New Delhi: దేశరాజధాని ఢిల్లీలో దోపిడీ దొంగలు మరోసారి రెచ్చిపోయారు. బర్త్‌డే పార్టీకి వెళ్లి తిరిగివస్తున్న వారిపై ఆ దొంగలు దాడిచేశారు. వారివద్ద ఉన్న వస్తువులు ఇవ్వాలంటూ విచక్షణ రహితంగా రాళ్ళూ, బండలు, కత్తులతో దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఒకరు చనిపోయారు.
New Delhi: దేశరాజధాని ఢిల్లీలో మరోసారి దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. బర్త్‌డే పార్టీకి వెళ్లి తిరిగివస్తున్న వారిపై ఆ దొంగలు దాడిచేశారు. వారివద్ద ఉన్న వస్తువులు, డబ్బును ఇవ్వాలంటూ బెదిరించారు. దానికి వారు నిరాకరించడంతో దోపిడీ దొంగలు వారిపై విచక్షణ రహితంగా రాళ్ళూ, బండలు, కత్తులతో దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరొకరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో ప్రాణాలు నిలుపుకోవడం కోసం పోరాడుతున్నారు. ఢిల్లీలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే.. ఈ నెల (డిసెంబర్) 20వ తేదీ రాత్రి బర్త్ డే పార్టీకి వెళ్లి తిరిగి వస్తుండగా ఇద్దరు వ్యక్తులు ఢిల్లీలో దారుణంగా దాడికి గురయ్యారు. ఘటనకు సంబంధించిన CCTV వీడియో ఫుటేజ్‌లో కొంతమంది వ్యక్తులు బాధితులపై దాడి చేయడం, పెద్ద రాళ్లతో కొట్టడం, సమీపంలోని మురికి కాల్వలోకి పడేయడం వంటి దృశ్యాలు కనిపించాయి. ఈ ఘటన దక్షిణ ఢిల్లీలోని సంగమ్ విహార్ ప్రాంతంలో సోమవారం అర్థరాత్రి జరిగింది. దోపిడీ దొంగలు పెద్ద రాళ్లతో బాధితులపై దాడి చేయడంతో ఇద్దరికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. ఈ ఘటన కారణంగా ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరోకరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Also Read: Omicron: ఒమిక్రాన్ విజృంభణ.. పలు రాష్ట్రాల్లో ఆంక్షలు.. మళ్లీ లాక్‌డౌన్ తప్పదా?
undefined
దోపిడీ దొంగల చేతుల్లో దాడికి గురైన వారిని ఘటన జరిగిన ప్రాంతానికి దగ్గరల్లోనే నివాసముంటున్న పంకజ్, జతిన్‌లుగా గుర్తించారు. వీరు ఓ కొరియర్ కంపెనీలో పనిచేస్తున్నారు. పంకజ్, జతిన్ ఇద్దరు దక్షిణ ఢిల్లీలోని సంగమ్ విహార్ ప్రాంతంలో ఓ బర్త్‌డే పార్టీకి వెళ్లి తిరిగి వస్తున్నారు. ఇదే సమయంలో వారిని అడ్డగించిన ఏడుగురు సభ్యులతో కూడిన దోపిడీ దారుల ముఠా బాధితులపై విచక్షణ రహితంగా దాడి చేసింది. అనంతరం వారి వద్ద ఉన్న డబ్బు ఇవ్వాలని బెదిరించింది. వారు ఇచ్చేందుకు ఒప్పుకోకపోవడంతో పెద్ద బండరాళ్లతో వారిపై దాడికి పాల్పడ్డారు. అనంతరం జతిన్ పాకెట్ లో ఉన్న 3,000 రూపాయలను లాక్కున్నారు. డబ్బులు తీసుకున్న తర్వాత మళ్లీ కత్తులు, పెద్ద పెద్ద రాళ్లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ బాధితులు ఇద్దరినీ పక్కనే ఉన్న డ్రైనేజీ కాలువలో పడేశారు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు సమయంలో చోటుచేసుకుంది. స్నేహితుడి పుట్టినరోజు వేడుక నుండి తిరిగి వస్తుండగా బాధితులపై దోపిడీ దొంగలు దాడి చేశారు. ఈ విషయం తెలుసుకున్న జతిన్ సోదరుడు గాయపడిన ఇద్దరిని ఇంటికి తీసుకెళ్లాడు.
Also Read: సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ.. 12 గంటల్లో స్పందించకుంటే...
దోపిడీ దొంగలు వారిపై దాడి చేసిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తీవ్రంగా గాయపడిన పంజజ్, జతిన్ లను వారి కుటుంబ సభ్యులు ఎయిమ్స్ ట్రామా సెంటర్‌కు చికిత్స కోసం తీసుకెళ్లారు. దీనిపై ఎఫ్ైఆర్ నమోదుచేశామని పోలీసులు తెలిపారు. దోపిడీ దొంగలను పట్టుకోవడానికి చర్యలు ప్రారంభించామని తెలిపారు. ఇదిలావుండగా, దుండగుల చేతిలో తీవ్రంగా గాయపడిన జతిన్ ఎయిమ్స్ ట్రామా సెంటర్ లో చికిత్స పొందుతూ.. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బుధవారం నాడు ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు ఈ ఘటనపై మాట్లాడుతూ.. "ఘటన జరిగిన 10 గంటల తర్వాత సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు దీని గురించి పీసీఆర్ కాల్ వచ్చింది. దీని తరువాత సంగమ్ విహార్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మేము ఒక నిందితుడు సంగం విహార్‌లో నివసిస్తున్న రంజన్ అలీని అరెస్టు చేసాము" అని అదనపు పోలీసు డిప్యూటీ కమిషనర్ (సౌత్) ఎం హర్షవర్ధన్ తెలిపారు. నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతనిపై ఇదివరకు పలు కేసులు ఉన్నట్టు గుర్తించారు. దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతున్నదనీ, పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.
Also Read: Round-up 2021 | చరిత్రలో మర్చిపోలేని ఏడాది.. అనేక విషాదాలకు నిలువుటద్దం 2021 !