మధ్యప్రదేశ్ కొత్త సీఎంగా మోహన్ యాదవ్: ప్రకటించిన బీజేపీ

By narsimha lode  |  First Published Dec 11, 2023, 4:57 PM IST

మధ్యప్రదేశ్ కొత్త సీఎంగా మోహన్ యాదవ్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇవాళ భోపాల్ లో జరిగిన బీజేపీ శాసనసభపక్ష సమావేశంలో  ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 


న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్  నూతన ముఖ్యమంత్రిగా  మోహన్ యాదవ్ ను బీజేపీ నాయకత్వం ప్రకటించింది.  గతంలో  శివరాజ్ సింగ్ చౌహాన్ మంత్రివర్గంలో మోహన్ యాదవ్  మంత్రిగా పనిచేశారు. 

మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ అధికారాన్ని  కైవసం చేసుకుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి కొత్త సీఎం ఎంపిక కోసం  సోమవారంనాడు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. బీజేపీ శాసనసభపక్ష సమావేశంలో  మోహన్ యాదవ్ పేరును బీజేపీ నాయకత్వం ప్రతిపాదించింది.

Latest Videos

మధ్యప్రదేశ్ కొత్త సీఎంగా మోహన్ యాదవ్ ను భారతీయ జనతా పార్టీ ఎంపిక చేసింది.  ఇవాళ భోపాల్ లో జరిగిన బీజేపీ శాసనసభ పక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్  మంత్రివర్గంలో మోహన్ యాదవ్ మంత్రిగా పనిచేశారు. 

శివరాజ్ సింగ్ చౌహన్ మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా  మోహన్ యాదవ్ పనిచేశారు.ఉజ్జయిని దక్షిణ్ అసెంబ్లీ స్థానం నుండి మోహన్ యాదవ్  ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

2013లో  మధ్యప్రదేశ్ అసెంబ్లీకి తొలిసారిగా మోహన్ యాదవ్ ఎన్నికయ్యారు.  2018 ఎన్నికల్లో ఆయన రెండో దఫా  ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.2020 జూలై రెండున  మోహన్ యాదవ్  శివరాజ్ సింగ్ చౌహన్  మంత్రివర్గంలో మంత్రిగా  మోహన్ యాదవ్ బాధ్యతలు చేపట్టారు.

1965 మార్చి  25న మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినిలో మోహన్ యాదవ్ జన్మించారు.  చాలా ఏళ్లుగా ఆయన బీజేపీలో కొనసాగుతున్నారు.  రాజకీయాలతో పాటు వ్యాపారవేత్తగా కూడ మోహన్ యాదవ్ కు పేరుంది.ఉజ్జయిని ధక్షిణ అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధి  చేతన్ ప్రేమ నారాయణ్ యాదవ్ పై  12,941 ఓట్ల మెజారిటీతో మోహన్ యాదవ్ విజయం సాధించారు.  

మధ్యప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులుగా  జగదీష్ దేవదా, రాజేష్ శుక్లాలను కూడ బీజేపీ  ఇవాళ ప్రకటించింది.  స్పీకర్ గా నరేంద్ర తోమర్ పేరును బీజేపీ నాయకత్వం ప్రకటించింది.


 

click me!