అనుమతి లేకుండా.. బోరు నీళ్లు తాగాడని వృద్ధుడిని చితకబాది, ప్రాణాలు తీశారు..

By AN TeluguFirst Published Nov 9, 2021, 12:43 PM IST
Highlights

పశువుల గడ్డికోసం వెళ్లిన వృద్ధుడు దాహం వేసి తట్టుకోలేక... సమీపంలో ఉన్న బోరు పంపు నీళ్లు తాగాడు. అది అతని ప్రాణాల మీదికి వచ్చింది. 
 

బీహార్లో అమానవీయ ఘటన వెలుగు చూసింది. వైశాలి జిల్లా  సేలం పూర్ ప్రాంతంలో తమ అనుమతి లేకుండా బోరు నీళ్లు తాగడని  70 ఏళ్ల వృద్ధుడిని ఓ వ్యక్తి  చితకబాదాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ వృద్ధుడు శనివారం తెల్లవారుజామున మృతిచెందాడు.

అనాగరిక కాలంలో ఉన్న కట్టుబాట్లు, పట్టింపులు నేటికీ కొనసాగుతున్నాయని ఈ ఘటన ద్వారా తెలుస్తోంది. తమ అనుమతి లేకుండా water తాగడం ఏంటని.. ఎదురు ప్రశ్నించడం అమానుషం అయితే.. ఏం చేస్తాం మా ఖర్మ అన్నట్టుగా మృతుడి కుటుంబీకులు వ్యవహరించడం మరీ దారుణం.. ఈ ఘటన మీద మృతుడి కుటుంబీకులు మాట్లాడుతూ..

‘మా నాన్న పశువులకు గడ్డి తెచ్చేందుకు వెళ్ళాడు. దాహం వేసి నీటి కోసం Bore pump వద్దకు వెళ్ళాడు.  తమ Permission లేకుండా నీళ్లు  తాగాడన్న కోపంతో దాని యజమానులు మా నాన్నను కొట్టారు. ఆ ఘటనలో మా నాన్న తీవ్రంగా గాయడపడ్డాడు. వెంటనే విషయం తెలిసి మేము ఆస్పత్రిలో చేర్చించాం. అక్కడ చికిత్స తీసుకుంటూ తర్వాత అతను మరణించాడు. 

ప్రియురాలి స్నేహితురాలికి బీరు తాగించి.. గ్యాంగ్ రేప్ చేసిన బాయ్ ఫ్రెండ్.. అర్థరాత్రి రోడ్డు మీద వదిలేసి...

అయితే, మా నాన్న మీద దాడి చేసిన వారితో మాకు ఎలాంటి శత్రుత్వం లేదు’ అని మృతుడి కుమారుడు రమేష్ సైని పేర్కొన్నారు. ఈ అమానవీయ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


బావమరిది మరణం తట్టుకోలేక.. బావ చేసిన పని.. 

తుప్రాన్ : బావమరిది బలవన్మరణం తట్టుకోలేక మనస్తాపానికి గురైన బావ ఆత్మహత్య చేసుకున్న ఘటన తూప్రాన్ మండలం నాగులపల్లి పంచాయతీ పరిధి జెండా పల్లిలో చోటుచేసుకుంది. తూప్రాన్ ఎస్ఐ సురేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... జెండా పల్లి గ్రామానికి చెందిన నాగలూరిశంకర్, నరసింహ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు.  

కర్ణాటకలో విషాదం: ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి

వీరిలో  చిన్న కొడుకు ప్రశాంత్ 22 తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నాడు. నెల రోజుల క్రితం  శివ్వంపేటమండలం  చండి గ్రామానికి చెందిన  తన బావమరిది శ్రీశైలం ఆత్మహత్య చేసుకున్నాడు. అతడితో ఎంతో సన్నిహితంగా ఉండే ప్రశాంత్ ఈ ఘటనతో మనోవేదనకు గురయ్యాడు.  తన మిత్రుల వద్ద ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ వచ్చాడు.  

ఈ క్రమంలో శుక్రవారం ప్రశాంత్ పురుగుల మందు తాగి suicideకు యత్నించాడు. దీన్ని గమనించిన గాంధీ ఆస్పత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు.  ఈ మేరకు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని  ఎస్ఐ వివరించారు.

ఈ ఆత్మహత్య స్థానికంగా కలకలం రేపింది. అంతగా అనుబంధం పెంచుకోవడం అందకి కంటా కన్నీరు పెట్టించింది. నెల రోజుల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరూ ఇలా అర్థాంతరంగా బలవన్మరణం పాలవ్వడం ఆ కుటుంబాన్ని విషాదంలో ముంచేసింది. ఈ మరణాలకు కారణాలు వెతుకుతున్నామని పోలీసులు తెలిపారు.

click me!