బైపోలార్ డిజార్డర్‌తో బాధపడుతున్న వ్యక్తి.. జడ్జీగా సేవలు అందించడానికి సుప్రీం గ్రీన్ సిగ్నల్

By Mahesh KFirst Published Dec 15, 2021, 1:03 PM IST
Highlights

సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. బైపోలార్ డిజార్డర్‌తో బాధపడుతున్న ఓ వ్యక్తికి న్యాయమూర్తిగా ఎదిగేందుకు మార్గం సుగమం చేసింది. ఢిల్లీ హైకోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తూ మెడికల్ బోర్డు సూచనల మేరకు సుప్రీంకోర్టు.. బైపోలార్ డిజార్డర్‌తో బాధపడుతున్న వ్యక్తిని డిజేబిలిటీ కోటాలో జ్యూడీషియల్ ఆఫీసర్‌గా ఎంపిక చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

న్యూఢిల్లీ: బైపోలార్ డిజార్డర్‌(Bipolar Disorder)తో బాధపడే వ్యక్తిలో తరచూ మూడ్ స్వింగ్ అవుతూ ఉంటుంది. అంటే వెంట వెంటనే సదరు వ్యక్తిలో మూడ్స్ స్వింగ్ అవుతూ మారుతుంటాయి. ఈ మానసిక జబ్బుతో బాధపడుతున్న వ్యక్తిని న్యాయమూర్తిగా సేవలు అందించడానికి సుప్రీంకోర్టు మార్గం సుగమం చేసింది. Supreme Court అనుమతితో ఆయన త్వరలోనే ఢిల్లీ జ్యూడీషియల్ సర్వీసులో సేవలు అందించనున్నారు. సుప్రీంకోర్టు నిర్ణయం సంచలనంగా మారింది. 

ఢిల్లీ లోయర్ జ్యూడీషియరీలో జ్యూడీషియల్ అధికారి పోస్టు కోసం 2018లో ఓ నోటిఫికేషన్ విడుదలైంది. అందులో వికలాంగుల కోటా(Disability Quota)లో ఒక సీటు ఉన్నది. ఈ కోటాలో జ్యూడీషియల్ ఆఫీసర్ పోస్టు కోసం ఓ అభ్యర్థి దరఖాస్తు చేసుకున్నారు. ఆయనకు బైపోలార్ డిజార్డర్ ఉంది. మెంటల్ ఇల్‌నెస్ కేటగిరీలో ఆయన 2018లో వైకల్యంపై సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు. ఆ సర్టిఫికేట్ 2023 వరకు చలామణి అవుతుంది. ఈ సర్టిఫికేట్‌తో డిజేబిలిటీ కేటగిరీలో పోస్టు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ కేటగిరీలో దరఖాస్తు చేసుకున్నది ఈయన ఒక్కరే. దీంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సంజయ్ కిషన్ కౌల్, ఎంఎం సుంద్రేశ్‌లతో కూడిన ధర్మాసనం ఈ విషయాన్ని మెడికల్ బోర్డుకు పంపింది. ఎయిమ్స్‌లో సీనియర్ సైకియాట్రిస్ట్ సారథ్యంలోని ఈ బోర్డు అభిప్రాయాన్ని తీసుకుని సుప్రీంకోర్టు తాజా నిర్ణయం తీసుకుంది.

Also Read: సెక్స్ వ‌ర్క‌ర్ల‌కు అన్ని హ‌క్కులు క‌ల్పించాలి - సుప్రీంకోర్టు

జ్యూడీషియల్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తించడంలో బైపోలార్ డిజార్డర్ ఆయనను ప్రభావితం చేయదని మెడికల్ బోర్డు స్పష్టం చేసింది. దీంతో సుప్రీంకోర్టు ఆయనను జ్యూడీషియల్ ఆఫీసర్‌గా ఎంపిక చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా, ఆయన ఎంపికను పలు వాదనలతో సవాలు చేశారు. తొలుత ఆయన జ్యూడీషియల్ పనులు ఆయన నిర్వర్తించే సామర్థ్యం లేదని, ఇంకొందరు ఆయన మెడిసిన్స్ తీసుకుంటున్నందున త్వరలోనే ఆయన వైకల్యం  నుంచి బయటపడవచ్చునని, కాబట్టి డిజేబిలిటీ కేటగిరీలో ఆయనకు పోస్టు ఇవ్వరాదని సవాల్ చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితులు మెరుగవుతున్నాయనీ ఇంకొందరు వాదించారు. కానీ, వాటిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

ఆయన ఆరోగ్య పరిస్థితులు మెరుగు అవుతాయని, ఈ కారణంగా ఆయన డిజేబిలిటీ కోటాలో సీటును రద్దు చేయలేమని సుప్రీంకోర్టు తెలిపింది. అలాగే, బైపోలార్ అఫెక్టివ్ డిజార్డర్ అనేది జీవితాంతం వేధించే వ్యాధి అన్న మెడికల్ బోర్డు వ్యాఖ్యలను నోట్ చేస్తూ సుప్రీంకోర్టు ఈ నిర్ణయం వెల్లడించింది. ఢిల్లీ హైకోర్టు నిర్ణయాన్ని తాజాగా సుప్రీంకోర్టు సమర్థించింది.

Also Read: చార్​ధామ్​ రహదారి ప్రాజెక్టుకు మార్గం సుగమం.. కేంద్రం వాదనతో ఏకీభవించిన త్రిసభ్య ధర్మాసనం

మూడ్ స్వింగ్స్‌తో బాధపడే వ్యక్తి న్యాయవ్యవస్థలో పని చేయడం చాలా కష్టతరమని కొందరు చెబుతుంటారు. బాలీవుడ్‌లో ఇదే అంశంతో ఓ సినిమా కూడా వచ్చింది. పింక్ సినిమాలో బైపోలార్ డిజార్డర్‌తో బాధపడే న్యాయవాదిగా అమితాబ్ బచ్చన్ నటించారు.

సుప్రీంకోర్టు ఇటీవలే సంచలన ఆదేశాలు వెలువరించిన సంగతి తెలిసిందే. సాధార‌ణ పౌరుల‌కు క‌ల్పించిన విధంగానే సెక్స్ వ‌ర్క‌ర్ల‌కు అన్ని హ‌క్కులు క‌ల్పించాల‌ని కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను ఆదేశించింది. క‌రోనా వైర‌స్, లాక్ డౌన్ ల వల్ల సెక్స్ వ‌ర్క‌ర్లు ఇబ్బంది ఎదుర్కొంటున్నార‌ని, వారికి ప్ర‌భుత్వం సాయం చేయాల‌ని కోరుతూ దాఖ‌లైన పిటిష‌న్ మంగ‌ళ‌వారం ధ‌ర్మాస‌నం ముందుకు వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో సుప్రీంకోర్టు ప‌లు వ్యాఖ్య‌లు చేసింది. దేశంలో ఉన్న ప్ర‌తీ ఒక్క‌రికీ రాజ్యాంగం క‌ల్పించిన హ‌క్కులు వ‌ర్తిస్తాయ‌ని తెలిపింది. వారికి కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు జారీ చేసే అన్ని ర‌కాల కార్డుల‌ను ఇవ్వాల‌ని చెప్పింది. భార‌తదేశంలో అంద‌రికీ స‌మాన హ‌క్కులు క‌ల్పించ‌బ‌డ్డాయ‌ని తెలిపింది.  సెక్స్ వర్కర్లకు సరుకులు అందజేయాలని ప్రభుత్వాలను ఆదేశించింది. వారికి అన్ని రకాల కార్డులు అందజేయాలని పదేళ్ల క్రితమే సుప్రీం కోర్టు చెప్పిందని గుర్తించేసింది. కానీ ఇప్ప‌టికీ ఆ తీర్పును అమ‌లు చేయ‌డం లేద‌ని పేర్కొంది. ఆయా ర‌కాల కార్డులు జారీ చేసే ప్ర‌క్రియ మొద‌లుపెట్టాల‌ని ఆదేశించింది. ఈ ప్ర‌క్రియ‌లో వారి గోప్య‌త‌కు భంగం క‌ల్గకుండా చూడాల‌ని చెప్పింది. 

click me!