
భారత్ లో నివాసం ఉండే తన పౌరులకు ఆమెరికా పలు హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర తెలంగాణతో పాటు దేశంలోని అనేక ఇతర రాష్ట్రాలకు ప్రయాణించవద్దని సూచించింది. దేశంలో మావోయిస్టు కార్యకలాపాలను ప్రస్తావిస్తూ.. మధ్య, తూర్పు భారతదేశానికి ప్రయాణం చేయవద్దని చెప్పింది.
ఇటీవల హైదరాబాద్ నగర పోలీసులు పాకిస్తాన్ ఆధారిత లస్కర్-ఎ-తోయిబాతో ముడిపడి ఉన్న ఉగ్రవాద సంబంధిత కార్యాకలాపాలను హైదరాబాద్ నగర పోలీసులు ఛేదించిన నేపథ్యంలో ఈ హెచ్చరికలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. అయితే స్టేట్ డిపార్ట్‌మెంట్.. ఇండియా ట్రావెల్ అడ్వైజరీ స్థాయిని స్కేల్ 2కి తగ్గించింది. (ఇందులో ఒకటి నుంచి నాలుగు స్కేల్స్ ఉంటాయి.) రెండో స్కేల్ అంటే అత్యధికం.
ఈ ఉగ్రవాద మాడ్యూల్ లో ముగ్గురు హైదరాబాద్ స్థానికులు ఉన్నారు. వారు పాకిస్తాన్ కు చెందిన వారి ఐఎస్ఐ నాయకులతో టచ్ లో ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి. వారు భారీ సమూహాలు, బహిరంగ ప్రదేశాలు, పేలుడు పదార్థాలను ఉపయోగించి కీలకమైన స్థావరాలపై దాడులు చేయాలని ప్రయత్నిస్తున్నారని పోలీసులు తెలుసుకున్నారు. హైదరాబాద్ తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో వారి కాంటాక్ట్ లను ట్రాక్ చేయడానికి పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.
విషాదం : మహారాష్ట్రలో బస్సులో చెలరేగిన మంటలు.. ఎనిమిదిమంది సజీవదహనం...
అయితే భారీ దాడిని నివారించినప్పటికీ అరెస్టయిన ముగ్గురి కాంటాక్ట్ లు, సహచరులపై నిఘా కొనసాగుతుందని పోలీసులు పేర్కొన్నారు. కాగా.. ఇది సాధారణ హెచ్చరిక అని, ప్రస్తుతానికి భయపడాల్సిన పని లేదని సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు.
తూర్పు మహారాష్ట్ర, ఉత్తర తెలంగాణ నుంచి పశ్చిమ బెంగాల్ మీదుగా, ముఖ్యంగా ఛత్తీస్గఢ్, జార్ఖండ్ లోని గ్రామీణ ప్రాంతాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టు తీవ్రవాద గ్రూపులు పెద్ద ఎత్తున క్రియాశీలకంగా ఉన్నాయని అమెరికా అడ్వైజరీ తెలిపింది.
కాగా.. నక్సలైట్లు స్థానిక పోలీసులు, పారామిలటరీ బలగాలు, ప్రభుత్వ అధికారులపై తరచూ ఉగ్రవాద దాడులు నిర్వహిస్తున్నారు. అయితే పశ్చిమ బెంగాల్ గుండా తూర్పు మహారాష్ట్ర, ఉత్తర తెలంగాణ నుండి గ్రామీణ ప్రాంతాలలోని యుఎస్ పౌరులకు అత్యవసర సేవలను అందించడానికి తగినంత సామర్థ్యం లేదు. ముప్పు ప్రభావం కారణంగా.. నక్సలైట్ కార్యకలాపాలు ఉన్న రాష్ట్రాలకు వచ్చే యూఎస్ ప్రభుత్వ ప్రయాణికులందరూ ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి బాధ్యత వహించే యుఎస్ కాన్సులేట్ నుండి ప్రత్యేక అనుమతిని పొందాల్సి ఉంటుంది. ఈ రాష్ట్రాల్లోని రాజధాని నగరాలకు మాత్రమే ప్రయాణించే అమెరికా అధికారులకు ముందస్తు అనుమతి అవసరం లేదని తెలిపింది.
Solar eclipse 2022 : ఈ యేడాది పాక్షిక సూర్యగ్రహణం.. ఎప్పుడంటే..
అలాగే ఉగ్రవాదం, పౌర అశాంతి కారణంగా జమ్మూకశ్మీర్ లో సాయుధ ఘర్షణలకు అవకాశం ఉందని, కాబట్టి భారత్-పాకిస్తాన్ సరిహద్దుకు 10 కిలోమీటర్ల దూరంలో ప్రయాణించరాదని అమెరికా తన పౌరులకు సూచించింది. ట్రావెల్ అడ్వైజరీ ప్రకారం “భారతదేశంలో వేగంగా పెరుగుతున్న నేరాలలో అత్యాచారం ఒకటని భారతీయ అధికారులు నివేదిస్తున్నారు. లైంగిక వేధింపుల వంటి హింసాత్మక నేరాలు పర్యాటక ప్రదేశాలలో, ఇతర ప్రదేశాలలో జరిగాయి. ’’ అని పేర్కొంది.