
ఢిల్లీ : శుక్రవారం ఢిల్లీలోని నేతాజీ సుభాష్ ప్లేస్ ప్రాంతంలో 85 ఏళ్ల మహిళపై 28 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడిని పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) చీఫ్ స్వాతి మలివాల్ ఈ ఘటన మీద స్పందించారు. ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేశారు.
వివరాలోకి వెడితే.. ఢిల్లీలోని నేతాజీ సుభాష్ ప్లేస్ ప్రాంతంలో శుక్రవారం 85 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం జరిగింది. ఢిల్లీ మహిళా కమిషన్ (డిసిడబ్ల్యు) చీఫ్ స్వాతి మలివాల్ ఈ సంఘటన మీద చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనకు పాల్పడ్డ 28 ఏళ్ల ఆకాష్‌గా గుర్తించబడిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
షాకింగ్ : రాజస్థాన్‌లో గిరిజన మహిళ బట్టలు విప్పి, నగ్నంగా ఊరేగించి... వీడియోలు వైరల్
ఈ ఘటన మీద ఢిల్లీ మహిళా కమిషన్ తన ఎక్స్ హ్యాండిల్‌లో ఢిల్లీ పోలీసులను ప్రశ్నించింది. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో వృద్ధురాలు తన ఇంట్లో నిద్రిస్తుండగా ఈ ఘటన జరిగింది. నిందితుడు మహిళ ఇంట్లోకి చొరబడి అత్యాచారానికి పాల్పడ్డాడు. అతను మహిళను కొట్టి, బ్లేడుతో పెదవులను కోశాడు.
వివరాల ప్రకారం.. వృద్ధురాలి ముఖానికి, ప్రైవేట్ పార్ట్స్ లో తీవ్ర గాయాలయ్యాయి. కేసుకు సంబంధించి ఇతర వివరాలతో పాటు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్‌ఐఆర్) కాపీని తనకు అందించాలని డిసిడబ్ల్యు చీఫ్ నోటీసులో ఢిల్లీ పోలీసులను కోరారు.
ఢిల్లీలో వృద్ధురాలిపై జరిగిన అత్యాచారంపై డీసీడబ్ల్యూ చీఫ్ స్వాతి మలివాల్ ట్వీట్ చేశారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోంది.