే తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని Archana Gautam ఖండించారు. తన వృత్తిని కలిపి చూడొద్దని కోరారు. ‘నేను మిస్ బికినీ 2018లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాను. నేను మిస్ ఉత్తరప్రదేశ్ 2014.. మిస్ కాస్మో వరల్డ్ 2018‌లలో విజేతగా నిలిచాను. సినీ పరిశ్రమలో నా వృత్తిని నా రాజకీయ జీవితంలో విలీనం చేయవద్దని ప్రజలను అభ్యర్థిస్తున్నాను’ అని అర్చన పేర్కొన్నారు. 

ఎన్నికలకు ముందు హస్తినాపురంపై తన విజన్ గురించి మాట్లాడిన అర్చన.. ఎన్నికల్లో గెలిస్తే తన ప్రధాన దృష్టి అభివృద్ధి పనులపైనే ఉంటుందని అన్నారు. హస్తినప్రదేశ్‌లో నగరంగా పర్యాటకాన్ని ప్రోత్సహిస్తానని తెలిపారు. ‘హస్తినాపురం పర్యాటక ప్రాంతం, పురాతన ఆలయాలు చాలా ఉన్నాయి. కానీ కనెక్టివిటీ సమస్య కారణంగా ఇక్కడికి పర్యాటకులు రాలేకపోతున్నారు. ఎమ్మెల్యే అయిన తర్వాత బస్టాండ్, రైల్వేస్టేషన్ నిర్మించడమే నా మొదటి ప్రాధాన్యత. టూరిజం పెరిగితే.. ఎక్కువ మంది పర్యాటకులు వస్తారు. ప్రజలకు ఉపాధి లభిస్తుంది’ అని చెప్పారు. 

click me!