జమ్ము కశ్మీర్‌లో ఉగ్రదాడి.. ఒక పోలీసు అధికారి దుర్మరణం

Published : Sep 12, 2021, 04:01 PM IST
జమ్ము కశ్మీర్‌లో ఉగ్రదాడి.. ఒక పోలీసు అధికారి దుర్మరణం

సారాంశం

జమ్ము కశ్మీర్‌లో మళ్లీ ఉగ్రకలకలం రేగుతున్నది. ఉగ్రవాద చర్యలు శృతిమించుతున్నాయి. తాజాగా, ఓ పోలీసు అధికారిని గుర్తుతెలియని ఓ టెర్రరిస్టు తుపాకీతో కాల్చి చంపాడు. శ్రీనగర్‌లోని ఖాన్యర్ ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లో మళ్లీ ఉగ్రవాద చర్యలు పెరుగుతున్నాయి. తాజాగా, పట్టపగలే నడివీధిలో ఓ పోలీసు అధికారి ఓ ముష్కరుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. బహిరంగంగా కాల్పులు జరిపి పారిపోయాడు. ఈ ఘటనలో సదరు పోలీసు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించారు. శ్రీనగర్‌లోని ఖాన్యర్ ఏరియాలో ఈ ఘటన జరిగింది.

మధ్యాహ్నం 1.35 గంటలకు టెర్రరిస్టులు ఖాన్యర్‌లోని పోలీసు పార్టీపై కాల్పులు జరిపారు. దీంతో ప్రొబేషనరీ సబ్ ఇన్‌స్పెక్టర్ అర్షిద్ అహ్మద్ బుల్లెట్ల గాయాలతో కుప్పకూలిపోయారని అధికారులు వివరించారు. ఆ టెర్రరిస్టు పోలీసు అధికారిని వెనుక నుంచి కాల్చి పారిపోయాడు. పోలీసు బుల్లెట్ల గాయాలతో కుప్పకూలిపోయారు. చుట్టుపక్కల ఉన్నవారు పరుగులంకించుకున్నారు. కొంత సేపటి తర్వాత వారే గాయాలతో విలవిల్లాడుతున్న పోలీసు అధికారిని ఆస్పత్రికి తరలించారు. కానీ, గాయాలతో బాధపడుతూ హాస్పిటల్‌లోనే ఆయన మరణించారు. భద్రతా బలగాలు వెంటనే ఆ ఏరియాలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఉగ్రవాదుల కోసం జల్లెడబడుతున్నారు.

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌