ఐటీ సిటీలో భార్యా బాధితుల నిరాహారదీక్ష... ఎందుకో తెలుసా?

Published : Feb 26, 2023, 07:44 AM ISTUpdated : Feb 26, 2023, 07:46 AM IST
ఐటీ సిటీలో భార్యా బాధితుల నిరాహారదీక్ష... ఎందుకో తెలుసా?

సారాంశం

భార్యల వేధింపుల నుండి పురుషులను కాపాడాలంటూ భార్యా బాధితుల సంఘం బెంగళూరులో నిరాహార దీక్షకు దిగింది. 

బెంగళూరు : మహిళలను అత్తింటివారి వేధింపుల నుండి రక్షించేందుకు తీసుకువచ్చిన గృహ హింస చట్టం దుర్వినియోగం అవుతోందని ఆరోపిస్తూ భార్యా బాధితుల సంఘం ఆందోళనకు దిగింది. ఈ చట్టాన్ని అడ్డుపెట్టుకుని కొందరు మహిళలు భర్తతో పాటు అత్తింటివారిని వేధిస్తున్నారని... వెంటనే దీన్ని సవరించాలని భార్యా బాధితులు కర్ణాటక రాజధాని బెంగళూరులో నిరాహార దీక్ష చేపట్టారు. 

'సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫౌండేషన్' స్వచ్చంద సంస్థతో కలిసి భార్యా బాధితుల సంఘం సభ్యులు నిన్న(శనివారం) నిరాహార దీక్షకు కూర్చుకున్నారు. ఇవాళ(ఆదివారం) సాయంత్రం వరకు దీక్ష కొనసాగనుందని భార్యా బాధితులు వెల్లడించారు. వెంటనే ప్రభుత్వం స్పందించి గృహహింస చట్టంలో మార్పులు చేసి దుర్వినియోగం కాకుండా చూడాలని డిమాండ్ చేసారు. లేదంటే ఆందోళనకు కొనసాగిస్తామని భార్యా బాధితుల సంఘం తెలిపింది.  

Read More ఆగస్ట్ 1న భార్యా బాధితుల సంఘం సమావేశం.. ప్రభుత్వానికి తెలిపేలా...

గృహహింస చట్టాన్ని ఉపయోగించిన కొందరు మహిళలు ఎన్నారై భర్తలను, వారి కుటుంబసభ్యులను వేధిస్తున్నారని భార్యా బాధితులు ఆందోళన వ్యక్తం చేసారు. గృహ హింస కేసులను ఎదుర్కొంటున్న ఎన్నారైల కోసం ప్రత్యేక ప్యాయస్థానాలు ఏర్పాటుచేసి వారిని న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు భార్యా బాధితుల సంఘం సభ్యులు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Gig Workers: డిసెంబ‌ర్ 31న జొమాటో, స్విగ్గీ సేవ‌ల్ బంద్‌.. కార‌ణం ఏంటంటే.?
Womens Welfare Schemes : ఇక్కడి మహిళలకు సూపర్ స్కీమ్స్.. దేశంలోనే నెంబర్ 1