బీజేపీ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనుకుంటోంది.. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలే దానికి సంకేతం - నితీశ్ కుమార్

Published : Sep 02, 2023, 01:06 PM IST
బీజేపీ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనుకుంటోంది.. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలే దానికి సంకేతం - నితీశ్ కుమార్

సారాంశం

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని అనుకుంటోందని బీహార్ సీఎం నితీశ్ కుమార్ అన్నారు. అందుకే ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని భావిస్తోందని తెలిపారు. ఈ సమావేశాల ఎజెండా ఏంటో ఇప్పటి వరకు బహిర్గతపర్చలేదని అన్నారు.


బీజేపీ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావిస్తోందని బీహార్ సీఎం నితీశ్ కుమార్ అన్నారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడమే దీనికి సంకేతం అని అన్నారు. ఈ సమావేశాలే ముందస్తు లోక్ సభ ఎన్నికలపై తన అంచనాలకు బలం చేకూరుస్తున్నాయని తెలిపారు. ప్రతిపక్ష కూటమి ఇండియా తాజాగా చర్చలు జరిపిన ముంబై నుంచి ఆయన తిరిగి వచ్చిన తరువాత మీడియాతో మాట్లాడారు.

వివాహేతర సంబంధాల వల్ల కలిగిన పిల్లలకూ.. ఆస్తిలో వాటా - సుప్రీంకోర్టు కీలక తీర్పు..

ఈ సందర్భంగా మీడియా అడిగిన పలు ప్రశ్నలకు నితీశ్ కుమార్ సమాధానమిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ముందస్తు ఎన్నికల గురించి వారు (బీజేపీ) ఆలోచిస్తున్నారనడానికి ఈ ప్రత్యేక సమావేశం సంకేతం అని మీరు (మీడియాను ఉద్దేశించి) అర్థం చేసుకోవాలి. ఇలా జరుగుతుందని నేను చాలా కాలంగా అనుకుంటున్నాను. దీనిని మీతో పంచుకోవాలని చూస్తున్నాను.’’ అన్నారు. వర్షాకాల సమావేశాల అనంతరం నిరవధిక వాయిదా పడిన పార్లమెంట్ ఈ నెల 18 నుంచి 22 వరకు ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయని నితీశ్ కుమార్ చెప్పారు. అయితే ఈ సమావేశాల ఎజెండా ఏమిటన్నది కేంద్రం బహిర్గతం చేయలేదని అన్నారు.

సోషల్ మీడియాలో టీచర్ తో స్నేహం.. పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిందని కత్తితో దాడి.. కూకట్ పల్లిలో ఘటన

లోక్ సభలో 16 మంది ఎంపీలున్న జేడీయూ అధినేతను 'వన్ నేషన్ వన్ ఎలక్షన్' గురించి మీడియా ప్రశ్నించగా.. దానికి ఆయన ఎలాంటి సమాధానమూ చెప్పలేదు. అయితే రాబోయే సమావేశాల్లో పలు అంశాలను బలంగా లేవనెత్తుతామని నితీశ్ కుమార్ అన్నారు. ‘కుల గణన విషయంలో ఈ ప్రభుత్వం కాలు దువ్వుతోంది. నిబంధనల ప్రకారం ఎప్పుడో పూర్తి చేయాల్సిన కుల గణనను ఇంకా ప్రారంభించలేదు. ఈ ప్రభుత్వానికి ఇతర అన్ని విషయాలకు సమయం ఉంది’’ అని అన్నారు. 

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్