కేరళ నన్‌పై రేప్ కేసు: నేను నిర్దోషిని, రక్షించండి.. సుప్రీంకెక్కిన వివాదాస్పద బిషప్

By Siva KodatiFirst Published Jul 25, 2020, 7:36 PM IST
Highlights

పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన బిషప్ ఒకరు తనను రేప్ కేసులో ఇరికించారంటూ ఈ అభియోగాలను కొట్టివేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు

పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన బిషప్ ఒకరు తనను రేప్ కేసులో ఇరికించారంటూ ఈ అభియోగాలను కొట్టివేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళితే.. ఫ్రాంకో ములక్కల్ అనే బిషప్ 2014-16 మధ్యకాలంలో కేరళకు చెందిన ఓ నన్‌పై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడట.

బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై 2018 జూన్‌లో కొట్టాయం పోలీసులు ఇతనిపై కేసు నమోదు చేశారు. అయితే తాను నిర్దోషినని.. ఈ కేసులో తనను అన్యాయంగా ఇరికించారని దీనిని కొట్టివేయాలని కోరుతూ ములక్కల్.. ట్రయల్ కోర్టుతో పాటు కేరళ హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్లను న్యాయస్థానాలు కొట్టివేశాయి. ములక్కల్‌పై నమోదైన అభియోగాలపై దర్యాప్తు చేసిన కేరళ పోలీస్ శాఖకు చెందిన సిట్ ఇతడిని 2018 సెప్టెంబర్‌లో అరెస్ట్ చేసింది.

ఎన్నోసార్లు విచారణ అనంతరం 40 రోజుల తర్వాత బెయిల్‌పై విడుదల చేసింది. అయితే ఇప్పటికీ తనను పోలీసులు వేధిస్తున్నారని.. తనపై రేప్ అభియోగాలను కొట్టివేయాలని కోరుతూ ములక్కల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

click me!