"ఆయనకు బీజేపీ తలుపులు శాశ్వతంగా మూసుకుపోయాయి": నితీష్ పై అమిత్ షా ఫైర్

Published : Feb 26, 2023, 06:46 AM IST
"ఆయనకు బీజేపీ తలుపులు శాశ్వతంగా మూసుకుపోయాయి": నితీష్ పై అమిత్ షా ఫైర్

సారాంశం

ప్రధాన మంత్రి కావాలనే కోరికతో బీజేపీని విడిచి..  కాంగ్రెస్,రాష్ట్రీయ జనతాదళ్ తో బీహార్ సీఎం నితీష్ చేతులు కలిపారని హోం మంత్రి అమిత్‌షా ఆరోపించారు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ను తదుపరి ముఖ్యమంత్రిగా చేసేందుకు జేడీ(యూ) అధిష్టానం అంగీకరించిందని అమిత్ షా ప్రకటించారు.

బీహార్ సీఎం నితీష్ కుమార్ పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన తన ప్రధానమంత్రి కలను సాకారం చేయడం కోసం బిజెపిని వదిలిపెట్టి కాంగ్రెస్, ఆర్జెడితో చేతులు కలిపారని ఆరోపించారు. పశ్చిమ చంపారన్ జిల్లాలోని లారియా వద్ద జరిగిన ర్యాలీలో బిజెపి సీనియర్ నేత, కేంద్ర మంత్రి అమిత్ షా ప్రసంగిస్తూ.. ఆర్‌జెడి నాయకుడు తేజస్వి యాదవ్‌ను తదుపరి ముఖ్యమంత్రిగా చేయడానికి జెడి(యు) అధిష్టానం అంగీకరించిందని అన్నారు. 

బాల్మీకి నగర్ లోక్‌సభ నియోజకవర్గంలో అమిత్ షా మాట్లాడుతూ..  బీహార్‌ను 'జంగల్ రాజ్' గా మార్చారనీ, ఎప్పటికప్పుడు మనసు మార్చుకునే సీఎం నితీష్‌ భాగస్వామ్యంతో బీజేపీ కూడా విసుగెత్తిపోయిందనీ, ఇక ఎప్పటికీ నితీష్‌కు  బీజేపీలో చోటు లేదని స్పష్టం చేశారు.జేడీయూ,ఆర్జేడీలది అపవిత్ర కూటమని , నితీష్ కుమార్‌కు శాశ్వతంగా బీజేపీ తలుపులు మూసేసిందని అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. 

"జయ్ ప్రకాష్ నారాయణ్ కాలం నుండి ఆయన (నితీష్) కాంగ్రెస్ , 'జంగల్ రాజ్'కు వ్యతిరేకంగా పోరాడారు. తాజాగా నితీష్ కుమార్ .. లాలూ  RJD,  సోనియా గాంధీ యొక్క కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారు. తన ప్రధానమంత్రి కల కోసం నితీష్ 'వికాస్వాది' నుండి 'అవసర్వాది' (అవకాశవాది) అయ్యాడు." అని అమిత్‌షా గుప్పించారు.  

‘ఆయా రామ్‌, గాయరామ్‌’ చాలు, నితీశ్‌కు బీజేపీ తలుపులు శాశ్వతంగా మూసుకుపోయాయని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జెడి(యు) కంటే బిజెపి చాలా ఎక్కువ సీట్లను గెలుచుకున్నదని, అయినా.. మరో దఫా అధికారంలో ఉంచుతానని ఇచ్చిన హామీని ప్రధాని నరేంద్ర మోడీ కుమార్‌ నిలబెట్టుకున్నారని కేంద్ర హోంమంత్రి గుర్తు చేశారు. 

బీహార్ సరిహద్దు ప్రాంతాల్లో జనాభా మార్పును నితీష్ కుమార్ ఆపలేరని, 2024లో నరేంద్ర మోదీని మూడింట రెండొంతుల మెజారిటీతో మళ్లీ గెలిపించాలని, అలాంటి ప్రయత్నాలకు బ్రేకులు వేస్తామని ఆయన అన్నారు. దాదాపు అరగంట పాటు సాగిన తన ప్రసంగంలో.. సర్జికల్ స్ట్రైక్, బాలాకోట్ వైమానిక దాడులు, ఆర్టికల్ 370 రద్దు , ఇస్లామిస్ట్ సంస్థ PFI పై నిషేధం వంటి సాహసోపేతమైన చర్యలను అమిత్ షా స్పృశించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !