Kanhaiya Lal Murder : 24 గంటల్లోనే కోటి రూపాయల విరాళాలు.. బీజేపీ నేత కపిల్ మిశ్రా ట్వీట్ కు భారీ స్పందన...

By SumaBala BukkaFirst Published Jun 30, 2022, 7:57 AM IST
Highlights

ఉదయ్ పూర్ లో దుండగుల చేతిలో హత్యకు గురైన  టైలర్ కన్హయ్యాలాల్ కుటుంబాన్ని ఆదుకోవడానికి బీజేపీ నేత కపిల్ మిశ్రా విరాళాల సేకరణ చేపట్టారు. 24 గంటల్లోనే కోటి రూపాయల విరాళాలు సమకూరాయి.

ఢిల్లీ : ఉదయ్ పూర్ లో హత్యకు గురైన కన్హయ్యాలాల్ కుటుంబాన్ని ఆదుకోవడానికి బీజేపీ నేత ఒకరు నిధుల సమీకరణ చేపట్టారు. ‘హిందూ విక్టిమ్స్’ ను ఆదుకోవడానికి ఈ విరాళాలు అంటూ ట్వీట్టర్ వేదికగా ప్రకటించారు. ఈ ఫండ్ కు  24 గంట్లోలనే కోటి రూపాయలు జమ అయ్యాయి. మహ్మద్ ప్రవక్త మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ బహిష్కృత నే నూపుర్ శర్మ వ్యాఖ్యలకు ఉదయపూర్‌లో టైలర్ కన్హయ్య లాల్‌ మద్దతునిచ్చారు. ఆమె ఫోటోను స్టేటస్ గా పెట్టుకున్నాడు. దీంతో రెచ్చిపోయిన దుండగులు అతడిని దారుణంగా హత్య చేశారు. 

జూన్ 28న ఇద్దరు దుండగులు టైలర్ దుకాణంలోకి వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. దుస్తులు కుట్టుడం కోసం కొలతలు తీసుకుంటున్న టైలర్ ను గొంతు కోసి దారుణంగా చంపేశారు. బట్టలు కుట్టించుకుంటామనే నెపంతో హంతకులు అతని దుకాణానికి వచ్చి హత్య చేశారు. అంతే కాదు ఈ ఘటన మొత్తాన్ని వీడియో తీసి.. వైరల్ చేశారు. ఇలా చేసే ఎవరికైనా ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. 

దీంతో ఉదయ్ పూర్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్తితులు నెలకొన్నాయి. దుండగులు రియాజ్ జబ్బార్, గౌస్ మహ్మద్ లుగా గుర్తించారు. ఇలా ఉండగా మరణించిన పేద టైలర్ కుటుంబానికి సహాయం చేయడానికి బిజెపి నేత కపిల్ మిశ్రా నిధుల సమీకరణను ప్రారంభించాడు. నిధుల సమీకరణ 24 గంటల్లో రూ. 1 కోటి సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దాన్ని రీచ్ అయ్యారు. అయినా నిధుల ప్రవాహం ఆగడం లేదు. ఇది తొందర్లోనే రూ. 1.25 కోట్లు చేరుకునే అవకాశం ఉంది. 

కన్హయ్యలాల్ హత్యకు సంబంధించిన వీడియో, హంతకుల వాంగ్మూలం వైరల్ కావడంతో, బీజేపీ నేత కపిల్ మిశ్రా చొరవ తీసుకున్నారు. క్రౌడ్ ఫండింగ్ కు ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు. విరాళాలు ఇవ్వాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు. ఈ వీడియోలో, “కన్హయ్య లాల్ జీని మతం పేరుతో దారుణంగా చంపారు. ఈ పరిస్థితిలో మనం వారి కుటుంబాన్ని విడిచిపెట్టలేం. వారి కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించుకున్నాం. రూ. 1 కోటి లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ మొత్తాన్ని నేనే స్వయంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి అందజేస్తాను. దీనికోసం మీరంతా మీవంతు విరాళాలు అందించాలని కోరుతున్నాను” అని మాట్లాడారు. 

ఈ ట్వీట్ చేసిన 24 గంటల్లోనే కోటి రూపాయల విరాళాలు రావడం గమనార్హం. దీని తర్వాత కపిల్ మిశ్రా దాతలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అదే ట్వీట్‌లో, కన్హయ్య లాల్‌ను రక్షించే ప్రయత్నంలో తీవ్రంగా గాయపడిన ఈశ్వర్ సింగ్‌కు కూడా ఈ విరాళాల్లోంచి రూ. 25 లక్షలు ఇస్తామని తెలిపారు. దీనికి సంబంధించి ట్వీట్ చేస్తూ కపిల్ మిశ్రా.. “జై శ్రీరామ్. అందరికి ధన్యవాదాలు. 24 గంటల్లోనే కోటి రూపాయలు వసూలయ్యాయి. అది చూసి నా కన్నీళ్లు ఆగడం లేదు. హిందువులు కన్హయ్య కుటుంబానికి అండగా నిలిచారు. ఇది హిందూ పర్యావరణ వ్యవస్థ. ఆసుపత్రిలో ఉన్న ఈశ్వర్ సింగ్ జీకి కూడా దీంట్లో నుంచి రూ. 25 లక్షలు ఇస్తాం’ అని అన్నారు.

click me!