Bharat Ratna: కర్పూరి ఠాకూర్‌కు భారత్ రత్న.. ఎవరీ ఠాకూర్?.. టాప్ 5 పాయింట్స్

By Mahesh KFirst Published Jan 23, 2024, 10:29 PM IST
Highlights

బిహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్‌కు రాష్ట్రపతి భవన్ భారత రత్న అవార్డును ప్రకటించింది. ఆయన వర్ధంతి సందర్భంగా ఈ ప్రకటన విడుదల చేసింది. ఇంతకీ కర్పూరి ఠాకూర్ ఎవరు?
 

Karpoori Thakur: బిహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్‌కు భారత్ రత్న అవార్డును రాష్ట్రపతి భవన్ ప్రకటించింది. ఈ రోజు ఆయన వర్ధంతి. మరణానంతరం ఆయనకు భారత్ రత్న అవార్డును ప్రకటించారు. కర్పూరి ఠాకూర్ సామాజిక న్యాయానికి ద్వీపం వంటివాడని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఇంతకీ కర్పూరి ఠాకూర్ ఎవరు? ఐదు పాయింట్లలో ఆయన గురించి తెలుసుకుందాం.

1. కర్పూరి ఠాకూర్ 1970 దశకంలో రెండు సార్లు బిహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేశారు. 1970 డిసెంబర్ నుంచి 1971 జూన్ వరకు, 1977 డిసెంబర్ నుంచి 1979 ఏప్రిల్ వరకు ఆయన సీఎంగా వ్యవహరించారు.

Latest Videos

2. బిహార్ రాష్ట్రంలోని నేడు నాయకులుగా ఉన్న అనేకులకు ఆయనే గురువు. సీఎం నితీశ్ కుమార్, ఆర్జేడీ ప్రెసిడెంట్ లాలు యాదవ్ వరకు చాలా మంది ఆయన సారథ్యంలోనే రాజకీయంలో ఓనమాలు నేర్చుకున్నారు.

3. ఆయన సీఎంగా ఉన్న స్వల్ప సమయంలోనే బిహార్ రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం విధించారు.

Also Read : బెంగాల్‌లో కాంగ్రెస్‌కు కొత్త సమస్య.. దీదీపై సొంత పార్టీ నేతల విమర్శలు.. నష్ట నివారణకు రాహుల్ గాంధీ ప్రయత్నం

4. ఆయనను జననాయుకుడు అని పిలుపుచుకునేవారు. బిహార్‌లోని సామాజికంగా వెనుకబడిన వర్గాల జీవితాల కోసం తన జీవితాన్ని గడిపారు.

5. బిహార్‌లో ముంగేరి లాల్ కమిషన్ సిఫారసుల మేరకు బీసీ వర్గాలకు కోటాను ప్రవేశపెట్టారు. నిజానికి 1990లలో మండల్ కమిషన్ దేశ రాజకీయాలను మార్చేయడానికి ముందే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

click me!