Bharat Ratna PV Narasimha Rao: రచయితగా, వ్యవసాయవేత్తగా, న్యాయవాదిగా తనదైన ముద్రవేసిన భారతరత్న పీవీ నరసింహారావు.. ఆ తర్వాత కార్యకర్తగా రాజకీయాల్లోకి వచ్చి ప్రధాని వరకు ఎదిగి తీరు.. ఆయన కాలంలో తీసుకువచ్చిన సంస్కరణలు భారత్ ను నేడు తిరుగులేని శక్తిగా నిలబడటానికి తోడ్పడ్డాయి.
Bharat Ratna PV Narasimha Rao: తెలంగాణ ముద్దు బిడ్డ.. దేశం గర్వించదగ్గ నాయకుడు పీవీ నరసింహా రావు. భారత దేశం కోసం ఆయన అందించిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహా రావుకు భారత రత్న అవార్డును ప్రకటించింది. విశిష్ట పండితుడు, రాజనీతిజ్ఞుడిగా పేరుగాంచిన పీవీ నరసింహరావు భారత దేశానికి చేసిన సేవలకు భారతరత్నతో సత్కరించడం సంతోషంగా ఉందని ప్రధాని మోడీ తెలిపారు. పీవీ నరసింహారావు భారత రత్నఅందుకోవడం తెలుగువారితో పాటు దేశప్రజలందరూ గర్వించదగ్గ క్షణాలు.. !
Delighted to share that our former Prime Minister, Shri PV Narasimha Rao Garu, will be honoured with the Bharat Ratna.
As a distinguished scholar and statesman, Narasimha Rao Garu served India extensively in various capacities. He is equally remembered for the work he did as… pic.twitter.com/lihdk2BzDU
undefined
ఎవరీ పీవీ నరసింహారావు..?
కార్యకర్త నుంచి ప్రధాని వరకు.. సామాన్యుడి నుంచి విశిష్ట పండితుడిగా పీవీ నరసింహా రావు ఎదిగిన తీరు అందరికీ ఆదర్శనీయం.. స్ఫూర్తిదాయకం. పీవీ నరసింహా రావు రావు పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు. తెలంగాణలోని లక్నేపల్లి, వరంగల్ అప్పటి హైదరాబాద్ సంస్థానంలో 1921 జూన్ 28 జన్మించారు. రుక్నాబాయి, సీతారామరావు దంపతులకు జన్మించిన పీవీ ప్రాథమిక విద్యను వరంగల్లులో ప్రారంభించారు. అయితే, కరీంనగర్ జిల్లాలోని వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మలు దత్తత తీసుకోవడంతో అప్పటినుండి పాములపర్తి వేంకట నరసింహారావు (పీవీ నర్సింహరావు) గా మారారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ, మహారాష్ట్రలోని బొంబాయి యూనివర్సిటీ, నాగ్‌పూర్ యూనివర్శిటీల్లో విద్యను అభ్యసించారు. పీవీ నరసింహారావు సత్యమ్మరావును వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు.
న్యాయవాదిగా, రాజనీతిజ్ఞుడిగా పీవీ.. భారత ప్రధాని వరకు సాగిన ప్రయాణం
రచయితగా, వ్యవసాయవేత్తగా, న్యాయవాదిగా తనదైన ముద్రవేసిన తర్వాత పీవీ రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. భారత ప్రధాని వరకు ఎదిగి తీరు.. ఆయన కాలంలో తీసుకువచ్చిన సంస్కరణలు భారత్ ను నేడు తిరుగులేని శక్తిగా నిలబడటానికి తోడ్పడ్డాయి. 1957 లో మంథని నియోజక వర్గం నుండి శాసనసభకు ఎన్నికవడం ద్వారా పీవీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. ఇదే నియోజకవర్గం నుండి వరుసగా నాలుగు సార్లు శాసన సభ్యునిగా ఎన్నికయ్యాడు. 1962 లో మొదటిసారి మంత్రి అయ్యాడు. 1962 నుండి 1964 వరకు న్యాయ, సమాచార శాఖ మంత్రి గాను, 1964 నుండి 67 వరకు న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి, 1967 లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, 1968-71 కాలంలో న్యాయ, సమాచార శాఖ మంత్రి పదవులు నిర్వహించాడు.
పీవీ నరసింహారావు 1971-73లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. 1975-76 లో జనరల్ సెక్రటరీ, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సేవలు అందించారు. 1968-74 లో ఏపీ తెలుగు అకాడమీ ఛైర్మన్ కొనసాగారు. 1957-77 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడుగా ఉన్నారు. 1977-84 వరకు లోక్ సభ సభ్యుడిగా ఉన్నారు. మొదటిసారి, రెండోసారి లోక్‌సభకు హనుమకొండ స్థానం నుండి ఎన్నికయ్యారు. మూడోసారి ఎనిమిదో లోక్‌సభకు మహారాష్ట్ర లోని రాంటెక్ నుండి ఎన్నికయ్యాడు. ఆ తర్వాత కూడా అక్కడి నుంచి ఎన్నికయ్యారు. నంద్యాల లోక్‌సభ నియోజకవర్గానికి 1991లో జరిగిన ఉప ఎన్నికలో ఎన్నికై పదో లోక్‌సభలో అడుగుపెట్టారు పీవీ. 1980- 1989 మద్య కేంద్ర మంత్రిగా సేవలు అందించారు.
రాజకీయాలకు గుడ్ బై చెప్పిన తర్వాత ప్రధాని పదవి..
పీవీ నరసింహారావుకు ఊహించని విధంగా పీవీ నరసింహారావును ప్రధాని పదవి వరించింది. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన తర్వాత ఆయన ప్రధాని కావడం విశేషం. 1991 సార్వత్రిక ఎన్నికలలో పోటీ చెయ్యకుండా, పార్లమెంట్ లో సభ్యుడు కాకుండానే ప్రధాని అయ్యారు. రాజీవ్ గాంధీ హత్య కారణంగా కాంగ్రెసు పార్టీని నడిపించే నాయకుడుగా అందరికీ ఆమోదయోగ్యుడిగా కనిపించడంతో ప్రధానిగా ఎన్నుకున్నారు. ఐదేండ్ల పరిపాలనా కాలాన్ని పూర్తి చేసుకున్న ప్రధానమంత్రుల్లో నెహ్రూ, గాంధీ కుటుంబంబాలు కాకుండా ఉన్న వ్యక్తి పీవీ నరసింహారావు. భారతదేశానికి తొమ్మిదవ ప్రధానమంత్రిగా 1991 నుంచి 1996 దాకా పనిచేశాడు. ఈ పదవిని అధిష్టించిన దిక్షిణ భారతీయుడు, ఒకే ఒక్క తెలుగువాడు. భారత ఆర్ధిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజంవేసి, కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనతను సొంతం చేసుకున్న వ్యక్తి మన పీవీ నరసింహారావు. 1991లో, భారతదేశం విదేశీ నిల్వల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పుడు పీవీ ప్రభుత్వం ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ అనే మూడు ఆర్థిక సంస్కరణలను తీసుకువచ్చింది.
అందులో నిజం లేదు.. విరాట్ కోహ్లీకి క్షమాపణలు చెప్పిన ఏబీ డివిలియర్స్.. ! ఎంతపని చేశావు బాసు.. !