రాహుల్ గాంధీని హీరోను చేయాల‌నుకుంటున్న బీజేపీ.. ప్ర‌ధాని మోడీకి ఆయ‌నే అతిపెద్ద టీఆర్పీ: మ‌మ‌తా బెన‌ర్జీ

By Mahesh Rajamoni  |  First Published Mar 20, 2023, 1:31 AM IST

Kolkata: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ రాహుల్ గాంధీని ప్రధాని న‌రేంద్ర మోడీకి అతిపెద్ద టీఆర్పీగా అభివర్ణించారు. రాహుల్ గాంధీని హీరోను చేయాలని బీజేపీ చూస్తోందని కూడా ఆమె పేర్కొన్నారు.
 


Bengal Chief Minister Mamata Banerjee: బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పార్టీ అంతర్గత సమావేశంలో రాహుల్ గాంధీపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారని సమాచారం. రాహుల్ గాంధీ ప్రతిపక్షాల ముఖమైతే ప్రధాని నరేంద్ర మోడీని ఎవరూ టార్గెట్ చేయలేరన్నారు. రాహుల్ గాంధీయే ప్రధాని మోడీకి అతిపెద్ద టీఆర్పీ అని పార్టీ కార్యకర్తలకు చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. రాహుల్ గాంధీ నాయకుడిగా ఉండాలని తాము కోరుకుంటున్నందునే పార్లమెంటును పనిచేయనివ్వడం లేదని ఆమె ఆరోపించారు. రాహుల్ గాంధీని హీరోను చేయాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోందని పేర్కొన్నారు.

బీజేపీ ముందు తలవంచేది కాంగ్రెస్ పార్టీయేనంటూ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, సీపీఎం, బీజేపీలు తృణమూల్ కు వ్యతిరేకంగా మైనారిటీలను రెచ్చగొడుతున్నాయని కూడా మమతా బెనర్జీ వర్చువల్ ప్రసంగంలో ముర్షీదాబాద్ లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి అన్నారని మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. అంతకుముందు తృణమూల్ ఎంపీ, ఆ పార్టీ లోక్ సభ పక్ష నేత సుదీప్ బందోపాధ్యాయ మాట్లాడుతూ రాహుల్ గాంధీ ప్రతిపక్ష ముఖంగా ఉండటం వల్ల బీజేపీకి లాభం చేకూరుతుందని అన్నారు. "గత కొన్నేళ్లుగా మమతా బెనర్జీ కాంగ్రెస్ తో విభేదిస్తూ వస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పోటీ చేసినప్పటికీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయిన బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో తృణమూల్ తన ఓట్లను కొల్లగొడుతోందని కాంగ్రెస్ అసంతృప్తితో ఉందని" అన్నారు.

Latest Videos

ఎన్నికలకు ముందు, బెంగాల్ లో రాజకీయ హింస, శారదా స్కామ్ ను ఉదహరిస్తూ రాహుల్ గాంధీ తృణ‌మూల్ కాంగ్రెస్ పై విమ‌ర్శ‌ల దాడి చేశారు. ఈ రెండు పార్టీల‌పై బీజేపీ సైతం విమ‌ర్శ‌లు చేస్తోంది. బెంగాల్ లో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి సైతం టీఎంసీని టార్గెట్ చేశారు. ఇక ముర్షిదాబాద్ లో కాంగ్రెస్ చేతిలో తృణమూల్ ఓటమి తర్వాత పరిస్థితులు మరింత దిగజారాయి. రెండు పార్టీలు ఇప్పుడు ఒకరిపై ఒకరు విమ‌ర్శ‌లు చేసుకుంటున్నాయి. బీజేపీతో ర‌హ‌స్య ఒప్పందాల‌తో ముందుకు సాగుతున్నాయ‌ని ఇరు పార్టీల నేతలు ఆరోప‌ణ‌లు చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. ఈ క్ర‌మంలోనే 2024లో బీజేపీకి వ్యతిరేకంగా ఐక్య ఫ్రంట్ కోసం ఇరు పార్టీల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని మమతా బెనర్జీ ప్రకటించారు.

click me!