అదానీ కోసమా?: ఢిల్లీ పోలీసులకు సమాధానంలో రాహుల్ గాంధీ మూడు కీలక అంశాలు

Published : Mar 19, 2023, 08:42 PM IST
అదానీ కోసమా?: ఢిల్లీ పోలీసులకు సమాధానంలో రాహుల్ గాంధీ మూడు కీలక అంశాలు

సారాంశం

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఢిల్లీ పోలీసులకు పది పాయింట్లతో సమాధానం ఇచ్చారు. అందులో మూడు ప్రశ్నలు లేవదీశారు. పోలీసులకు అత్యవసర చర్యలకు అదానీ కేసుతో ఏమైనా సంబంధం ఉన్నదా అని ప్రశ్నించారు.  

న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ నివాసానికి ఢిల్లీ పోలీసులు వెళ్లిన గంటల వ్యవధిలో ఆయన వారికి సమాధానం రాశారు. పది పాయింట్లతో సమాధానాన్ని ఢిల్లీ పోలీసులకు ఆదివారం సమర్పించారు. భారత్ జోడో యాత్రలో ఆయనతో చెప్పుకున్న లైంగిక వేధింపుల బాధిత మహిళల వివరాలు అందించాలని ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీని కోరారు. రాహుల్ గాంధీ వివరాలు అందిస్తే వారిని రక్షిస్తామని పోలీసులు పేర్కొన్నారు. దీనికి ప్రాథమిక సమాధానాన్ని రాహుల్ గాంధీ ఢిల్లీ పోలీసులకు అందించారు.

తన పది పాయింట్ల సమాధానంలో ఇది గతంలో ఎన్నడూ జరగలేదని అన్నారు. మూడు ప్రశ్నలను ఆయన లేవదీశారు. అందులో మొదటిది.. పార్లమెంటులో లోపలా, బయటా తాను లేవనెత్తుతున్న అంశాలకు ముఖ్యంగా అదానీ కేసుతో దీనికి సంబంధం ఉన్నదా? అని పేర్కొన్నారు.

Also Read: రాహుల్ గాంధీ నివాసానికి ఢిల్లీ పోలీసులు.. ‘ఆ బాధిత మహిళల వివరాలివ్వండి’

రెండోది.. భారత్ జోడో యాత్ర పూర్తయిన 45 రోజుల తర్వాత ఢిల్లీ పోలీసులకు అంత అత్యవసరమైన సమస్యగా ఇది ఎందుకు కనిపించిందని అడిగారు. మూడో ప్రశ్నగా.. పొలిటికల్ క్యాంపెయిన్స్ చేసిన ఇతర పార్టీల (అధికారిక బీజేపీ కూడా) నూ ఇలాగే పోలీసులు ప్రశ్నించారా? అని అడిగారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?