ఎఫ్ఆర్ మైఖేల్‌కు పీఆర్‌సీఐ హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డు

Published : Nov 12, 2022, 12:50 AM IST
ఎఫ్ఆర్ మైఖేల్‌కు పీఆర్‌సీఐ హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డు

సారాంశం

పీఆర్‌సీఐ హాల్ ఆఫ్ ఫేమ్ ప్రెస్టీజియస్ అవార్డు సీనియర్ పీఆర్‌వో (రిటైర్డ్) ఎఫ్ఆర్ మైఖేల్‌‌కు దక్కింది. బెంగాల్ మంత్రి షోభాందేబ్ ఛటోపాద్యాయ్ ఈ అవార్డును అందించార.  

న్యూఢిల్లీ: సీనియర్ పీఆర్‌వో (రిటైర్డ్) ఎస్‌సీఆర్, డైరెక్టర్ పీఆర్‌సీఐ, నేషనల్ ఎగ్జిక్యూటివ్ ఎఫ్ఆర్ మైఖేల్‌కు పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా హాల్ ఆఫ్ ఫేమ్ ప్రెస్టీజియస్ అవార్డు దక్కింది. బెంగాల్ వ్యవసాయ మంత్రి షోభాందేబ్ ఛటోపాద్యాయ్ ఈ అవార్డును ఎఫ్ఆర్ మైఖేల్‌కు అందించారు. పీఆర్‌సీఐ చీఫ్ మెంటర్, చైర్మన్ ఎమిరిటస్ ఎంబీ జయరాం, పీఆర్‌సీఐ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ టీ వినయ్ కుమార్‌ల సమక్షంలో ఈ అవార్డు ప్రదానం చేశారు.

నవంబర్ 11వ తేదీన కోల్‌కతాలో నిర్వహించిన 16వ పీఆర్‌సీఐ గ్లోబల్ కాంక్లేవ్‌లో ఎఫ్ఆర్ మైఖేల్‌కు ఈ అవార్డును ప్రదానం చేశారు. పీఆర్ వృత్తిలో ఆయన చేసిన విశేష కృషికి గాను ఈ అవార్డును ప్రదానం చేశారు. కోల్‌కతాలోని మేరియట్ ఫెయిర్‌ఫీల్డ్‌లో నిర్వహించిన ఫంక్షన్‌లో సత్కారం జరిగింది. పీఆర్ ప్రొఫెషన్‌లో ప్రముఖమైన పాత్ర పోషించిన మీడియా ప్రొఫెషనల్స్‌కు, పీఆర్‌ సేవలు అందించిన వారికి నేషనల్ పీఆర్‌సీఐ ఎక్స్‌లెన్స్ అవార్డులు ప్రదానం చేస్తారు.

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌