అప్పు తిరిగివ్వలేదని, అక్కాచెల్లెళ్లను వివస్త్రలను చేసి దాడి.. వీడియో వైరల్ కావడంతో..

By SumaBala BukkaFirst Published Jun 30, 2022, 7:12 AM IST
Highlights

బెంగళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. అడిగిన వెంటనే అప్పు చెల్లించలేదని ఇద్దరు మహిళలను వివస్త్రలను చేసి దాడి చేశారు. 

బెంగళూరు :  కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు సమీపంలో గల సార్జాపుర  పోలీస్ స్టేషన్ పరిధిలో  లో దారుణమైన అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు అక్కాచెల్లెళ్లను కొందరు వ్యక్తులు వివస్త్రను చేశారు.  ఆపై వారిపై దాడికి దిగారు. తీసుకున్న అప్పు మొత్తం ఒకేసారి చెల్లించలేదని కారణంతోనే ఈ దారుణమైన దాడికి దిగినట్టు  సమాచారం.  ఈ ఘటనలో  పోలీసులు  వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  కారణం,  బాధితుల ఫిర్యాదును పోలీసులు  ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత వారికి కూడా స్వీకరించాక పోవడంపై.. ప్రజలు భగ్గుమంటున్నారు.  ఆందోళన ఆ తర్వాత దర్యాప్తు చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.  మరో వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు.

అనేకల్  తాలూకా  దొడ్డబొమ్మసంద్రకు చెందిన  ఒక మహిళ  తన పిల్లల చదువుల కోసం, నెరిగ గ్రామానికి చెందిన  రామకృష్ణ రెడ్డి అనే వ్యక్తి  వద్ద రూ.లక్ష  అప్పు తీసుకుంది. అయితే,   ఈ లక్ష రూపాయలకు అతను 30 శాతం వడ్డీ వసూలు చేస్తున్నాడు.  అయినా కూడా అవసరానికి తీసుకున్నందుకు  బాధితురాలు  క్రమం తప్పకుండా వడ్డీ చెల్లిస్తూ వచ్చింది.   అయినా కూడా తీసుకున్న రుణం మొత్తం  వెంటనే చెల్లించాలని రామకృష్ణ ఆమెపై ఒత్తిడి తీసుకు వచ్చాడు.  బాధితురాలు  తన భూమిని  అమ్మేసి,,  డబ్బులు చెల్లించాలని..  గ్రామ పెద్దల సమక్షంలో అంగీకారం కుదిరింది.  ఇదిలా ఉండగా ఈ లోపు నిందితులు బాధితురాలి ఇంట్లోకి అక్రమంగా చొరబడి  ఆమెను వివస్త్రను చేసి.. దారుణంగా దాడికి పాల్పడ్డారు.  ఇంట్లో ఉన్న ఆమె సోదరి అదే తరహాలో దారుణంగా ప్రవర్తించారు.

ఈ దాడి తర్వాత  బాధితులు ఇద్దరు  సర్జాపురా  పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు.  అయితే ఎస్సై రాఘవేంద్ర వారి ఫిర్యాదును తీసుకోలేదు. నిందితులతో చర్చించి,  ఈ సమస్యను పరిష్కరించుకోవాలని బాధితులకు సూచించారు కూడా.  అయితే, మీద జరిగిన దాడిని ఎవరో వీడియోలు తీశారు.  ఈ వీడియోలు  సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో  ప్రజల ఆగ్రహానికి గురయ్యారు.  దీంతో పోలీసులు ప్రజల ఒత్తిడితో మంగళవారం రాత్రి  ఫిర్యాదును  స్వీకరించారు. రామకృష్ణ రెడ్డి తో పాటు,  దాడి చేసిన మరో నిందితుడు సునీల్ కుమార్ ను కూడా  పోలీసులు అరెస్టు చేసినారు.  మరో నిందితుడి కోసం  గాలిస్తున్నారు. 

ఒకే ఇంట్లో తొమ్మిది మృతదేహాలు.. అవి ఆత్మహత్యలు కాదు హత్యలు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..

కాగా, రుణయాప్ లు ఇలాంటి ఘోరాలకే పాల్పడుతున్నాయి. హైదరాబాద్ నగరానికి చెందిన యువకుడు లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాడు. అనుకున్న సమయానికి డబ్బులు చెల్లించకపోవడంతో నిర్వాహకులు నుంచి ఒత్తిడి మొదలైంది. అసలు, వడ్డీ వెంటనే చెల్లించాలని అంతవరకు వదలం అంటూ వెంట పడ్డారు. అతను నుంచి స్పందన రాకపోవడంతో... బాధితుడి ఫోన్ లోని నెంబర్ల.. ఆధారంగా అతడి మిత్రుల వాట్సాప్ డీపీ ఫోటోలు సేకరిస్తున్నారు. వాటిని నగ్న చిత్రాలుగా మార్కింగ్ చేసి.. వారికే పంపుతున్నారు. మీ స్నేహితుడు అప్పు తీర్చుకుంటే ఇవన్నీ బయటకు పంపుతామని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.

ఇక, హైదరాబాద్ రేతిబౌలికి చెందిన ఓ మహిళ ఇంటి అవసరాలకు అధిక వడ్డీకి వేరే వేరే రుణయాప్ ల నుంచి రెండు లక్షల రూపాయలు తీసుకుంది. తిరిగి చెల్లించడంలో ఆలస్యం అయ్యింది. దీంతో వారు ఆమె సహచర ఉద్యోగులకు ఫోన్ చేసి కించ పరిచారు. ఆమె ఫోన్ నెంబర్ ను 500 మంది యువకులకు ఇచ్చారు. వారి నుంచి అసభ్యంగా ఫోన్లు రావడం మొదలయ్యింది. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. 

click me!