అరుణాచల్ ప్రదేశ్ పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో బీజేపీకే మెజారిటీ.. 130 స్థానాల్లో 102 ఏక‌గ్రీవం

Published : Jul 08, 2022, 02:00 PM IST
అరుణాచల్ ప్రదేశ్ పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో బీజేపీకే మెజారిటీ.. 130 స్థానాల్లో 102 ఏక‌గ్రీవం

సారాంశం

అరుణాచల్ ప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. అయితే ఇందులో మెజారిటీ స్థానాలను అధికారిక బీజేపీయే గెలుచుకుంది. కాంగ్రెస్, ఇండిపెండెట్లు కలిసి మరో 14 స్థానాలను కైవసం చేసుకున్నారు. మిగిలిన స్థానాలకు త్వరలోనే ఎన్నికలు నిర్వహించనున్నారు. 

అరుణాచల్ ప్రదేశ్‌లోని 130 పంచాయతీ స్థానాలకుగానూ 102 స్థానాలను బీజేపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. ఇటీవ‌ల రాష్ట్రంలో పంచాయ‌తీ ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిది. అయితే ఈ స్థానాల్లో మెజారిటీ స్థానాలు బీజేపీయే సొంతం చేసుకుంది. 130లో 102 మంది బీజేపీ త‌రుఫునే ఏకగ్రీవంగా ఎన్నిక‌య్యారు. 

మెరుగవుతున్న లాలు ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం.. హాస్పిటల్ నుంచి లాలు చిత్రాన్ని షేర్ చేసిన కూతురు

మరో 14 స్థానాల్లో కాంగ్రెస్, నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ), స్వతంత్ర అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. అయితే మిగిలిన 14 పంచాయ‌తీ స్థానాల‌కు, ఒక జిల్లా ప‌రిష‌త్ స్థానానికి జూలై 12వ తేదీన ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్నామ‌ని  అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి న్యాలీ ఈటే ANIకి తెలిపారు.

maharashtra politics : స్పీక‌ర్ ఎన్నిక‌, కొత్త ప్ర‌భుత్వ ఏర్పాటుపై సుప్రీంకోర్టును ఆశ్ర‌యించిన ఉద్ద‌వ్ ఠాక్రే

కాగా అరుణాచల్ ప్రదేశ్ పంచాయ‌తీ ఉప ఎన్నికల్లో 102 మంది బీజేపీ అభ్యర్థులను ఏకపక్షంగా ఎన్నుకున్నందుకు మద్దతుదారులు, సానుభూతిపరులందరికీ ముఖ్యమంత్రి పెమా ఖండూ ధన్యవాదాలు తెలిపారు. ‘‘ అరుణాచల్ ప్రదేశ్‌లోని 130 గ్రామ పంచాయతీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో 102 మంది బీజేపీ అభ్యర్థులను ఏకపక్షంగా ఎన్నుకున్నందుకు కార్యకర్తలు, మద్దతుదారులు, సానుభూతిపరులందరికీ అభినందనలు, ధన్యవాదాలు ’’ అని ఖండూ ట్వీట్ చేశారు.

అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తమ ఆకాంక్షలను నెరవేర్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్న ముఖ్యమంత్రి పెమా ఖండూ నాయకత్వంపై పూర్తి విశ్వాసంతో ఉన్నారని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు అన్నారు. ‘‘ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి,  ఈశాన్య ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ దార్శనికతలను అమలు చేయడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్న పెమా ఖండూ నాయకత్వంపై అరుణాచల్ ప్రదేశ్ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది ’’ అని రిజిజు ట్వీట్‌లో పేర్కొన్నారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Special Trains for Sankranti Festival: సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లు| Asianet News Telugu
Real estate: నెల రోజుల్లో రూ. 20 ల‌క్ష‌ల లాభం.. అక్క‌డ రియ‌ల్ ఎస్టేట్ అంతలా ఎందుకు పెరుగుతోంది.?