Hyderabad: జార్ఖండ్ ఎమ్మెల్యేలు వెళ్లారు.. బిహార్ ఎమ్మెల్యేలు వచ్చారు!

By Mahesh K  |  First Published Feb 5, 2024, 4:24 AM IST

హైదరాబాద్ నుంచి జార్ఖండ్ ఎమ్మెల్యేలు వెళ్లిపోయారు. అయితే, బిహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యారు.
 


Hyderabad: జార్ఖండ్ ఎమ్మెల్యేలు ఇలా వెళ్లిపోయారో లేదో.. బిహార్ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లో మకాం వేశారు. జార్ఖండ్ సీఎంగా చంపయి సోరెన్ బాధ్యతలు తీసుకున్నాక అసెంబ్లీలో బల ప్రదర్శన చేపట్టాల్సి ఉన్నది. ఇంతలో బీజేపీ తమ ఎమ్మెల్యేలను ఎక్కడ ప్రలోభపెడుతుందోనని అధికార కూటమి జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తరలించారు. ఈ రోజు జార్ఖండ్ అసెంబ్లీలో బలప్రదర్శన జరగనుంది. అందుకోసమే వారిని తిరిగి రాంచీకి తీసుకెళ్లారు. ఇంతలో బిహార్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌కు వచ్చారు.

బిహార్ కాంగ్రెస్ పార్టీ కనీసం 18 మంది తమ ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తీసుకువచ్చింది. ఇబ్రహీంపట్నంలోని ఓ రిసార్ట్‌లో వారిని ఉంచింది. బిహార్‌లో కూడా బలప్రదర్శన ఉన్నది. ఫిబ్రవరి 12వ తేదీన ఫ్లోర్ టెస్టు చేపట్టాల్సి ఉన్నది. నితీశ్ కుమార్ కూటమి మార్చిన తర్వాత బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం తరఫున ఆయన సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు. అయితే, బలప్రదర్శన జరగాల్సి ఉన్నది. 

Latest Videos

undefined

Also Read: Jharkhand: హైదరాబాద్ నుంచి రాంచీకి జార్ఖండ్ ఎమ్మెల్యేలు.. బలప్రదర్శనలో మాజీ సీఎం హేమంత్!

ఇది వరకే కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జేడీయూ నేతలతో టచ్‌లోకి వెళ్లినట్టు అనుమానాలు రావడంతో కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయింది. వారిని హైదరాబాద్‌కు తరలించింది. బీజేపీ నుంచి కూడా తమ ఎమ్మెల్యేలకు ప్రలోభాల ముప్పు ఉండే అవకాశం ఉన్నదని కాంగ్రెస్ భావిస్తున్నది. అందుకే వారిని ముందు జాగ్రత్తగా హైదరాబాద్‌కు తీసుకువచ్చింది. 

బిహార్ కాంగ్రెస్ ముఖ్యనేతలు అఖిలేశ్ సింగ్, మదన్ మోహన్ ఝా సారథ్యంలో వారు ఇక్కడికి వచ్చేశారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి వారు నేరుగా హైదరాబాద్ చేరుకున్నారు. బిహార్ ఎమ్మెల్యేల వ్యవహారాన్ని కాంగ్రెస్ నేతలు సంపత్ కుమా్ర, హర్కార వేణుగోపాల్, మల్ రెడ్డి రాం రెడ్డి కొఆర్డినేట్ చేస్తున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

click me!