Tamil Nadu rains: కొనసాగుతున్న వర్ష బీభత్సం.. 9 జిల్లాలో విద్యా సంస్థలకు సెలవు..

Published : Nov 29, 2021, 09:26 AM ISTUpdated : Nov 29, 2021, 09:28 AM IST
Tamil Nadu rains: కొనసాగుతున్న వర్ష బీభత్సం.. 9 జిల్లాలో విద్యా సంస్థలకు సెలవు..

సారాంశం

తమిళనాడులో (Tamil Nadu) వర్ష బీభత్సం కొనసాగుతుంది. భారీ వర్షాల (Heavy Rains)  కారణంగా చైన్నైతో పాటు పలు జిల్లాలు అతలాకుతం అవుతున్నాయి. నేడు తమిళనాడులోని 9 జిల్లాలోని స్కూల్స్, కాలేజ్‌లకు సెలవు (Schools and colleges closed) ప్రకటించారు.

తమిళనాడులో (Tamil Nadu) వర్ష బీభత్సం కొనసాగుతుంది. ఇటీవల కురిసిన వర్షాల నుంచి తేరుకోక ముందే.. మరోసారి భారీ వర్షాలు (Heavy Rains) వణికిస్తున్నాయి. వరుసగా మూడో రోజు కురుస్తున్న వర్షాల కారణంగా చైన్నైతో పాటు పలు జిల్లాలు అతలాకుతం అవుతున్నాయి. తమిళనాడు, పుదుచ్చేరిలో రోడ్లు, సబ్‌వేలు ఎక్కడ చూసిన వరద నీరే కనిపిస్తుంది. వరదల కారణాంగా ఇప్పటికే పలువురు మృతిచెందగా, భారీగా ఆస్తి నష్టం జరిగింది.

ఇక, చెన్నైలో పలు సబ్‌వేలను (subway) అధికారులు మూసివేశారు. చాలా చోట్ల ట్రాఫిక్‌ను డైవర్ట్‌ చేస్తున్నారు. వాహనదారులు ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో నేడు తమిళనాడులోని 9 జిల్లాలోని స్కూల్స్, కాలేజ్‌లకు సెలవు (Schools and colleges closed) ప్రకటించారు. అందులో చెన్నై (Chennai), చెంగల్‌పేట్, కాంచీపురం, తిరువల్లూరు, విల్లుపురం, కన్యాకుమారి జిల్లాలు కూడా ఉన్నాయి.

Also read: తమిళనాడుకు మరో రెండు రోజులు భారీ వర్షాలు: ఐఎండీ వార్నింగ్

తమిళనాడులో చాలా ప్రాంతాలు జలదిగ్భందంలోనే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వరద ప్రభావిత ప్రాంతాల్లోని 15,000 మందిని.. సహాయక శిబిరాలకు తరలించారు. ఆదివారం కడలూరు, ట్యూటికోరన్ జిల్లాల్లో ఒక్కరి చొప్పున మరణించారు. ఇదిలా ఉంటే.. చెన్నై నగరంలోని కేకే నగర్, అశోక్ నగర్, వెస్ట్ మంబలం ప్రాంతాలు వర్షాలు, వరదల కారణంగా బాగా  దెబ్బతిన్నాయి. లోతట్టు ప్రాంతాలు, జలదిగ్బందలో ఉన్న ప్రాంతాల్లోని ప్రజలను సహాయక శిబిరాలకు తరలించడానికి బోట్స్‌ను వినియోగిస్తున్నారు. పలుచోట్ల వరదల్లో చిక్కుకున్నవారిని విపత్తు నిర్వహణ బృందాలు రక్షించాయి.

తీర ప్రాంతాల్లో రెడ్ అలర్ట్.. 
రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు జనాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరడంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక, తమిళనాడులో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు తీర ప్రాంత జిల్లాలకు Imd రెడ్ అలెర్ట్ జారీ చేసింది. లోతట్టు ప్రాంతాల  ప్రజలను సురక్షితన ప్రాంతాలకు తరలించారు. తాజా హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 

కన్యాకుమారి, తిరునల్వేలి జిల్లాల్లో అతి భారీ వర్షం
కన్యాకుమారి జిల్లాలోని ఏడు ప్రాంతాల్లో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం మధ్యలో 100 మి.మీల వర్షపాతం నమోదైంది. అయితే సోమవారం కూడా కన్యాకుమారి, తిరునల్వేలి జిల్లాలోని పలు చోట్ల ఉరుములతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు తీర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అంతేకాకుండా తమిళనాడులోని చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. 

ఇక, దక్షిణ అండమాన్ సముద్రంలో నవంబర్ 30న అల్పపీడనం ఏర్పడనున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది మరింత బలపడి తదుపరి 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో ప్రయాణించే అవకాశం ఉందని వివరించింది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌తో పాటు, ఒడిశాలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలిపింది. 

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్