మందు బాబులకు షాకింగ్ న్యూస్.. తాగి పట్టుబడితే రూ.50వేలు ఫైన్

First Published Jul 12, 2018, 12:13 PM IST
Highlights

ఎంత మద్య పాన నిషేధం విధించినప్పటికీ.. దొంగచాటుగా వ్యాపారాలు కొనసాగుతున్నాయనే అనుమానం కలగడంతో ఈ మేర నిర్ణయం తీసుకున్నారు. మొదటి సారి దొరికితే రూ.50వేలు జరిమానా కాగా..రెండోసారి మాత్రం అదే తప్పుచేసి దొరికితే రెండు నుంచి ఐదేళ్ల శిక్ష తప్పదన్నారు.
 
మందుబాబులకు బిహార్ ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. ఇప్పటికే రాష్ట్రంలో మద్యపానాన్ని నిషేధించిన ఆ రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. మందుకొట్టి తొలిసారి పట్టుబడిన వారికి రూ.50 వేల జరిమానా విధిస్తారు. జరిమానా కట్టకపోతే మూడు నెలల శిక్ష పడుతుందని హెచ్చరిచింది.

ఎంత మద్య పాన నిషేధం విధించినప్పటికీ.. దొంగచాటుగా వ్యాపారాలు కొనసాగుతున్నాయనే అనుమానం కలగడంతో ఈ మేర నిర్ణయం తీసుకున్నారు. మొదటి సారి దొరికితే రూ.50వేలు జరిమానా కాగా..రెండోసారి మాత్రం అదే తప్పుచేసి దొరికితే రెండు నుంచి ఐదేళ్ల శిక్ష తప్పదన్నారు.

 మద్యం తయారు చేస్తూ, అమ్ముతూ దొరికితే తొలిసారి రెండేళ్లు, రెండోసారి పదేళ్ల జైలు శిక్ష విధిస్తారు.అలాగే ప్రస్తుతం నాన్ బెయిలబుల్ కేసులుగా నమోదు చేస్తున్న పోలీసులు ఇకపై బెయిలబుల్‌గా పరిగణిస్తారు. మద్యం తాగి ఇప్పటికే జైల్లో పడినవారికీ ఈ సవరణలు వర్తిస్తాయి. 

ఈ నిర్ణయాలసంబంధిత బిల్లుకు కేబినెట్  బుధవారం ఆమోదం తెలిపింది. మద్యనిషేధం వల్ల బిహార్లో కోట్లాది కుటుంబాలు బాగుపడ్డాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మద్యం దొరక్కపోవడంతో.. జనం దానికి చేసే ఖర్చులను పిల్లల తిండికి, స్కూలు ఫీజులుకు, ఇతర కనీసావసరాలకు ఖర్చుచేస్తున్నారు

click me!