గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు.. బిల్కిస్ బానో దోషులను సమర్థించిన ఎమ్మెల్యేకే మళ్లీ బీజేపీ టికెట్

Published : Nov 12, 2022, 04:40 AM IST
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు.. బిల్కిస్ బానో దోషులను సమర్థించిన ఎమ్మెల్యేకే మళ్లీ బీజేపీ టికెట్

సారాంశం

బిల్కిస్ బానో కేసు దోషుల విడుదలను సపోర్ట్ చేసిన ఎమ్మెల్యేకే బీజేపీ మళ్లీ టికెట్ ఇవ్వడంపై కలకలం రేపింది. అంతేకాదు, బిల్కిస్ బానోపై అత్యాచారం జరిగిన గోద్రా నియోజకవర్గం నుంచే ఆ నేత పోటీలోకి దిగడం మరింత దారుణంగా ఉన్నది.  

అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. నామినేషన్లు వేయాల్సి ఉన్నది. అయితే, సీట్ల కేటాయింపులపై అన్ని పార్టీలు కసరత్తులు చేస్తున్నాయి. ఈ తరుణంలో కీలక విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. 2002 గుజరాత్ అల్లర్లు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. అదే సమయంలో బిల్కిస్ బానోకు, ఆమె కుటుంబానికి జరిగిన నష్టాన్ని విని దేశమంతా విస్తూపోయింది. బిల్కిస్ బానో కేసులో దోషులను ఆగస్టు 15వ తేదీన సత్ప్రవర్తన కింద విడుదల చేశారు. ఈ నిర్ణయాన్ని పలువురు విమర్శించారు కూడా. అయితే, ఈ బిల్కిస్ బానో కేసులో విడుదలైన దోషులను వెనుకేసుకు వచ్చిన ఎమ్మెల్యేకే బీజేపీ మళ్లీ టికెట్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నది. అది కూడా బిల్కిస్ బానోపై అత్యాచారం జరిగిన గోద్రా నియోజకవర్గం నుంచే ఆ ఎమ్మెల్యే పోటీ చేయడం ఈ ఆందోళనను రెట్టింపు చేస్తున్నాయి. 

బిల్కిస్ బానో కేసులో దోషుల విడుదల అంశాన్ని పరిశీలించాల్సిందిగా సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో దీన్ని ఒకసారి పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయస్థానం సూచనలు చేసింది. ఈ మేరకు గుజరాత్ ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. ఈ కమిటీలో బీజేపీ ఎమ్మెల్యే చంద్రసిన్హా కూడా ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్యే చంద్రసిన్హ ఉన్న కమిటీ చివకు తీర్పును ఏకపక్షంగా దోషులను విడుదల చేయాలనే  తీర్మానం చేసింది.

ఈ నిర్ణయంలో భాగం పంచుకోవడమే కాదు.. విడుదలైన దోషులపైనా ప్రశంసలు కురిపించడం గమనార్హం 'వాళ్లంతా బ్రాహ్మణులు.... సంస్కారవంతులు అని కామెంట్ చేశారు. అంతేకాదు,  ఉద్దేశ్యపూర్యవకంగా వాళ్లను కేసుల్లో ఇరికించారని, తద్వారా వారికి శిక్షలు పడేలా చేశారు అని ఆరోపించారు. ఈ ఎమ్మెల్యేకే బీజేపీ మళ్లీ తాజాగా టికెట్ కన్ఫామ్ చేయడం గనమనార్హం.

Also Read: గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ సంచలన నిర్ణయం.. ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటన..

చంద్రసిన్హా నిజానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే. 2007 నుంచి 2012 వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా చేపట్టారు. 2017 ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్‌ కు రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నాడు. 2017 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పై 258 ఓట్ల తేడాతో గెలిచారు.

2002 గోద్రా గొడవ తర్వాత అత్యాచార ఘటన చోటుచేసుకుంది. అప్పుడు ఐదు నెలల గర్భిణీగా ఉన్న బిల్కిస్ కుటుంబం పై దాడి చేశారు. అనంతరం, ఆమెపైనా గ్యాంగ్ రేప్ చేశారు. ఈ కేసులో వారికి జీవిత ఖైదు పడింది. వారు 15 ఏళ్లు జైలులో గడపానే 15వ తేదీన ప్రభుత్వం తెలిపింది.

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌