
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని ఐటీఓ సమీపంలోని ఢిల్లీ వికాస్ భవన్‌లో ఈరోజు అగ్నిప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు. నాలుగు అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయని వారు తెలిపారు. అగ్నిమాపక శాఖకు ఉదయం 8.30 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదంపై సమాచారం అందింది. వెంటనే రెస్క్యూ టీం అక్కడికి చేరుకోవడంతో.. ప్రస్తుతం అగ్నిమాపక చర్యలు కొనసాగుతున్నాయి.
ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా సెలవు కావడంతో అనేక కార్యాలయాలు మూసేశారు. దీంతో ప్రమాదం తీవ్రత తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.