Fastest Trial : ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం.. ఒక్కరోజులో తీర్పు ఇచ్చిన బీహార్ కోర్ట్..

By AN TeluguFirst Published Nov 29, 2021, 10:02 AM IST
Highlights

బీహార్ లోని అరారియా జిల్లాలో ప్రొటెక్షన్ ఆఫ్ చిల్ర్డన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ (పోక్సో) కోర్టు ఇచ్చిన తీర్పు దేశంలోనే అత్యంత వేగంగా ఇచ్చిన మొదటి తీర్పు గా రికార్డుల్లో కెక్కింది. పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి శశికాంత్ రాయ్ దోషికి యావజ్జీవ కారాగారశిక్ష, రూ. 50 వేల జరిమానా విధించారు.

బీహార్ : అత్యాచార బాధితులకు న్యాయం జరగాలంటే కోర్టుల్లో ఏళ్లకి ఏళ్లు ఎదురు చూసే రోజులు ఇక ముందు ఉండవని ఆశ కలిగేలా Bihar Court మెరుపువేగంతో తీర్పు చెప్పింది. ఎనిమిదేళ్ల బాలిక మీద దారుణంగా Rape చేసిన ఒక వ్యక్తికి పోక్సో కోర్టు కేవలం ఒక్క రోజులోనే విచారణ పూర్తి చేసి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 

బీహార్ లోని అరారియా జిల్లాలో ప్రొటెక్షన్ ఆఫ్ చిల్ర్డన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ (పోక్సో) కోర్టు ఇచ్చిన తీర్పు దేశంలోనే అత్యంత వేగంగా ఇచ్చినFastest trialగా, first judgmentగా రికార్డుల్లో కెక్కింది. పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి శశికాంత్ రాయ్ దోషికి యావజ్జీవ కారాగారశిక్ష, రూ. 50 వేల జరిమానా విధించారు.

బాధితురాలు భవిష్యత్తు కోసం పరిహారంగా రూ. 7 లక్షలు చెల్లించాలని ఆదేశించారు. అక్టోబర్ 4నే కోర్టు ఈ తీర్పు ఇచ్చినప్పటికీ, తీర్పు పూర్తి పాఠం ఈనెల 26న అందుబాటులోకి వచ్చంది. జూలై 22న ఈ అత్యాచార ఘటన జరగ్గా, ఆ మర్నాడు ఎఫ్ఐఆర్ దాఖలైంది. 

Araria మహిళా పోలీస్ స్టేషన్ ఇన్ ఛార్జ్ రీటా కుమారి ఈ కేసును ప్రత్యేకంగా పర్యవేక్షించారు. రేప్ కేసుల్లో అత్యంత వేగంగా విచారణ పూర్తి చేసిన కేసు ఇదేనని పోక్సో పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్యామల యాదవ్ తెలిపారు. 2018 ఆగస్ట్ లో Madhya Pradeshలోని దాటియా జిల్లా కోర్టు ఒక అత్యాచారం కేసులో మూడు రోజుల్లో తీర్పు ఇచ్చి రికార్డు కెక్కిందని ఇప్పుడు బీహార్ కోర్టు దానికి తిరగరాసిందన్నారు. 

అత్యాచారం కేసులో 16యేళ్ల జైలుశిక్ష అనుభవించిన తరువాత.. నిర్దోషిగా.. అసలేం జరిగిందంటే...

ఇదిలా ఉండగా, దీనికి విరుద్ధంగా అమెరికాలో జరిగిన ఓ హత్యాచారం కేసులో ఏకంగా 62 ఏళ్ల తరువాత తీర్పు వచ్చింది. వివరాల్లోకి వెడితే.. 62 ఏళ్ల క్రితం 1959లో ఈ దారుణం చోటుచేసుకుంది. స్పోకనే వెస్ట్ సెంట్రల్ పరిసర ప్రాంతానికి చెందిన 9 ఏళ్ల బాలిక క్యాంప్ ఫైర్ మింట్స్ అమ్మడానికి బయటకు వెళ్లింది. ఆ తర్వాత ఇంటికి తిరిగి రాలేదు. minor girl గురించి  గాలించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది.  రెండు వారాల తర్వాత చిన్నారి dead body లభ్యమైంది.  బాలికపై దారుణానికి ఒడిగట్టిన వ్యక్తి పేరు John Reig Hoff.. అతడి పై పోలీసులకు ఎలాంటి అనుమానం కలగలేదు. కారణం ఏంటంటే జాన్ రీగ్ హాఫ్ American Army లో సైనికుడా పనిచేస్తుండేవాడు. 

ఇక దారుణానికి ఒడిగట్టిన సమయంలో దారుణం జరిగిన స్పోకేన్ కౌంటీలోని ఫెయిర్‌చైల్డ్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. బాలిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు బాలికపై అత్యాచారం చేసి ఆ తర్వాత murder చేశారని తెలిపారు. నిందితుల కోసం పోలీసులు వెతక సాగారు. ఈ క్రమంలోనే అప్పటికే 9 ఏళ్ల చిన్నారి ఉసురు తీసిన జాన్‌ రీగ్‌.. మరో దారుణానికి ఒడిగట్టాడు. ఓ మహిళ కాళ్లు, చేతులు కట్టేసి కత్తితో పొడిచి హత్య చేశాడు.  ఈ కేసులో పోలీసులు జాన్‌ రీగ్‌ను అదుపులోకి తీసుకున్నారు.  

ఆ సమయంలో అతడి వయసు 20 సంవత్సరాలు. మహిళను హత్య చేసిన కేసులో అమెరికా కోర్టు  జాన్‌ రీగ్‌కి శిక్ష విధించింది. మహిళ హత్య కేసు విచారణ సమయంలో జాన్‌ రీగ్‌ కు సంబంధించి పోలీసులు కొన్ని ఆసక్తికరమైన విషయాలు గుర్తించారు. బాలిక అత్యాచారానికి గురైన సమయంలో జాన్‌ రీగ్‌ ఆ ప్రాంతంలోనే విధులు నిర్వహిస్తున్నట్లు గమనించారు. అయితే ఇప్పుడున్నత సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేకపోవడంతో బాలిక హత్యాచారం కేసులో జాన్‌ రీగే నేరస్తుడని పోలీసులు నిరూపించలేక పోయారు.  అప్పట్లో ఈ కేసు ‘Mount Everest’ పేరుతో ప్రసిద్ధి చెందింది.

ఈ సంవత్సరం ప్రారంభంలో,  టెక్సాస్లోని  DNA Lab కు బాధితురాలి శరీరం నుంచి తాను తీసుకెళ్లడానికి పోలీస్ డిపార్ట్మెంట్ కు అనుమతి లభించింది. శరీరంపై ఉన్న వీర్య నమూనాలు ముగ్గురు అనుమానితుల్లో ఒకరితో సరిపోయింది. ఆ ముగ్గురు ఎవరంటే.. జాన్‌ రీగ్‌, అతడి ఇద్దరు సోదరులు. ఇక బాలిక శరీరం మీద లభ్యమైన వీర్య నమూనాలు జాన్‌ రీగ్‌తో సరిపోలాయి. దాంతో బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన వ్యక్తి జాన్‌ రీగ్‌  అని తెలిపారు పోలీసులు. ఆ తర్వాత కేసు మూసివేశారు. అయితే ఇక్కడ ట్విస్టు ఏంటంటే ఈ విషయం వెలుగులోకి రావడానికి ముందే అంటే దాదాపు 30 ఏళ్ల క్రితమే అనగా 1971లో జాన్‌ రీగ్‌ మృతిచెందాడు.  

click me!