నీట్ యూజీ 2022 ఫలితాలు విడుదల.. రాజస్తాన్ అమ్మాయికి ఫస్ట్ ర్యాంక్

By Mahesh KFirst Published Sep 8, 2022, 4:20 AM IST
Highlights

నీట్ యూజీ 2022 ఫలితాలు విడుదల అయ్యాయి. అధికారిక వెబ్ సైటల్‌లలో విద్యార్థులు తమ భవిష్యత్‌ను చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. రాజస్తాన్‌కు చెందిన అమ్మాయి ఆల్ ఇండియా టాపర్‌గా నిలిచారు.

న్యూఢిల్లీ: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ యూజీ 2022 ఫలితాలను బధవారం విడుదల చేసింది. అభ్యర్థులు నీట్ పరీక్ష ఫలితాలను అధికారిక వెబ్ సైట్లు, neet.nta.nic.in, nta.ac.inలలో ఫలితాలు చెక్ చేసుకోవాలని చెప్పాల్సింది.

ఇలా చెక్ చేసుకోండి
నీట్ యూజీ 2022 ఫలితాలు తెలుసుకోవడానికి సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. తొలుత అధికారిక వెబ్ సైట్‌లోకి (ntaresults.nic.in) వెళ్లి ఫలితాలు తెలుసుకోవాల్సి ఉన్నది. వెబ్ సైట్‌లోకి వెళ్లిన తర్వాత నీట్ యూజీ 2022 ఫలితాలు అని కనిపించే లింక్ క్లిక్ చేయాలని వివరించింది. లాగిన్ క్రెడెన్షియల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆయనే నీట్ యూజీ రిజల్ట్ 2022 స్కోర్ బోర్డును ప్రత్యక్షం అవుతుంది. దాన్ని ప్రింట్ ఔట్ తీసుకోవాలి. భవిష్యత్ అవసరాల కోసం దాచి పెట్టుకోవాలని నిపుణులులు చెబుతుంటారు.

కాగా, నీట్‌లో టాపర్‌గా రాజస్తాన్‌కు చెందిన తనిష్క నిలిచారు. ఆమె తర్వాత వత్స అశిశ్ బత్రా, హృషికేశ్ భూషణ్ గంగూలీలు టాప్ సెకండ్, థర్డ్ ప్లేస్‌లలో ఉన్నారు.

click me!