
ముంబై : Debt ఇచ్చిన మహిళను murder చేసి.. Corpseని పట్టాలపై పారేసిన యువకుడిని ముంబై రైల్వే పోలీసులు 14 గంటల్లోనే అరెస్టు చేశారు. CCTV cameraల ఆధారంగా ఈ అరెస్టు చేసినట్లు వారు వివరించారు. డబ్బు వివాదం కారణంగానే ఆ మహిళను చంపినట్లు నిందితుడు విచారణలో అంగీకరించాడు. పోలీసుల కథనం ప్రకారం.. గోరేగావ్ లో నివసిస్తున్న సారిక దామోదర్ చల్కే (30) ఒక ప్రైవేటు సంస్థలో పని చేసేది. అక్కడే హౌస్కీపింగ్ ఈ విభాగంలో పనిచేస్తున్న ఖైర్నార్ పలు విడతలుగా ఆమె వద్ద భారీ మొత్తాన్ని అప్పుగా తీసుకున్నాడు. రోజులు గడుస్తున్నా డబ్బు తిరిగి చెల్లించకపోవడంతో.. రుణం తిరిగి చెల్లించాల్సిందిగా ఆ మహిళ కోరింది. దీంతో ఖైర్నార్ ఆమెతో గొడవ పడ్డాడు.
ఈ క్రమంలో ఆమె ఇలా డబ్బు అడుగుతూనే ఉంటుందని.. భావించిన ఖైర్నార్ ఆమెను అతి దారుణంగా హత్య చేశాడు. ఆమె మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచిలో కుక్కి మంగళవారం ఉదయం మహీం-మాతుంగా స్టేషన్ల మధ్య రైల్వే పట్టాలపై పడేశాడు. ట్రాక్ పై మృతదేహాన్ని గుర్తించిన రైల్వే పోలీసులు... మృతదేహాంపై దాదాపు నాలుగు చోట్ల కత్తిపోట్లు ఉండడంతో హత్యగా భావించారు. మృతదేహాన్ని పారేయడానికి ఉపయోగించిన సంచులపై ‘హరి ఓం డ్రగ్, గోరేగావ్’ అని రాసి ఉండటాన్ని గుర్తించారు. దాని ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. అప్పటికే ఆమె ఆచూకీ కోసం భర్త ఫిర్యాదు చేయడంతో.. మృతురాలిని సారికగా గుర్తించారు. ఆమె పనిచేసే కార్యాలయంలో సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించగా… ఈ హత్యలో ఖైర్నార్ నిందితుడిగా తేలింది. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉండగా, ఓ మహిళ తన ప్రేమికుడితో కలిసి తన భర్తను హత్య చేసేందుకు కుట్ర పన్నింది. ఈ కేసుకు సంబంధించి మహిళ, ఆమె ప్రేమికుడితో సహా ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మే 19న ఆ ప్రాంతంలోని పశువైద్యశాల సమీపంలో ఓ వ్యక్తి మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. విచారణలో మృతుడిని సతీష్‌గా గుర్తించారు.
వివరణాత్మక దర్యాప్తు తర్వాత, నిందితులలో ఒకరైన రామ్‌కిషోర్‌ను పోలీసులు జీరో-ఇన్ చేశారు. అతనికి మృతుడి భార్య పూజకు వివాహేతరసంబంధం ఉంది. దీంతో తమ సంబంధానికి భర్త అయిన సతీష్ అడ్డుగా ఉన్నాడని భావించి.. హత్య చేసేందుకు పథకం పన్నారు. ఈ మేరకు కుట్ర పన్ని, సతీష్ ను హత్య చేశారు. పక్కా ప్లాన్ వేసి, రామ్‌కిషోర్ తన స్నేహితుడు మంజీత్‌తో కలిసి సతీష్ ను హత్య చేసినట్లు అంగీకరించాడు.
ఇద్దరు నిందితులు సతీష్‌ను ఓ చోటికి పిలిపించి అతడికి మద్యం తాగించారు. ఆ తరువాత మత్తులోకి జారుకున్నాక ఇటుకతో తల మీద పదే పదే కొట్టి చితకబాదారు. అనంతరం సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు మృతదేహాన్ని పొదల్లో దాచిపెట్టి, పరారయ్యారు.