మధ్యప్రదేశ్ సీఎం ఎవరనే సస్పెన్స్‌కు బీజేపీ షాకింగ్ డెసిషన్‌తో తెర వేసింది. ఎవరూ ఊహించని రీతిలో మోహన్ యాదవ్‌ను ముఖ్యమంత్రిగా ప్రకటించింది. మోహన్ యాదవ్ ఎవరు? ఆయనకు గత సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌తో ఏం సంబంధం ఉన్నది?
CM Mohan Yadav: మధ్యప్రదేశ్ సీఎంగా శివరాజ్ సింగ్ చౌహాన్ నాలుగు సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసి ఉన్నారు. అంతటి సీనియర్‌ను కాదని ఈ సారి బీజేపీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్‌ను ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచింది. బీజేపీ శ్రేణులు కూడా ఈ నిర్ణయంపై షాక్ అయ్యాయి. ఇంతకీ ఎవరీ మోహన్ యాదవ్? ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఏమిటీ?
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 166 స్థానాలు గెలుచుకుని ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించింది. ఇక్కడ సీఎం సీటు కోసం ఉత్కంఠ పోరు నడిచింది. సుమారు ఆరుగురు నేతలు సీఎం కుర్చీ కోసం పోటీ పడ్డారు. కానీ, బీజేపీ మాత్రం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఎవరూ ఊహించిన ఎమ్మెల్యేను ముఖ్యమంత్రిని చేసింది.
మోహన్ యాదవ్ ఉజ్జయిన్ జిల్లా ఉజ్జయిన్ దక్షిణ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2013లో తొలిసారిగా ఎమ్మెల్యే అయిన మోహన్ యాదవ్ ఆ తర్వాత 2018, 2023ల్లోనూ గెలిచారు. ఈ సారి సుమారు 13 వేల ఓట్ల మెజార్టీతో విజయఢంకా మోగించారు.
మోహన్ యాదవ్ ఓబీసీ సామాజికి వర్గానికి చెందిన బలమైన నేత. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 48 శాతం ఓటర్లు ఓబీసీలే కావడం గమనార్హం.
Also Read: Rythu Bandhu: రైతు భరోసాపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా.. నిధులపై త్వరలో ప్రకటన
శివరాజ్ సింగ్ చౌహాన్‌తో మోహన్ యాదవ్‌కు ఏం సంబంధం ఉన్నదనే చర్చ కూడా తెర మీదికి వచ్చింది. శివరాజ్ సింగ్ చౌహాన్ చాలా సీనియర్ లీడర్. 2005,2008, 2013,2020ల్లో రాష్ట్రానికి సీఎంగా పని చేశారు. ఈ క్రమంలో పార్టీలోని దాదాపు అందరి నేతలతో సంబంధాలు ఏర్పడటం సహజం. మోహన్ యాదవ్‌నూ శివరాజ్ సింగ్ చౌహాన్ గతంలో క్యాబినెట్‌లోక తీసుకున్నారు. 2020లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిప్పుడు శివరాజ్ సింగ్ చౌహాన్ మంత్రి వర్గంలో మోహన్ యాదవ్ కూడా ఉన్నారు. ఆర్ఎస్ఎస్ నేతలకు సన్నిహితుడనే ప్రచారం ఉన్నది.
Also Read: Article 370: సుప్రీం తీర్పుపై జమ్ము కశ్మీర్ ప్రధాన పార్టీల నేతలు ఏమన్నారు?
మోహన్ యాదవ్, సీమా యాదవ్ దంపతులకు ముగ్గురు సంతానం. ఇద్దరు కుమారులు, ఒక్క కుమార్తె ఉన్నారు. బీఎస్సీ, ఎల్ఎల్‌బీ, ఎంఏ, ఎంబీఏ, పీహెచ్‌డీలు ఆయన విద్యార్హతలు. మోహన్ యాదవ్ కేవలం రాజకీయ నేతనే కాదు.. ఆయనకు బిజినెస్ మ్యాన్‌నూ పేరు ఉన్నది.