గుజరాత్ కొత్త సీఎంగా భూపేంద్ర పటేల్: బీజేఎల్పీ సమావేశంలో నిర్ణయం

By narsimha lodeFirst Published Sep 12, 2021, 4:23 PM IST
Highlights

గుజరాత్ కొత్త సీఎంగా భూపేంద్రపటేల్ ఎన్నికయ్యారు., బీజేపీ శాసనసభపక్ష సమావేశంలో ఈ మేరకు  ఇవాళ నిర్ణయం తీసుకొన్నారు.  కేంద్రమంత్రులు ప్రహ్లాద్ జోషీ, నరేంద్ర తోమర్ లు ఇవాళ గాంధీనగర్ లో నిర్వహించిన బీజేపీ శాసనసభపక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకొన్నారు. 

గాంధీనగర్: గుజరాత్ రాష్ట్ర కొత్త సీఎంగా భూపేంద్ర  పటేల్ ను ఎన్నికయ్యారు. బీజేపీ శాసనసభపక్ష సమావేశంలో పటేల్ పేరును ప్రకటించారు నేతలు. గుజరాత్ రాష్ట్ర సీఎం పదవికి విజయ్ రూపానీ రాజీనామా చేశారు. దీంతో కొత్త సీఎంగా భూపేంద్ర పటేల్ ను  ఎన్నుకొంది బీజేపీ శాసనసభపక్షసమావేశం. ఘట్లొడియా నుండి  భూపేంద్ర ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.  ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్  తోమర్ అధికారికంగా ప్రకటించారు.

also read:గుజరాత్ సీఎంగా విజయ్ రూపానీని తప్పించడం వెనుక బీజేపీ వ్యూహం ఇదేనా?

సీఎం పదవికి రాజీనామా చేసిన విజయ్ రూపానీ కూడ ఈ సమావేశానికి హాజరయ్యారు. గుజరాత్ రాష్ట్రంలో  వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చడంలో విజయ్ రూపానీకి బదులుగా మరో నేతను ఎంపిక చేయాలని ఆ పార్టీ భావించింది.ఈ మేరకు ఆ పార్టీ నాయకత్వం విజయ్ రూపానీని సీఎం పదవికి రాజీనామా చేయాలని కోరింది.

దీంతో విజయ్ రూపానీ సీఎం పదవికి రాజీనామా చేశారు. కేంద్ర మంత్రులు నరేంద్రసింగ్ తోమర్,  ప్రహ్లాద్ జోషీలను బీజేపీ నాయకత్వం  గుజరాత్ కు  పార్టీ పరిశీలకులుగా పంపింది. భూపేంద్ర పటేల్‌ పేరును కొత్త సీఎంగా విజయ్ రూపానీ ప్రతిపాదించారు.భూపేంద్ర పటేల్ గతంలో అహ్మదాబాద్ మున్సిపల్ స కార్పోరేషన్ స్టాండింగ్ కమిటీ ఛైర్మెన్ గా  పనిచేశారు.మరో 15 నెలల్లో గుజరాత్ రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో భూపేంద్ర పటేల్ ను కొత్త సీఎంగా నియమించింది బీజేపీ నాయకత్వం.

click me!