అప్పు చేసిన ట్రక్కుతో వ్యాపారం.. ఇప్పుడు వేలకోట్లకు అధిపతి.. విజయ్ సంకేశ్వర్ సక్సెస్ స్టోరీ

Published : Aug 12, 2023, 04:19 PM IST
అప్పు చేసిన ట్రక్కుతో వ్యాపారం.. ఇప్పుడు వేలకోట్లకు అధిపతి.. విజయ్ సంకేశ్వర్ సక్సెస్ స్టోరీ

సారాంశం

అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదన్న మాటను చాలా మంది నిజం చేసి చూపిస్తున్నారు. అప్పులు చేసి మరీ కోట్లకు అధిపతులైన వారూ ఉన్నారు. ఇలాంటి వారిలో వీఆర్ఎల్ గ్రూప్ ఫౌండర్ విజయ్ సంకేశ్వర్ ఒకరు. 

విజయ్ సంకేశ్వర్ ‘ట్రక్కింగ్ కింగ్ విజయ్ సంకేశ్వర్’ గా ఎదగడం వేలాది మందికి స్ఫూర్తినిచ్చింది. కాగా ఒక సాదాసీదా వ్యక్తి ఉన్నత ఆలోచనతో ఎందరికో ఆదర్శమయ్యాడు.  ఇతను 1970లో కేవలం ఒక్క ట్రక్కుతో సొంత లాజిస్టిక్స్ సంస్థను ప్రారంభించాలనుకున్నాడు. అదే ఇప్పుడు ఆయనను వేలకోట్లకు అధిపతిని చేసింది. 

అయితే సంకేశ్వర్ కుటుంబం ప్రింటింగ్ ప్రెస్ వ్యాపారం చేసేది. విజయ్ ను కూడా దీంట్లోనే పనిచేయమని చెప్పారు. కానీ విజయ్ సంకేశ్వర్ తల్లిదండ్రుల ఇష్టానికి విరుద్ధంగా వేరే వ్యాపారం ప్రారంభించాడు. అతను 1976 లో అప్పు చేసిన డబ్బుతో కొన్న ఒకే ట్రక్కుతో తన వ్యాపారాన్ని ప్రారంభించాడు. అయితే మొదట్లో ట్రక్ డ్రైవర్ల నుంచి క్లయింట్ల వరకు అన్ని అంశాలను ఏకతాటిపైకి తీసుకురావడానికి ఈయన ఎంతో కష్టపడ్డారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాడు. అయినా ఏ మాత్రం జంకకుండా తన వ్యాపారాన్ని విస్తరిస్తూ వెళ్లాడు. సాంకేతిక పరిజ్ఞానం లేని ఒక రంగంలో వ్యాపారాన్ని స్థాపించడానికి అతను ఎంతో కష్టపడ్డాడు.

ఈ వ్యాపారంలో విజయ్ సంకేశ్వర్ ఆర్థిక, లాజిస్టిక్ సమస్యలను ఎదుర్కొన్నాడు. కానీ విజయం సాధించాలనే తన సంకల్పం ముందు అతని కష్టాలన్నీ పటాపంచలైపోయాయి. 1994 లో ఇతను వీఆర్ఎల్ అనే పేరుతో కంపెనీని స్టార్ట్ చేశాడు. అప్పటికే అతను ఒక ట్రక్కు నుంచి 150కి పైగా ట్రక్కులకు చేరుకున్నాడు.

1996లో విజయానంద్ ట్రావెల్స్ బస్సులతో వాణిజ్య రవాణా నుంచి ప్రయాణీకుల సేవలకు విస్తరించారు. ప్రస్తుతం వీఆర్ఎల్ లాజిస్టిక్స్ లిమిటెడ్ గా పేరొందిన విజయ్ తన వ్యాపార ప్రయోజనాలను విస్తరించారు.

తన కొడుకు ఆనంద్ సంకేశ్వర్ తో కలిసి వింగ్ ఎనర్జీ ప్రాజెక్టులు, మీడియా, ఎయిర్ చార్టర్ సర్వీస్ ను కలిగి ఉన్న వ్యాపారాలకు నేతృత్వం వహిస్తున్నారు. వీఆర్ఎల్ లాజిస్టిక్స్ రూ.6,000 కోట్లకు పైగా మార్కెట్ క్యాప్ కలిగిన లిస్టెడ్ కంపెనీ. మీకు తెలుసా? 2022లో ఈయన విజయానికి స్ఫూర్తిగా విజయానంద్ అనే కన్నడ మూవీ కూడా వచ్చింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Arunachal Pradesh floods: భారీ వరదల తర్వాత మారిపోయిన అరుణాచల్ ప్రదేశ్ రూపురేఖలు| Asianet News Telugu
Monsoon Travel 2026: లైఫ్ లో ఒక్కసారైనా చూడాల్సిందే.. ఇండియాలోని టాప్ 6 మన్సూన్ వాటర్ ఫాల్స్ ఇవే !