Shashi Tharoor : మ‌ళ్లీ పూర్వ వైభవం సాధించే సత్తా కాంగ్రెస్ కు ఉంది: శశి థరూర్

Published : Mar 13, 2022, 11:33 PM IST
Shashi Tharoor :  మ‌ళ్లీ పూర్వ వైభవం సాధించే సత్తా కాంగ్రెస్ కు ఉంది: శశి థరూర్

సారాంశం

Shashi Tharoor : కాంగ్రెస్ పార్టీకి  మళ్ళీ పూర్వ వైభవాన్ని సాధించే సత్తా ఉందని ఆ పార్టీ సీనియర్ నేత శశి థరూర్ అన్నారు. ప్రతిపక్ష పార్టీల్లో అత్యంత విశ్వసనీయతగల పార్టీగా నేటికీ నిలబడుతోందని శశి థరూర్ పేర్కొన్నారు. ఈ ఆశావాదానికి మద్దతుగా దేశవ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీల ఎమ్మెల్యేల సంఖ్యలతో ఓ ట్వీట్ చేశారు.ఆదివారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది.  

Shashi Tharoor : ఇటీవల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నికల  కాంగ్రెస్ పార్టీ ఘోర‌ పరాజయం పాలైన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో వైఫ‌ల్యాల‌కు కార‌ణాల‌ను చర్చించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆదివారం స‌మావేశం అయ్యింది.  ఈ సమావేశమైన నేపథ్యంలో ప్రతిపక్ష శిబిరంలో అత్యధిక సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ కాంగ్రెసే పార్టీ సీనియర్ నేత శశి థరూర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని సాధించే సత్తా ఉందని శశి థరూర్ అన్నారు. ప్రతి పక్ష పార్టీల్లో అత్యంత విశ్వసనీయత గల పార్టీగా కాంగ్రెస్ నేటికీ నిలబడుతోందని పేర్కొన్నారు. 

దేశవ్యాప్తంగా కౌంటీలోని ఆయా పార్టీలకు ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారనే జాబితాను థరూర్ ట్విట్టర్‌లో పంచుకున్నారు. శ‌శిథ‌రూర్ షేర్ చేసిన జాబితా ప్రకారం, కాంగ్రెస్‌కు 750 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉన్నారు, 1,400 మందికి పైగా శాసనసభ్యులు ఉన్న బిజెపి తర్వాత అత్యధికంగా ఉన్నారు. దేశవ్యాప్తంగా ప్రధాన పార్టీలకుగల ఎమ్మెల్యేల సంఖ్యలతో ఓ పట్టికను ఇచ్చారు. ఏ సంవ‌త్స‌రంలో ఈ ప‌ట్టిక‌ను రూపొందించారో తెలియ‌దు. కానీ, బీజేపీకి 1,443 ఎమ్మెల్యే స్థానాలు, కాంగ్రెస్‌కు 753 ఎమ్మెల్యే స్థానాలు, టీఎంసీకి 236 ఎమ్మెల్యే స్థానాలు, ఆమ్ ఆద్మీ పార్టీకి 156 ఎమ్మెల్యే స్థానాలు, వైకాపాకు 151 ఎమ్మెల్యే స్థానాలు, డీఎంకేకు 139 ఎమ్మెల్యే స్థానాలు, బీజేడీకి 114 ఎమ్మెల్యే స్థానాలు, టీఆర్ఎస్‌కు 103 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయ‌ని తెలిపారు. 

ఇదిలా ఉంటే..  అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఎంపీ శశిథరూర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ భారతదేశం కోసం నిలబడిన ఆలోచనను పునరుద్ఘాటించాల్సిన సమయం ఆసన్నమైందని, ఆ ఆలోచనలను పునరుజ్జీవింపజేసే విధంగా..  ప్రజలను ఉత్తేజపరిచే విధంగా.. పార్టీ సంస్థాగత నాయకత్వాన్ని సంస్కరించాలని అన్నారు. .

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఘోర ప‌రాజ‌యం పాలైంది. పంజాబ్ లో అధికారంలో  ఉన్న‌ కాంగ్రెస్..  ఆప్ చేతిలో ఓడిపోయింది, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ ల్లో కాంగ్రెస్ ఘోరాప‌రాజ‌యం పాలైంది. కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో దారుణంగా ప‌డిపోయింది. ఉత్తర​ప్రదేశ్​లో కాంగ్రెస్ అభ్యర్థులు రికార్డు స్థాయిలో డిపాజిట్​ కోల్పోవడం ఆ పార్టీ దుస్థితికి అద్దపడుతోంది.

కాంగ్రెస్​ 97 శాతం399 స్థానాల్లో కాంగ్రెస్​ తమ అభ్యర్థులను బరిలో దించగా.. 387 (97శాతం) మందికి దరావతు కూడా దక్కలేదు. రెండు స్థానాల్లో అతి స్వల్ప అధిక్యంతో గెలిచింది. మొత్తంగా కాంగ్రెస్‌కు 2.4 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. యూపీలో హస్తం పార్టీ ఇంతటి ఘోర పరాజయాన్ని ఎన్నడూ చూడలేదు. ఏ స్థానంలోనైనా డిపాజిట్ కాపాడుకోవాలంటే అభ్యర్థి మొత్తం ఓట్లలో 16.66శాతం పొందాలి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu