భారత్ జోడో యాత్ర ఎన్నికల్లో గెలుపు కోసం కాదు.. దేశాన్ని ఏకం చేసేందుకు - కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే

By team teluguFirst Published Jan 30, 2023, 3:17 PM IST
Highlights

దేశాన్ని ఏకం చేసేందుకు భారత్ జోడో యాత్ర చేపట్టామని, ఎన్నికల కోసం కాదని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్ర ముగింపు సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

రాహుల్ గాంధీ నేతృత్వంలో చేపట్టిన భారత్ జోడో యాత్ర ఎన్నికల్లో గెలుపొందడం కోసం కాదని, దేశంలో బీజేపీ, ఆరెస్సెస్ వ్యాప్తి చేస్తున్న విద్వేషాలను ఎదుర్కొనేందుకు అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సోమవారం అన్నారు. భారీ హిమపాతం మధ్య భారత్ జోడో యాత్ర ముగింపు సందర్భంగా జరిగిన ర్యాలీని ఉద్దేశించి ఖర్గే ప్రసంగించారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని గాంధీ నిర్ణయించుకున్నారని తెలిపారు.

భారత్ కు తన బాధ్యతలెంటో తెలుసు - చండీగఢ్‌ జీ 20 సమావేశంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తోమర్

‘‘ఈ యాత్ర ఎన్నికల్లో గెలుపు కోసం కాదు. ద్వేషానికి వ్యతిరేకంగా జరిగింది. దేశంలో బీజేపీ ప్రజలు విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి సమస్యలపై కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు దేశాన్ని ఏకం చేయగలనని రాహుల్ గాంధీ నిరూపించారు.’’ అని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీలు దేశంలో పేద, ధనిక వ్యత్యాసాన్ని పెంచే విధానాన్ని అనుసరిస్తున్నాయని ఖర్గే ఆరోపించారు.

‘‘మోడీజీ, ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ పేదలను పేదలుగా ఉంచాలని, ధనవంతులను ధనవంతులుగా చేయాలని కోరుకుంటున్నాయి. పది శాతం మంది ప్రజలు దేశంలోని 72 శాతం సంపదను దోచుకోగా, 50 శాతం మంది ప్రజలు కేవలం మూడు శాతాన్ని కలిగి ఉన్నారు’’ అని ఆయన అన్నారు. అనంతరం ర్యాలీని ఉద్దేశించి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా మాట్లాడుతూ.. యాత్రలో ప్రజలు చేరుతారా అని మొదట్లో తాను కూడా భయపడ్డానని అన్నారు. ‘‘మా సోదరుడు కన్యాకుమారి నుండి గత ఐదు నెలలుగా నడుస్తున్నాడు. ఈ సుధీర్ఘ ప్రయాణంలో ప్రజలు బయటకు వస్తారా లేదా అని నేను కూడా అనుకున్నాను. కానీ వారు ప్రతీ చోట బయటకు వచ్చారు. దేశంలోని ప్రజలలో ఐక్యత స్పూర్తి ఉంది కాబట్టి వారు బయటకు వచ్చారు ’’ అని ఆమె చెప్పారు.

వివాహేతర సంబంధం పెట్టిన చిచ్చు.. భార్య‌కు వీడియో కాల్‌‌.. ఉరి వేసుకుని బ్యాంకర్ ఆత్మహత్య

రాహుల్ గాంధీ జమ్మూ కాశ్మీర్ లోకి ప్రవేశిస్తున్న సమయంలోనే తమ ఇంటికి వెళ్తున్నట్టు సోనియా గాంధీకిి సందేశం పంపించారని ప్రియాంక గాంధీ గుర్తు చేశారు. ఈ యాత్రకు యావత్ దేశం మద్దతు పలికిందని, దేశంలో జరుగుతున్న రాజకీయాలు దేశానికి మేలు చేయలేవని అన్నారు. విభజించే రాజకీయాలు దేశానికి మేలు చేయలేవని, పాదయాత్ర చేసిన వారు ఆశాకిరణాన్ని చూపారని ఆమె అన్నారు.

చరిత్రాత్మక నిర్ణయం.. ఆలయ ప్రవేశంపై నిషేధానికి వ్యతిరేకంగా 300 మంది దళితులు త్వరలో టెంపుల్‌లోకి.. వివరాలివే

భారత్ జోడో ముగింపు సమావేశంలో సీపీఐ నేత డీ రాజా ప్రసంగిస్తూ దేశంలోని లౌకిక పార్టీలన్నీ ఏకం కావాలని కోరారు. దేశ స్వాతంత్య్రం కోసం అందరం కలిసి పోరాడి బ్రిటిష్ పాలన నుంచి దేశాన్ని విముక్తి చేశామని అన్నారు. ఇప్పుడు బీజేపీ పాలన నుంచి దేశాన్ని విముక్తి చేసేందుకు సెక్యులర్ పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ) నాయకుడు ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని దేశం పశ్చిమ దిక్కు నుంచి తూర్పు దిక్కు వరకు మరో యాత్ర చేపట్టాలని కోరారు. తాను కూడా ఆయనతో కలిసి నడవాలని కోరుకుంటున్నట్టుగా చెప్పారు. తాను, తన తండ్రి, తమ పార్టీ తరపున రాహుల్ గాంధీని అభినందిస్తున్నానని చెప్పారు. రాహుల్ యాత్ర విజయవంతం అయిందని అన్నారు. 

click me!