ఏడాదికి రూ.58లక్షల జీతం.. కానీ సంతోషం లేదంటూ.. ఓ యువకుడి ఆవేదన..!

Published : Apr 22, 2023, 11:40 AM IST
ఏడాదికి రూ.58లక్షల జీతం.. కానీ సంతోషం లేదంటూ.. ఓ యువకుడి ఆవేదన..!

సారాంశం

కొందరికి డబ్బు ఆనందాన్ని ఇస్తుంది. కొందరికి ఇవ్వదు. ఈ విషయాలన్నీ ఇప్పుడు ఎందుకు అనే అనుమానం మీకు కలగొచ్చు. బెంగళూరు సాఫ్ట్‌వేర్ డెవలపర్ అధిక జీతంతో ఉద్యోగం చేసిన తర్వాత కూడా ఒంటరితనం గురించి చేసిన పోస్ట్ ట్విట్టర్‌లో ఈ చర్చకు దారితీసింది.  

మన చుట్టూ ఉన్న చాలా మంది డబ్బు లేక, కావాల్సింది కొనుక్కోలేక ఇబ్బందులు పడుతున్నవారు ఉన్నారు. వారికి డబ్బు అవసరం అది లేక వారు కష్టాలు అనుభవిస్తున్నారు. కానీ... డబ్బు ఉన్నవారందరూ ఆనందంగా ఉన్నారా..? డబ్బు ఆనందాన్ని కొనగలదా..? ఈ ప్రశ్నకు ఎవరి దగ్గరా సమాధానం ఉండదు. చాలా సార్లు ఈ విషయం పై చాలా మంది డిబెట్ కూడా చేసి ఉంటారు. అయితే... దీనికి సరైన సమాధానం ఎవరికీ దొరికి ఉండకపోవచ్చు. కొందరికి డబ్బు ఆనందాన్ని ఇస్తుంది. కొందరికి ఇవ్వదు. ఈ విషయాలన్నీ ఇప్పుడు ఎందుకు అనే అనుమానం మీకు కలగొచ్చు. బెంగళూరు సాఫ్ట్‌వేర్ డెవలపర్ అధిక జీతంతో ఉద్యోగం చేసిన తర్వాత కూడా ఒంటరితనం గురించి చేసిన పోస్ట్ ట్విట్టర్‌లో ఈ చర్చకు దారితీసింది.

24 ఏళ్ల యువకుడు రాసిన నోట్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.ఈ పోస్ట్‌ను వాస్తవానికి గ్రేప్‌వైన్‌లోని వ్యక్తి భాగస్వామ్యం చేసారు, ఇది నిజాయితీగా పనిచేసే చోట సంభాషణల కోసం ఒక యాప్. 24 ఏళ్ల అతను బెంగళూరులోని FAANG కంపెనీలో పని చేస్తూ సంవత్సరానికి 58 లక్షలు సంపాదించినట్లు సమాచారం.
ఆ వ్యక్తి తన నోట్‌కి "జీవితంలో సంతృప్త భావన" అని శీర్షిక పెట్టాడు. తాను గత 2.9 సంవత్సరాలుగా పని చేస్తున్నానని చెప్పాడు. తాను జీవితంలో ఒంటరితనాన్ని అనుభవిస్తున్నానని చెప్పాడు. సంవత్సరానికి రూ.58లక్షలు సంపాదించినా తనకు సంతోషం లేదని అతను చెప్పడం గమనార్హం.

 

24 ఏళ్ల యువకుడు తన జీవితాన్ని మరింత ఆసక్తికరంగా మార్చుకోవడానికి సలహా ఇవ్వడాలని కోరడం విశేషం. ఈ ఒంటరితనం నుంచి బయటపడటం ఎలాగో చెప్పమని కోరడం విశేషం. కాగా.. అతని పోస్టు నెట్టింట వైరల్ గా మారింది. సదరు యువకుడిపై అందరూ సానుభూతి చూపించడం గమనార్హం. కొందరు దాని నుంచి బయటపడేందుకు చాలా సలహాలు కూడా ఇచ్చారు. సంతోషకరమైన జీవితానికి డబ్బు అవసరమని, కానీ కేవలం డబ్బు ఉంటే సంతోషం ఉండదు అని కొందరు కామెంట్ చేయడం విశేషం. కొందరేమో.. మీ సంతోషానికి, ఒంటరి తనానికి డబ్బు అడ్డు కాదని, సయమాన్ని తెలివిగా ఉపయోగించుకుంటే ఆనందం దొరుకుతుందని సలహా ఇచ్చారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Putin India Tour: భారత్ లో అడుగుపెట్టిన పుతిన్ సెక్యూరిటీ చూశారా? | Modi Putin | Asianet News Telugu
Putin Tour: భారత్‌కి పుతిన్‌ రాక.. వారణాసిలో దీపాలతో స్వాగతం | Vladimir Putin | Asianet News Telugu