బ్రేకింగ్ : త్రిపుర సీఎం బిప్లవ్ దేవ్ రాజీనామా

By Siva KodatiFirst Published May 14, 2022, 4:28 PM IST
Highlights

త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ దేవ్ రాజీనామా చేశారు. అయితే ఆయన ఎందుకు రాజీనామా  చేశారన్న విషయం తెలియాల్సి వుంది. 

త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ దేవ్ రాజీనామా చేశారు. అయితే ఆయన ఎందుకు రాజీనామా  చేశారన్న విషయం తెలియాల్సి వుంది. కాగా.. ఇటీవల త్రిపుర (tipura)లో బీజేపీ (bharathiya janatha party-bjp)కి చెందిన  ఇద్దరు ఎమ్మెలేలు రాజీనామా  చేసి కాంగ్రెస్ లో చేరారు. బీజేపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యేల‌లో సుదీప్ రాయ్ బర్మన్ (Sudeep ray barman), ఆశిష్ కుమార్ సాహా (ashish kumar saha)లు ఉన్నారు. దీంతో త్రిపుర‌లో ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 33కు చేరుకుంది. రాష్ట్ర అసెంబ్లీలో 60 స్థానాలు ఉన్నాయి. ప్ర‌స్తుతం బీజేపీ అధికార పార్టీగా ఉంది. అయితే ఇద్ద‌రు రాజీనామా చేయ‌డంతో ఇప్పుడు ఆ పార్టీకి మెజారిటీ కంటే రెండు స్థానాలు మాత్ర‌మే ఎక్కువ‌గా ఉన్నాయి. మ‌రికొన్ని రాజ‌కీయ వ‌ల‌స‌లు ఏర్ప‌డితే త్రిపుర‌లో బీజేపీ ప్ర‌భుత్వం కూలిపోయే ప్ర‌మాదం ఉంది. 

కాంగ్రెస్ లో చేరిన సంద‌ర్భంగా ఎమ్మెల్యే సుదీప్ రాయ్ బ‌ర్మ‌న్ మీడియాతో మాట్లాడారు. “ చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారు, అయితే టెక్నిక‌ల్ (technical) కార‌ణాల వ‌ల్ల వారు మరికొన్ని నెలలు అందులోనే వేచి ఉండాలనుకుంటున్నారు. అందరూ పార్టీపై విరక్తి చెందారు. గుజరాత్ (gujarath), హిమాచల్‌ (himachal pradhesh)తో పాటు త్రిపుర (tripura)కూడా ఎన్నికలకు వెళ్లవచ్చని నేను భావిస్తున్నాను ’’ అని ఆయ‌న చెప్పారు. 

ఇద్ద‌రు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేర‌డంతో కొన్ని నెలలుగా సాగుతున్న ఊహాగానాలకు ముగింపు ప‌లికిన‌ట్టు అయ్యింది. వీర‌ద్ద‌రూ ఐదు సార్లు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఇందులో బ‌ర్మ‌న్ 15 నెలల పాటు త్రిపుర ఆరోగ్య మంత్రిగా కూడా ప‌ని చేశారు. త‌ర్వాత మంత్రి మండ‌లి నుంచి బ‌హిష్క‌ర‌ణకు గుర‌య్యారు. అప్ప‌టి నుంచి బీజేపీలోని అసమ్మతి శిబిరానికి ఆయ‌న నాయకత్వం వహిస్తున్నారు. 2019 లోక్‌సభ (lokh sabha) ఎన్నికల సందర్భంగా ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డార‌ని ఆరోప‌ణ ఉంది. 

click me!