బీజేపీ పొలిటికల్ వింగ్ ఈడీ.. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కుట్ర - ఆమ్ ఆద్మీ పార్టీ..

By Sairam Indur  |  First Published Mar 19, 2024, 12:14 PM IST

ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ పై, బీజేపీపై తీవ్ర విమర్శలు చేసింది. ఈడీ బీజీపీకి పొలిటికల్ వింగ్ ల పని చేస్తోందని ఆరోపించింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ ఒక కుట్ర అని విమర్శించింది.


ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ పై ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శలు చేసింది. ఈడీ బీజేపీకి ఒక పొలిటికల్ వింగ్ అని ఆరోపించింది. ఈ మేరకు ఆ పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ ఒక కుట్ర అని విమర్శించింది. ప్రతి రోజూ అవాస్తవాలు ప్రచారం చేయడం ద్వారా అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాల ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఈడీ ప్రయత్నిస్తోందని అన్నారు. 

ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తులో ఎలాంటి కొత్త వాస్తవాలు, సాక్ష్యాధారాలు లేవని ఆప్ పేర్కొంది. 500కు పైగా దాడులు నిర్వహించి, వేలాది మంది సాక్షులను విచారించినప్పటికీ ఈ కేసులో ఒక్క రూపాయి, సాక్ష్యాధారాలను కూడా స్వాధీనం చేసుకోకపోవడం దాని నైరాశ్యానికి నిదర్శనమని తెలిపింది. ‘‘ఈ వ్యవహారంలో రూ.100 కోట్ల మనీలాండరింగ్ ఉందన్న ఈడీ వాదనను సుప్రీంకోర్టు కూడా తోసిపుచ్చింది. ఎక్సైజ్ కేసు మొత్తం నకిలీదని, ఎలాంటి ఆధారాలు లేవని ప్రపంచానికి ఇప్పటికే తెలుసు’’ అని ఆప్ పేర్కొంది.

Latest Videos

గత రెండేళ్లుగా మద్యం పాలసీ కేసుతో సంబంధం ఉన్న నేరాల ఆదాయాన్ని కనుగొనడానికి దర్యాప్తు సంస్థ ప్రయత్నిస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ తెలిపింది. ‘‘మనీశ్ సిసోడియా సహా పలువురు ఆప్ నేతల ఇళ్లపై ఐటీ దాడులు జరిపినా ఒక్క రూపాయి కూడా దొరకలేదు. అయితే బీజేపీకి ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చిన దాదాపు అన్ని కంపెనీలపై గతంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దాడులు చేసిన విషయం తెలిసిందే. అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీలు దాడులు జరిగిన వెంటనే తమ నేరాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని బీజేపీ ఖాతాలకు బదిలీ చేశాయి.’’ అని ఆరోపించింది.

దీనిపై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తే కనీసం వెయ్యి ఎఫ్ఐఆర్ లు నమోదవుతాయని ఆమ్ పేర్కొంది. ‘‘ఎక్సైజ్ పాలసీ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దాడులు చేసిన కంపెనీలు కూడా ఇందులో ఉన్నాయి, ఇవి తరువాత బీజేపీకి ఎలక్టోరల్ బాండ్లను విరాళంగా ఇచ్చాయి. ’’ అని ఆప్ ఆరోపించింది. 

ఇదిలా ఉండగా.. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై మార్చి 16వ తేదీన సాయంత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసింది. ఆ రోజు మధ్యాహ్నం నుంచి ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం ఆమె నివాసంలో సోదాలు జరిపింది. మరుసటి రోజు ఆమెను ప్రత్యేక పిఎంఎల్ఎ కోర్టులో హాజరుపరచగా, మార్చి 23 వరకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కస్టడీ విధించింది.

click me!