బెంగళూరు వరదలు.. దోశ తింటూ ఎంజాయ్ చేస్తున్న బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య... వీడియో వైరల్...

Published : Sep 08, 2022, 06:47 AM IST
బెంగళూరు వరదలు.. దోశ తింటూ ఎంజాయ్ చేస్తున్న బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య... వీడియో వైరల్...

సారాంశం

బెంగళూరు వరదలతో అతలాకుతలం అవుతుంటే అక్కడి ఎంపీ మసాలా దోశ తింటూ.. మీరూ తినండి అంటూ ప్రమోట్ చేసే వీడియో ఒకటి వైరల్ గా మారింది. దీనిమీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

బెంగళూరు :ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బెంగళూరు నగరం వరదల్లో మునిగిపోయింది. మూడు, నాలుగు రోజులైనా పలు ప్రాంతాలు ఇంకా వరదనీటిలోనే చిక్కుకుపోయాయి. ఓవైపు నీటిలో మునిగిన ఇళ్లు, కార్యాలయాలు.. మరోవైపు రోజువారీ పనులకు వెళ్లేందుకు నగర పౌరులు సతమతమవుతున్న దృశ్యాలు అక్కడి పరిస్థితులను కళ్లకు కడుతున్నాయి. ఇటువంటి తరుణంలో నియోజకవర్గ ప్రజలకు అండగా నిలవాల్సిన ఓ ఎంపీ దోశ తినుకుంటూ బావుంది అంటూ ప్రచారం చేయడం విమర్శలకు దారితీసింది. బెంగళూరు సౌత్ లోక్సభ స్థానానికి  ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తీరుపై సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలలో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ఎంపీ తేజస్వి సూర్య తన నియోజకవర్గం పరిధిలోని పద్మనాభనగర్ లో ఉన్న ఓ హోటల్ లో టిఫిన్ తింటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. అందులో బటర్ మసాలా దోస,  ఉప్మా తింటున్న ఆయన.. నాణ్యతతో పాటు రుచికరంగా ఉందని ప్రశంసించారు. అంతేకాకుండా ప్రజలు కూడా ఈ హోటల్ కి వచ్చి రుచి చూడాలని సిఫార్సు చేశాడు. ఈ వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేసిన కాంగ్రెస్ నేత లావణ్య బళ్లాల్.. బెంగళూరు నగరం వరదల్లో చిక్కుకుపోతే..  మన ఎంపీ మాత్రం దోశ తింటూ ఎంజాయ్ చేస్తున్నారని విమర్శించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన కనీసం ఒక్క చోటైనా పర్యటించారా?  అంటూ ప్రశ్నించారు.

ఆహారం కోసం గొడ‌వ‌.. నిద్రిస్తున్న దంపతులను హ‌త్య చేసిన‌ ప‌నిమ‌నిషి

తేజస్వి సూర్య వీడియోని ట్విట్టర్ లో షేర్ చేసిన నటి, కాంగ్రెస్ మాజీ ఎంపీ రమ్య… ‘ ఒకవేళ మీరు ఇతర హోటళ్లను ప్రమోట్ చేయాలి అనుకుంటే మనం కలుద్దాం. బెంగళూరు సౌత్ ఓటర్లు అక్కడ పని చేస్తున్నారు’  అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఓ వైపు భారీ వర్షాలతో నగరం మునిగిపోతుంటే ‘రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుంది తేజస్వి దోస తింటున్న తీరు’ అని ఆమ్ ఆద్మీ పార్టీ నేత  పృథ్వి రెడ్డి విమర్శించారు. 

మరో ట్విట్టెర్ మాత్రం తేజస్వి గడిచిన మూడు నెలల్లో కేజ్రీవాల్పై 244 ట్వీట్లు, రాహుల్ గాంధీపై 17 ట్వీట్లు,  మోడీని ప్రశంసిస్తూ 137 ట్వీట్లు చేశాడు. కానీ, బెంగళూరు వరదలపై మాత్రం ఒక్క ట్వీట్ కూడా చేయలేదు అంటూ మండిపడ్డారు. ఇక మరొక  యూజర్ స్పందిస్తూ... కారణం ఏమీ లేకుండా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వాలిపోయే తేజస్వి.. నగరం వరదల్లో చిక్కుకున్న మాత్రం కనిపించడం లేదు అంటూ విమర్శించారు ఇలా బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వీడియో మీద సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం