బెంగళూరులో కరెంట్ కోతలు : రోజుకు 7 గంటల పైనే, బుధవారం వరకు తిప్పలే .. ఏ ఏ ప్రాంతాల్లోనంటే..?

Siva Kodati |  
Published : Aug 01, 2023, 04:17 PM IST
బెంగళూరులో కరెంట్ కోతలు : రోజుకు 7 గంటల పైనే, బుధవారం వరకు తిప్పలే .. ఏ ఏ ప్రాంతాల్లోనంటే..?

సారాంశం

దేశ ఐటీ రాజధాని బెంగళూరు నగరం విద్యుత్ కోతలతో అల్లాడిపోతోంది. పలు అభివృద్ధి కార్యక్రమాలు, మరమ్మత్తుల కారణంగా రోజుకు దాదాపు 7 గంటలపైనే విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. బుధవారం వరకు కరెంట్ కట్‌లు కొనసాగుతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 

గడిచిన కొద్దిరోజులుగా వరదలు, భారీ వర్షాలతో దేశం వణికిపోయిన సంగతి తెలిసిందే. సహాయ పునరావాస కార్యక్రమాల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ఇతర బృందాలు తీవ్రంగా శ్రమించాయి. అయితే దేశ ఐటీ రాజధాని బెంగళూరు నగరం అప్రకటిత విద్యుత్ కోతలతో అల్లాడుతోంది. బెంగళూరు విద్యుత్ సరఫరా కంపెనీ (బెస్కామ్) , కర్ణాటక పవర్ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (కెపిటిసిఎల్) అనేక పనులను చేపడుతున్నాయి. దీంతో బెంగళూరులోని చాలా ప్రాంతాలు బుధవారం వరకు విద్యుత్ కోతలను ఎదుర్కొంటాయి ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రీకండక్టరింగ్ , త్రైమాసిక నిర్వహణ ప్రాజెక్టులు జరుగుతున్నాయి. వీటిలో చాలా వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించడం వల్ల దాదాపు ఏడు గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది.

విద్యుత్ కోతలు : ఏ ఏరియాలో, ఏ రోజునంటే ..?

మంగళవారం.. బుధవారం :

సింగేనహళ్లి, కనివేహళ్లి, కెంచాపుర, దేవరహోసల్లి, ఆర్‌డి కావల్‌, బుక్కపట్న, హోసహళ్లి, హుణసెకట్టె, యారడకట్టె, నేరాలగుడ్డ, రామలింగాపురం, సాలాపూర్‌, బాలాపుర, మాదేనహళ్లి, రంగనాథపుర, నిమ్మెమరదల్లి, ఎస్‌ రంగనాహళ్లి, హుయిల్‌దోర్‌, నిమ్మెమరదల్లి, ఎస్‌ రంగనాహల్లి, హుయిల్‌దోర్‌, గంపదనహళ్లి అల్లి, మన్నమ్మ దేవాలయం , సాక్షిహళ్లి, తుప్పడకోన, కరేమాదనహళ్లి, కురుబరహళ్లి, మురుడేశ్వర సిరామిక్ ఫ్యాక్టరీ, జనకల్, కిలారదహళ్లి, తండా, రామనహళ్లి

గురువారం:

ఎస్. నేరల్కెరె జిపి, కైనోద్యు జిపి, శ్రీరాంపుర జిపి, తాళ్య, హులికెరె, కుమినఘట్ట, వెంకటేశపుర, మాలసింగనహళ్లి, ఘటిహోసల్లి, సింగెనహళ్లి, కనివేహళ్లి, కెంచాపుర, దేవరహోసల్లి, ఆర్‌డి కవల్‌, బుక్కపట్న, హోసహళ్లి, హుణసెకట్టె, బుక్కపట్న, హొసహళ్లి, హుణసెకరుడకత్తె, రామపురాడకత్తె, ఎస్. మాదేనహళ్లి, బుక్కపట్న, రంగనాథపుర, నిమ్మెమరదల్లి, ఎస్ రంగనహళ్లి, హుయిల్‌డోర్, కంబదహళ్లి, గిద్దనహళ్లి, సాక్షిహళ్లి, తుప్పడకోన, కరేమాదనహళ్లి, మన్నమ్మ దేవాలయం, సాక్షిహళ్లి

తుప్పాడకోన, కరేమాదనహళ్లి, మురుడేశ్వర సిరామిక్‌ ఫ్యాక్టరీ, తాళ్లపల్లి రామదానహల్లి నల్కుదురె, దొడ్డఘట్ట , కథలగెరె, కరిగనూర్, బెళల్‌గెరె, త్యావణిగె, హరేహళ్లి, నవిలేహల్ మరియు సంబంధిత గ్రామాలు, బిదరగడ్డే, గోవినకోవి, తక్కనహళి, హోలెమాడపుర, కమ్మరగట్టె, చీలూర్, మలాలి, గోపగొండనహళ్లి, కురువ, కెంగట్టె, గొవడ్నకట్టె, గోడ్‌నకట్టె, గోడ్‌నకట్టె , బల్లేశ్వర, అరకెరె, హిరేగోనిగెరె, హనుమసాగర, మరికొప్ప, సొరటూరు, కట్టుగే, అరుండి, తీర్థరామేశ్వర, కుందూరు, కూలంబి, తిమ్లాపుర, యక్కనహళ్లి, ముక్తేనహళ్లి, హనుమనహళ్లి, నేరలగుండి, న్యామతి, కోడికొప్పా, న్యామతి, కోడికొప్పా, వడ్లుజొహత్త్ సాల్బన్‌వి, మరియు సంబంధిత గ్రామాలు, చన్నేనహళ్లి, క్యాసినకెరె, లింగాపుర, రాంపుర, హోత్యాపురా, బెనకనహళ్లి, హీరేబాసూర్, కులఘట్టె, సాసువేహళ్లి మరియు సంబంధిత గ్రామాలు, సవలంగ, కొడ్తాలు, చిన్నికట్టె, గంజినహళ్లి, మాదాపుర, ముస్సేనలు, జయనగర, మాచెగొండనహళ్లి మరియు క్యాత్‌హినకొప్పనహళ్లి ప్రాంతాల్లో విద్యుత్ కోతలు అమలు కానున్నాయి. 
 

PREV
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !