పట్టపగలే గన్ గురి పెట్టి చైన్ స్నాచింగ్ చేసిన దుండగులు.. ఇరుగు పొరుగు చూస్తుండగానే దుశ్చర్య.. (వీడియో)

Published : Nov 12, 2022, 01:44 AM IST
పట్టపగలే గన్ గురి పెట్టి చైన్ స్నాచింగ్ చేసిన దుండగులు.. ఇరుగు పొరుగు చూస్తుండగానే దుశ్చర్య.. (వీడియో)

సారాంశం

పంజాబ్‌లో ఇద్దరు దుండగులు పట్టపగలే చుట్టూ ప్రజలు చూస్తుండగానే ఓ మహిళ మెడలో నుంచి చైన్ స్నాచ్ చేశారు. గన్ గురి పెట్టి అక్కడ ఉన్నవారందరినీ బెదిరించారు. చైన్ చేత పట్టుకుని స్పాట్ నుంచి పరారయ్యాడు.  

న్యూఢిల్లీ: పంజాబ్‌లో ఓ దారుణం జరిగింది. ఇద్దరు దుండగులు పట్టపగలే బహిరంగంగా చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డారు. ఆ మహిళ ఇంటి వెలుపలే ఇరుగు పొరుగు చూస్తుండగానే గన్ గురి పెట్టి బెదిరించి మరీ మెడలో చైన్ లాక్కెళ్లారు. ఆ గలాట సదరు మహిళ నేలపై పడిపోయారు. అయినా.. చైన్ వదల్లేదు. ఆ దుండగులను అడ్డుకోబోయిన బిడ్డనూ చెంప పై కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

ఈ ఘటన పంజాబ్‌లో తర్న్ తరణ్‌లో చోటుచేసుకుంది. ఓ మహిళను ఇంటి వెలుపలే ఇద్దరు దుండగులు పట్టుకున్నారు. మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కునే ప్రయత్నం చేశారు. చేతిలో గన్ పట్టుకుని బెదిరించారు. అప్పుడు ఇరుగుపొరుగు వారు.. రోడ్డు పై వెళ్లుతున్న వారూ ఉన్నారు. వారిలో కొందరు ఆ దుశ్చర్యను ఆపే ప్రయత్నం చేశారు. కానీ, ఆ దుండగులు గన్‌తో బెదిరించడం, ఫోర్స్ యూజ్ చేయడంతో వెనుకడుగు వేశారు. కాగా, స్కూల్‌కు వెళ్తున్న ఆ బాధితురాలి బిడ్డ మాత్రం వెనుదిరుగలేదు. భయపడలేదు. దుండగుల చేతిలో గన్ ఉన్నప్పటికీ వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించింది. దీంతో ఓ దుండగుడు ఆ అమ్మాయి చెంప పై కొట్టాడు. మళ్లీ కిందకు వంగి నేలపై పడిపోయిన చైన్‌ను చేతిలోకి తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. 

ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో పంజాబ్‌లోని తర్న్ తరణ్‌కు చెందినదని ఆ యూజర్ రాసుకొచ్చాడు. ఈ ఇధ్దరు దుండగులు మహిళ మెడ నుంచి పట్టపగలే చైన్‌ను లాక్కెళ్లారని వివరించాడు. వీరిపై వెంటనే యాక్షన్ తీసుకోవాలని పోలీసులకు ట్యాగ్ చేశారు. 

ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఏఎన్ఐ సమాచారం ప్రకారం, పోలీసులు ఆ గుర్తు తెలియని దుండగులపై కేసు నమోదు చేశారు.

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌