ఎన్నిక‌ల‌కు బ్రేక్‌.. యూపీలో రాష్ట్రప‌తి పాల‌న‌?.. బీజేపీ నేత సుబ్ర‌మ‌ణ్య స్వామి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు !

By Mahesh Rajamoni  |  First Published Dec 24, 2021, 1:55 PM IST

UP Assembly elections 2022: వ‌చ్చే ఏడాది ప్రారంభంలో  దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలోనే అన్ని రాజ‌కీయ పార్టీలు ఆయా రాష్ట్రాల్లో ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేశాయి. దీంతో రాజ‌కీయ ఎన్నిక‌ల వేడి రాజుకుంది. యూపీలో రాజ‌కీయాలు కాక‌పుట్టిస్తున్నాయి. అన్ని పార్టీలు ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న వేళ బీజేపీ ఎంపీ సుబ్ర‌మ‌ణ్య స్వామి చేసిన ట్వీట్ సంచ‌ల‌నంగా మారింది. 
 


UP Assembly elections 2022:  దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల కోలాహలం అప్పుడే మొద‌లైంది. ఎన్నిక‌ల న‌గారా మోగ‌క‌ముందే అన్ని ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీల ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేశాయి. ఎన్నిక‌లో నోటిఫికేష‌న్ జారీ కావ‌డానికి మ‌రో రెండు నెల‌ల స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ.. ఇప్పుడే రాజ‌కీయ పార్టీలు ఓట‌ర్ల‌ను ప్ర‌స‌న్నం చేసుకునే ప‌నిలో ప‌డ్డాయి. 2022 ప్రారంభంలో ఎన్నిక‌లు జ‌రిగే రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల‌తో పాటు కాంగ్రెస్ స‌ర్కారు పాలన సాగిస్తున్న రాష్ట్రాలు కూడా ఉన్నాయి. పంజాబ్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌లలో జ‌రిగ‌నున్న ఎన్నిక‌ల నేప‌థ్యంలో.. ఆయా పార్టీల నేత‌లు అప్పుడే ప్ర‌చార హోరు కొన‌సాగిస్తూ.. స‌రికొత్త హామీలు, అధికారంలోకి వ‌స్తే తీసుకురాబోయే ప‌థ‌కాలు వివ‌రాలు వెల్ల‌డిస్తూ రాజ‌కీయ హీటును పెంచారు.

Also Read: రూ.3 వేల కోసం బండ‌రాళ్ల‌తో కొట్టిచంపారు.. దేశ‌రాజ‌ధానిలో దారుణ ఘటన

Latest Videos

undefined

అన్ని పార్టీలు ఆయా రాష్ట్రాల్లో ఎలాగైన అధికారం చేజిక్కించుకోవాల‌ని ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేశాయి. తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. బీజేపీ పాలిత ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో పార్టీల మ‌ధ్య ఎన్నిక‌ల వార్ అప్పుడే మొద‌లైంది. ఆయా పార్టీల నేత‌ల మ‌ధ్య కొన‌సాగుతున్న మాట‌ల యుద్ధం మాములుగా లేదు. ఈ సారి యూపీలో అధికారం చేజిక్కించుకుంటామ‌ని కాంగ్రెస్ పేర్కొంటుండ‌గా, ఎన్నిక‌ల్లో విజ‌యం త‌మ‌దే విజ‌యం అని స‌మాజ్‌వాదీ అధినేత అఖిలేష్‌యాద‌వ్ ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. ఇక మ‌ళ్లీ అధికారం ద‌క్కించుకోవాల‌ని బీజేపీ ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది.  దీనిలో భాగంగా ప్ర‌చారం ముమ్మ‌రం చేసింది. అలాగే, ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకుని ప‌లు కొత్త ప‌థ‌క‌లు, కార్య‌క్ర‌మాలు చేప‌డుతోంది. దీనిలో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పటికే ఉత్తర ప్రదేశ్‌లో పలుమార్లు పర్యటించారు. వందల కోట్ల రూపాయల విలువ చేసే ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.

Also Read: Omicron: ఒమిక్రాన్ విజృంభ‌ణ‌.. ప‌లు రాష్ట్రాల్లో ఆంక్ష‌లు.. మ‌ళ్లీ లాక్‌డౌన్ తప్ప‌దా?

ఎలాగైనా ఉత్తర ప్రదేశ్‌లో వరుసగా రెండోసారి అధికారంలోకి రావడానికి బీజేపీ తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తుండ‌గా.. బీజేపీ ఎంపీ సుబ్ర‌మ‌ణ్య స్వామి శుక్ర‌వారం ఉద‌యం చేసిన ఓ ట్వీట్ సంచ‌ల‌నంగా మారింది.  ఉత్తర ప్రదేశ్‌లో ఎన్నికలు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయంటూ ఆయ‌న బాంబు పేల్చారు. ఎన్నిక‌ల వాయిదా వేసే దిశ‌గా  కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు  సన్నాహాలు సైతం మొదలు పెట్టినట్లు తనకు సమాచారం ఉందంటూ కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు.   సెప్టెంబర్ వరకు అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలనే దిశగా కేంద్రం పావులు కదుపుతోందని, త్వరలోనే దీనికి సంబంధించిన సమాచారంపై మరింత స్పష్టత రావొచ్చని పేర్కొన‌డం సంచ‌ల‌నంగా మారింది.  ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. శుక్ర‌వారం తెల్ల‌వారు జామున 4:22 నిమిషాలకు ఆయన ఈ ట్వీట్ చేయడాన్ని బట్టి చూస్తోంటే.. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. 

Also Read: సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ‌.. 12 గంట‌ల్లో స్పందించ‌కుంటే...

కేంద్ర ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం ఎందుకు తీసుకుంటున్న‌ద‌నే విష‌యాన్ని కూడా ఎంపీ సుబ్ర‌మ‌ణ్య స్వామి ప్ర‌స్తావించారు. ప్ర‌స్తుతం దేశంలో క‌రోనా వైర‌స్ ప్ర‌భావం పెర‌గుతోంది. అత్యంత ప్రమాద‌క‌ర‌మైన వేరియంట్‌గా భావిస్తున్న ఒమిక్రాన్ కేసులు సైతం పెరుగుతున్నాయి. ప‌రిస్థితులు అత్యంత వేగంగా మారుతున్నాయి. కాబట్టే ప్ర‌భుత్వం ఈ దిశగా కీలక నిర్ణయాన్ని తీసుకోవడానికి ఏర్పాట్లు చేసినట్లు సుబ్ర‌మ‌ణ్య స్వామి పేర్కొన్నారు. త్వరలోనే కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయానికి ఓ వినతిపత్రాన్ని పార్టీ తరఫున అందజేసే అవకాశాలు కూడా ఉన్నాయ‌ని తెలిపారు.  అలాగే, గ‌తంలో  అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తరువాత కరోనా వైరస్ పాజిటివ్ కేసుల తీవ్రత పెరిగింది.  పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అసోంల‌లో అసెంబ్లీ ఎన్నికల తరువాత సెకెండ్ వేవ్ సంభవించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో థర్డ్‌వేవ్ సంభవిస్తుందంటూ నిపుణులు చేస్తోన్న హెచ్చరికలను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవచ్చని అన్నారు. 

Also Read: Round-up 2021 | చ‌రిత్ర‌లో మ‌ర్చిపోలేని ఏడాది.. అనేక విషాదాల‌కు నిలువుట‌ద్దం 2021 !

click me!