భారత్ జోడో యాత్ర ఓట్ల కోసం కాదు.. దాని లక్ష్యం రాజకీయాలకు అతీతమైనది - జై రాం రమేష్..

By team teluguFirst Published Nov 15, 2022, 2:05 PM IST
Highlights

భారత్ జోడో యాత్ర లక్ష్యం రాజకీయాలకు అతీతమైనదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ అన్నారు. ఓట్ల కోసం ఈ యాత్ర చేపట్టడం లేదని చెప్పారు. 

భారత్ జోడో యాత్రకు ఓటు బ్యాంకుతో సంబంధం లేదని కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్‌ఛార్జ్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ అన్నారు. యాత్ర లక్ష్యాలు రాజకీయాలకు అతీతమైనవని తెలిపారు. ఇది ఒక రాజకీయ చేపట్టిన యాత్ర అని, ఇందులో రాజకీయ అంశాలు కూడా ఉన్నాయని, అయితే ఇది ఓట్లు రాబట్టేందుకు కాదని తెలిపారు. మంగళవారం ఆయన వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’తో మాట్లాడారు.

తొలిసారి ప్రధాని మోడీ, బ్రిటన్ ప్రధాని సునాక్ ల సమావేశం.. జీ 20 సమ్మిట్ లో పలు ఆసక్తికర సంఘటనలు

రాహుల్ గాంధీ నేతృత్వంలో చేపట్టిన భారత్ జోడో యాత్ర మంగళవారం నాటికి 67వ రోజుకు చేరుకుంది. అయితే ఈ యాత్ర ప్రస్తుతం మహారాష్ట్రలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా సోమవారం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ బీజేపీపై విమర్శలు గుప్పించారు. భారతీయ జనతా పార్టీ రైతుల సమస్యలను విస్మరిస్తూ ప్రజల దృష్టిని మళ్లిస్తోందని ఆరోపించారు. ‘మాకు మేడ్ ఇన్ ఇండియా కావాలి. మేడ్ ఇన్ చైనా కాదు. బీజేపీ ప్రభుత్వం రైతులకు పరిహారం ఇస్తామని హామీ ఇచ్చినా పరిహారం ఇవ్వలేదు’ అని ఆయన ఆరోపించారు. ప్రభుత్వంలో ‘టూ ఇన్ గవర్నమెంట్, టూ ఇన్ మార్కెట్’ వ్యవస్థ ఉందని విమర్శించారు. సైనికుల రిక్రూట్‌మెంట్ కోసం ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకాన్ని నిరుపయోగమైనదని రాహుల్ గాంధీ అభివర్ణించారు. 

అగ్నిపథ్ పథకం సాయుధ బలగాలను నిర్వీర్యం చేస్తుంది..: రాహుల్ గాంధీ

ఇదిలా ఉండగా త్వరలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ జోనల్, లోక్‌సభ నియోజకవర్గాల వారీగా పరిశీలకులను సోమవారం నియమించింది. 182 మంది సభ్యులున్న రాష్ట్ర అసెంబ్లీకి డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

బిర్సా ముండాకు నివాళులర్పించిన ప్రధాని మోడీ.. ప్రభుత్వ పథకాల వెనుక గిరిజనుల స్ఫూర్తి అంటూ వ్యాఖ్య

కాగా, రాహుల్ గాంధీ నేతృత్వంలో చేపట్టిన భారత్ జోడో యాత్ర మంగళవారం నాటికి 69వ రోజుకు చేరుకుంది. సెప్టెంబర్ 7వ తేదీన తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైన ఈ  పాద యాత్ర ఇప్పటివరకు ఆరు రాష్ట్రాల్లోని 28 జిల్లాల గుండా సాగింది. భారత్ జోడో యాత్ర నవంబర్ 7న మహారాష్ట్రలోని డెగ్లూర్ లోకి ప్రవేశించింది. ఇప్పటివరకు రాష్ట్రంలోని నాందేడ్, హింగోలి జిల్లాలను కవర్ చేసింది. నవంబర్ 20న మధ్యప్రదేశ్ లోకి ప్రవేశించే ముందు ఈ రాహుల్ పాదయాత్ర మహారాష్ట్రలోని ఐదు జిల్లాల్లో 382 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేస్తుంది. దాదాపు 150 రోజుల పాటు 3,570 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తరువాత జనవరిలో జమ్మూ కాశ్మీర్లో ఈ యాత్ర ముగుస్తుంది. అయితే భారతదేశ చరిత్రలో ఏ భారతీయ రాజకీయ నాయకుడు కాలినడకన ఇంత సుదీర్ఘ పాదయాత్ర చేపట్టలేదని కాంగ్రెస్ గతంలో పేర్కొంది. 

click me!