
పాట్నా : హోంవర్క్ చేయలేదని ఓ ఏడేళ్ల చిన్నారిని రెసిడెన్షియల్ స్కూల్ యాజమాన్యం విచక్షణా రహితంగా కొట్టింది. దీంతో ఆ చిన్నారి మరణించాడు. ఈ ఘటన బీహార్‌లో వెలుగు చూసింది. చిన్నారి మృతికి యాజమాన్యం కొట్టడమే కారణం అని అతని స్నేహితులు పేర్కొన్నారు. ఆదిత్య యాదవ్ అనే ఏడేళ్ల చిన్నారి సహర్సా జిల్లాలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో కెజి లోయర్ చదువుతున్నాడు.
ఆదిత్య హోంవర్క్ పూర్తి చేయలేదు. దీంతో కోపానికి వచ్చిన సుజీత్ కుమార్ బుధవారం చెక్క కర్రతో ఆదిత్యను కొట్టాడని అతని స్నేహితుల్లో ఒకరు తెలిపారు. హాస్టల్‌లో అతనితో పాటు ఉంటున్న ఆదిత్య స్నేహితులు, సీనియర్లు మరుసటి రోజు ఉదయం అతను మంచంపై శవమై కనిపించాడని తెలిపారు. నిందితుడు సుజీత్ కుమార్ వద్దకు ఈ విషయం తీసుకెళ్లినప్పుడు, దాన్ని అతను చాలా తేలిగ్గా తీసుకున్నాడని, మృతదేహాన్ని ఆసుపత్రిలో ఉంచమని సలహా ఇచ్చాడని పాఠశాలలోని 4వ తరగతి విద్యార్థి చెప్పాడు.
మోదీ, అదానీల మధ్య సంబంధాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాను.. ఆ భయం ప్రధాని కళ్లలో చూశాను: రాహుల్
ఆ తరువాత, ఆదిత్య కుమార్ స్పృహతప్పి పడిపోయాడని సుజీత్ కుమార్ బాలుడి తండ్రికి సమాచారం అందించాడు. అయితే, ఆదిత్య తండ్రి తన కొడుకు పాఠశాలకు చేరుకోకముందే, ఆదిత్యను నర్సింగ్ హోమ్‌లో చనిపోయినట్లు ప్రకటించారు. తాను బాలుడిని కొట్టడం వల్లే చనిపోయాడని.. తనపై వచ్చిన ఆరోపణలను సుజీత్ కుమార్ కొట్టిపారేశాడు. కానీ, అతను ఇప్పుడు కనిపించకుండా పోయాడు.
బాలుడిని నర్సింగ్‌హోమ్‌కు తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. అతని శరీరంపై ఎలాంటి గాయాల గుర్తులు లేవని, శవపరీక్ష తర్వాతే అతని మృతికి గల కారణాలు తెలియవచ్చని అన్నారు. పరస్పర భిన్నమైన వాదనల్లో.. కొట్టడం వల్ల బాలుడి శరీరం వాచిపోయిందని మరో విద్యార్థి చెప్పాడు. పాఠాలు గుర్తు పెట్టుకోనందుకు ఆదిత్యను వరుసగా రెండు రోజులు కొట్టారని తెలిపారు.
బాధితుడి తండ్రి ప్రకాష్ యాదవ్ మాట్లాడుతూ, ఆదిత్య చివరిసారిగా హోలీకి ఇంటికి వచ్చాడని.. మార్చి 14న తన హాస్టల్‌కు తిరిగి వచ్చాడు. "నా కొడుకు స్కూల్‌లో స్పృహతప్పి పడిపోయాడని, ఆసుపత్రికి తీసుకెళ్తున్నామని నాకు గురువారం సమాచారం అందింది. కానీ నేను అక్కడికి చేరుకునే లోపే ప్రైవేట్ క్లినిక్ లో, ఆదిత్య మరణించాడు. సుజీత్ కుమార్ అదృశ్యమయ్యాడు”అని అతను చెప్పాడు.
పాఠశాలలో కొట్టడం వల్లే తన కొడుకు చనిపోయాడని విద్యార్థి తండ్రి ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వస్తే కానీ ఈ విషయంలో ఎలాంటి నిర్థారణకు రాలేమని పోలీసులు తెలిపారు. సుజీత్ కుమార్ ఈ విషయంఒక వార్తాపత్రికతో ఫోన్ లో మాట్లాడుతూ, బాలుడు ఉదయం లేవకపోవడంతో, యాజమాన్యం అతడిని స్థానిక వైద్యుడి వద్దకు తీసుకెళ్లారని తెలిపాడు. అక్కడి వైద్యులు సహర్సాకు రిఫర్ చేశారు. అక్కడికి తీసుకెళ్లాక.. చికిత్స పొందుతూ మృతి చెందాడు.. అని తెలిపాడు.