'వివాహ వ్యవస్థను నాశనం చేసే ప్రణాళికాబద్ధమైన వ్యూహామే..': లివ్ ఇన్ రిలేషన్ షిప్స్ పై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు 

Published : Sep 02, 2023, 01:00 PM ISTUpdated : Sep 02, 2023, 01:01 PM IST
'వివాహ వ్యవస్థను నాశనం చేసే ప్రణాళికాబద్ధమైన వ్యూహామే..': లివ్ ఇన్ రిలేషన్ షిప్స్ పై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు 

సారాంశం

లివ్ ఇన్ రిలేషన్ షిప్స్ పై అలహాబాద్ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.  భారతీయ వివాహా వ్యవస్థను నాశనం చేయడానికి లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లు ఒక క్రమబద్ధమైన ప్రణాళిక అని హైకోర్టు పేర్కొంది. వివాహం లో ఉన్నట్టుగా  భద్రత, స్థిరత్వాన్ని సహ జీవనంలో ఆశించలేమని హైకోర్టు భావించింది. 

లివ్ ఇన్ రిలేషన్ షిప్స్ పై అలహాబాద్ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. భాగస్వాములను మార్చడం నాగరిక సమాజానికి మంచిది కాదని కోర్టు పేర్కొంది. పరోక్షంగా భారతీయ వివాహా వ్యవస్థను నాశనం చేయడానికి ప్రణాళికాబద్ధమైన వ్యూహమని పేర్కొంది. తన లైవ్-ఇన్ పార్టనర్‌పై అత్యాచారం చేసిన నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. లివ్-ఇన్ రిలేషన్ షిప్‌కు సంబంధించిన కేసులో సహారన్‌పూర్ నిందితుడు అద్నాన్ బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు ఇలా రియాక్షన్ ఇచ్చింది.

ఈ కేసులో అద్నాన్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఏడాది పాటు లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న బాధితురాలిపై అత్యాచారం చేశాడని ఆరోపించింది.ఈ కేసులో అద్నాన్‌పై సెక్షన్ 376 (రేప్) కింద అభియోగాలు మోపారు. ఏడాది పాటు లివ్‌ ఇన్‌ రిలేషన్‌షిప్‌లో ఉన్న తాను గర్భవతి అయిన తర్వాత అద్నాన్‌పై అత్యాచారం చేశాడని బాధితురాలు ఆరోపించింది. ఈ కేసును విచారిస్తున్న జస్టిస్ సిద్ధార్థ్ మాట్లాడుతూ..ఇటీవల యువత లివ్ ఇన్ రిలేషన్ షిప్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తోందని అన్నారు. కానీ, ఈ సంబంధానికి సామాజిక ఆమోదం లేదని పేర్కోన్నారు. 

వివాహం అనేది  ఒక వ్యక్తికి అందించే భద్రత, సామాజిక ఆమోదం,స్థిరత్వం ఉంటుందని, కానీ,  లివ్-ఇన్-రిలేషన్‌షిప్ ద్వారా అలాంటి భద్రతను ఆశించలేమని జస్టిస్ సిద్దార్థ్‌తో కూడిన సింగిల్ బెంచ్ పేర్కొంది. ప్రతి సీజన్‌లో భాగస్వాములను మార్చడం అనే క్రూరమైన భావన అనీ, స్థిరమైన,ఆరోగ్యకరమైన సమాజంలో దీనిని పరిగణనలోకి తీసుకోలేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌ అనేది భారతదేశంలో వివాహ వ్యవస్థను నాశనం చేయడానికి ప్రణాళికాబద్ధమైన వ్యూహం రూపొందించబడిందని న్యాయస్థానం పేర్కొంది. 

ఇదీ సంగతి

సహరాన్‌పూర్‌కు చెందిన యువకుడు,  అతని 19 ఏళ్ల లైవ్-ఇన్ భాగస్వామికి సంబంధించిన కేసు నేపథ్యంలో అలహాబాద్ హైకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఇద్దరూ లివ్-ఇన్‌లో నివసిస్తున్నారు. ఇద్దరి మధ్య పరస్పర ఒప్పందం కుదిరింది. వారిద్దరూ ఇష్టపూర్వకంగానే సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ యువతి గర్భం దాల్చింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి అబ్బాయి తనతో సెక్స్‌లో పాల్గొన్నాడని యువతి పేర్కొంది. గర్భం దాల్చిన తర్వాత అబ్బాయి పెళ్లికి నిరాకరించాడు. దీనికి సంబంధించి దేవబంద్ పోలీస్ స్టేషన్‌లో ఆ యువతి తన సదరు యువకుడిపై అత్యాచారం కేసు పెట్టింది. ఈ క్రమంలో ఆ యువకుడిపై అత్యాచారం కేసు నమోదైంది.కేసు నమోదయ్యాక పోలీసులు చర్యలు ప్రారంభించారు. ఏప్రిల్ 10న పోలీసులు నిందితుడైన యువకుడిని అరెస్టు చేశారు. నిందితుడైన యువకుడు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించాడు.

ఈ కేసును విచారించిన జస్టిస్ సిద్ధార్థ్ మాట్లాడుతూ.. మన దేశంలో లివ్-ఇన్ సంబంధాలు సాధారణమైనవిగా పరిగణించబడుతున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలు అని పిలవబడే అనేక దేశాల్లో లివ్-ఇన్ పద్ధతి సాధారణమని ఆయన అన్నారు. ఆయా దేశాల్లో వివాహ వ్యవస్థను కాపాడుకోవడం వారికి పెద్ద సమస్యగా మారింది. భారతదేశంలో ఇదే ధోరణిపై ఆందోళన వ్యక్తం చేసిన జస్టిస్ సిద్ధార్థ్.. ఇది భవిష్యత్తులో మనకు కూడా పెద్ద సమస్య సృష్టిస్తుందని అన్నారు. అంతే కాకుండా టీవీ సీరియల్స్, వెబ్ సిరీస్‌లు, సినిమాలు చూసి యువత లివ్ ఇన్ రిలేషన్ షిప్ వైపు ఆకర్షితులవుతున్నారని అన్నారు. ఈ సినిమాలు, టీవీ సీరియల్స్ వివాహేతర సంబంధాలను, అలాంటి సంబంధాలను ప్రోత్సహిస్తూ సమాజంలో దుమ్మెత్తి పోస్తున్నాయి.

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్