
మహారాష్ట్ర శివసేన యువ నాయకుడు, ఎమ్మెల్యే భరత్ సేత్ కుమారుడు వికాస్ గోగవాలే కాంగ్రెస్, ఎన్సీపీలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమ పార్టీకి బీజేపీ శత్రువు కాదని, మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో భాగమైన ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలే అసలైన శత్రువులు అని అన్నారు. ‘‘ ప్రతి ఒక్కరూ తమకు శత్రువు బీజేపీ అని పదే పదే చెబుతున్నారు. కానీ మా నిజమైన శత్రువు కాంగ్రెస్, ఎన్సీపీ అని నేను భావిస్తున్నాను’’ అని గోగవాలే వ్యాఖ్యానించారు.
శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ శివసేన చేస్తున్న కృషి, అభివృద్ధికి తప్పుడు క్రెడిట్ ఆరోపించారు. ఆ పార్టీ ఎంవీఏ కూటమి పక్షాలైన శివసేన, కాంగ్రెస్ నుంచి నాయకులను లాక్కుంటోందని అన్నారు.‘‘ 'మా భరత్ సేత్ గోగవాలే ఇక్కడ పని చేస్తూ అభివృద్ధి చేస్తున్నారు. కానీ ఎన్సీపీ క్రెడిట్ తీసుకుంటుంది. కొన్ని నెలల క్రితం ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ మహద్ లో ఉన్నారు. ఆ సమయంలో వారు కాంగ్రెస్ కు చెందిన నలుగురు స్థానిక నాయకులను, ఒక శివసేన మాజీ కార్పొరేటర్ ను వారి పార్టీలోకి తీసుకున్నారు.’’ అని తెలిపారు.
Ajit Pawar: దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారు.. కేంద్రంపై అజిత్ పవార్ ఫైర్
ఎంవీఏ కూటమిని కాపాడుకోవడానికి శివసేన శాయశక్తులా ప్రయత్నిస్తుండగా, ఎన్సీపీ అన్ని ఫౌల్ ప్లే చేస్తుందని శరద్ పవార్ పార్టీపై యువ సేన నాయకుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో వికాస్ గోగవాలే తండ్రి, ఎమ్మెల్యే కూడా ఎన్సీపీపై ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సంరక్షక మంత్రి అదితి తట్కరేను మారర్చాలని సీఎం ఉద్ధవ్ ఠాక్రేను డిమాండ్ చేశారు. కొన్ని రోజుల కిందట కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలే కూడా ఎన్సీపీ తమ పార్టీని వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు. అలాగే శివసేన నాయకుడు తానాజీ సావంత్ తన అభ్యంతరాన్ని లేవనెత్తారు. మహారాష్ట్ర ఎంవీఏ ప్రభుత్వంలో ఎన్సీపీ ఏకైక లబ్దిదారు అని, ఆ పార్టే అధిక నిధులు పొందిందని ఆరోపించారు.
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. ప్రియుడితో కలిసి భర్త హత్య.. ముగ్గురి అరెస్ట్..
2019 సంవత్సరంలో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. అయితే ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదు. గతంలో బీజేపీ, శివసేనలు కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే సీఎం పదవి విషయంలో రెండు పార్టీలకు మధ్య విభేదాలు వచ్చాయి. పలుమార్లు చర్చల తరువాత ఈ రెండు పార్టీల మధ్య ఉన్న మితృత్వం విడిపోయింది. అయితే విరుద్ద భావాలు కలిగిన శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈ కూటమికి మహా వికాస్ అఘాడీగా పేరు పెట్టుకున్నాయి. ఈ కూటమికి శివసేన నేతృత్వం వహిస్తుండగా సీఎం కూడా ఆ పార్టీ నుంచే ఉన్నారు. ఈ మూడు పార్టీలకు మధ్య ఏర్పడిన ఒప్పందం వల్ల మూడు పార్టీల నాయకులకు మంత్రి పదవులు పంపకాలు జరిగాయి. అయితే బీజేపీ ప్రతిపక్షంలో కూర్చుంది. ఈ మూడు పార్టీలకు మహారాష్ట్రలోని పలు పార్టీలో బలం ఉంది. దీంతో అవి తమ బలాన్ని రాష్ట్రమంతా విస్తరించుకోవాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ కూటమి మధ్య విభేదాలు వస్తున్నట్టు తెలుస్తోంది.