అగ్నిపథ్ పథకం సాయుధ బలగాలను నిర్వీర్యం చేస్తుంది..: రాహుల్ గాంధీ

By Mahesh RajamoniFirst Published Nov 15, 2022, 1:44 PM IST
Highlights

Bharat Jodo Yatra: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్ర మంగళవారం (నవంబర్ 15) నాటికి 69వ రోజుకు చేరుకుంది. మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలోని ఫలేగావ్ నుండి రాహుల్ గాంధీ మంగళవారం ఉదయం పాద యాత్రను ప్రారంభించారు. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్, మహారాష్ట్ర మాజీ మంత్రి యశోమతి ఠాకూర్, ఇతర పార్టీ నాయకులు ఆయన వెంట నడిచారు.
 

Congress leader Rahul Gandhi: అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టడంపై నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ.. ఈ పథకం సాయుధ బలగాలను నిర్వీర్యం చేస్తుందని అన్నారు. ‘‘దేశం కోసం తమ ప్రాణాలను అర్పించేందుకు సాయుధ బలగాల్లో యువ జవాన్లు సిద్ధంగా ఉన్నారు. అయితే ఇక్కడ కూడా మోడీ ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చింది. ఒక సైనికుడికి అందుబాటులో ఉన్న అత్యుత్తమ శిక్షణ ఇవ్వాలి, కానీ ఇక్కడ వారికి ఆరు నెలలు మాత్రమే శిక్షణ ఇవ్వబడుతుంది. సవాళ్లను ఎదుర్కోవడానికి ఇది వారిని సిద్ధం చేస్తుందని మీరు నిజంగా అనుకుంటున్నారా?” అని హింగోలి జిల్లాలోని కలేగావ్‌లో జరిగిన సమావేశంలో రాహుల్ ప్రశ్నించారు.

“అగ్నిపథ్ పథకం కింద ఇచ్చే ఉద్యోగాలు కూడా శాశ్వతం కాదు. నాలుగేళ్ల తర్వాత వారిని ఇంటికి పంపిస్తారు. దీంతో నిరుద్యోగం మరింత పెరుగుతుంది. సాయుధ శిక్షణ పొందిన నిరుద్యోగ యువకుడు ఈ దేశంలో ఖాళీగా కూర్చుంటే ఏమవుతుంది..?” అని ఆయన ప్రశ్నించారు. తమపై ఆధిపత్యం చెలాయించే శక్తులకు భయపడవద్దని ప్రజలను కోరిన రాహుల్, భయం ద్వేషాన్ని తెస్తుందని అన్నారు. మరింతగా కేంద్రంలోని బీజేపీ సర్కారుపై విమర్శల దాడిని కొనసాగించిన రాహుల్ గాంధీ.. “మేము మేడ్ ఇన్ చైనా గురించి మాట్లాడుతాము.. అక్కడ తయారైన వస్తువులను ఉపయోగిస్తాము. దీని వల్ల ఎవరికి లాభం? వాటిని ఇక్కడికి తీసుకొచ్చిన కొన్ని పరిశ్రమలకు.. మోడీ ప్రభుత్వం పౌరులను హింస, మతం, కుల సంబంధిత సమస్యలతో బిజీగా ఉంచుతుండగా.. ఉపాధి, విద్య, ఆరోగ్యం వంటి నిజమైన సమస్యల గురించి అస్సలు మాట్లాడటం లేదు” అని ఆయన మండిపడ్డారు. మోడీ పాలనలో పేదల ఒరిగిందేమీ లేదన్నారు. రైల్వేలు, బ్యాంకులు, ఆసుపత్రులు సహా ప్రైవేటీకరణ చేస్తున్నారని విమర్శించారు. 

కాగా, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్ర మంగళవారం (నవంబర్ 15) నాటికి 69వ రోజుకు చేరుకుంది. మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలోని ఫలేగావ్ నుండి రాహుల్ గాంధీ మంగళవారం ఉదయం పాద యాత్రను ప్రారంభించారు. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్, మహారాష్ట్ర మాజీ మంత్రి యశోమతి ఠాకూర్, ఇతర పార్టీ నాయకులు ఆయన వెంట నడిచారు. ఈ క్రమంలోనే ఆయన ప్రముఖ గిరిజన నాయకుడు బిర్సా ముండా జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. 

 

महान स्वतंत्रता सेनानी और आदिवासी समुदाय के पूजनीय नेता, धरती आबा, भगवान बिरसा मुंडा जी की जयंती पर उन्हें शत शत नमन।

उनका संघर्ष और हक़ की आवाज़ को हमेशा बुलंद रखने का जज़्बा हम सभी को सदा प्रेरित करता रहेगा। pic.twitter.com/SkwB5EciIQ

— Rahul Gandhi (@RahulGandhi)

కాగా, సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారి నుండి ప్రారంభమైన కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర ఇప్పటివరకు ఆరు రాష్ట్రాల్లోని 28 జిల్లాలను కవర్ చేసింది. భారత్ జోడో యాత్ర నవంబర్ 7న మహారాష్ట్రలోని డెగ్లూర్ లోకి ప్రవేశించింది. ఇప్పటివరకు రాష్ట్రంలోని నాందేడ్, హింగోలి జిల్లాలను కవర్ చేసింది. నవంబర్ 20న మధ్యప్రదేశ్ లోకి ప్రవేశించే ముందు ఈ రాహుల్ పాదయాత్ర మహారాష్ట్రలోని ఐదు జిల్లాల్లో 382 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది. దాదాపు 150 రోజుల పాటు 3,570 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తరువాత జనవరిలో జమ్మూ కాశ్మీర్లో ముగిసే భారత్ జోడో యాత్ర.. 12 రాష్ట్రాల గుండా వెళుతుంది.

click me!